Featuredఅంతర్జాతీయ వార్తలుక్రైమ్ న్యూస్జాతీయ వార్తలుటూరిజంప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

మునిగిన బతుకులు

పాపికొండలు విహార యాత్రలో విషాదం…

  • 40మంది గల్లంతు.. 12మంది మృతి
  • 61 మందితో ప్రయాణిస్తున్న బోటు
  • బోటులో 150 లైఫ్‌ జాకెట్లు..

గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 61 మందితో వెళ్తున్న బోటు మునిగింది. దేవీపట్నం మండలం కచులూరు వద్ద 61 మందితో కూడిన బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 12మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. మరో 16మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. బోటు పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్‌ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం. పోలవరం గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు. మునిగిపోయిన బోటులో 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. గండిపోచమ్మ ఆలయం నుంచి రాయల వశిష్ఠ బోటులో.. ప్రయాణికులు పాపికొండలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటు మునిగిన సమయంలో సవిూపంలోని తూటుకుంటా గ్రామస్తులు లైఫ్‌ జాకెట్స్‌ ధరించిన 14 మందిని కాపడినట్లు సమాచారం. గోదావరిలో భారీ వరద ఉధృతి ఉన్న సమయంలో బోటు ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి సీనియర్‌ అధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సహాయక బృందాలు ఇప్పటి వరకు 7మృతదేహాలను వెలికితీశాయి. సురక్షితంగా ఒడ్డుకు చేరిన వారిలో 16మందిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోటులో ఉన్న వారిలో 12 మంది హైదరాబాద్‌ వాసులు, 17 మంది వరంగల్‌ వాసులు, ముగ్గురు విజయవాడ వాసులున్నట్లు తెలుస్తోంది. విశాఖ, రాజమహేంద్రవరానికి చెందిన 30 మంది ఉన్నారని సమాచారం. ప్రమాదం నుంచి బయటపడిన వారిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు.

గల్లంతైన వారు : గాంధీ, జగన్నాథం, లక్ష్మణ్‌, మహేశ్వరరావు, రమణ, జానకీ రామ్‌, దశరథం, జగదీశ్‌, మధు, విశాల్‌

ఇదే చోట రెండు ప్రమాదాలు

కచ్చలూరు ప్రాంతంలో 80 అడుగుల లోతు ఉంటుంది. ఈ ప్రాంతంలో గోదావరి నది సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. 1964లో కచ్చలూరులో ఉదయ్‌ భాస్కర్‌ అనే బోటు మునిగింది. ఈ ఘటనలో 60 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగి 8 మంది మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలు కచ్చలూరులోనే చోటు చేసుకొన్నాయి. ఆదివారం నాడు కూడ కచ్చలూరు ప్రాంతంలోనే బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో బోటులో 61 మంది ఉన్నారని సమాచారం. బోటులో లైఫ్‌ జాకెట్లు వేసుకొన్న వారు బయట పడినట్టుగా సమాచారం..

బోటులో 150 లైఫ్‌ జాకెట్లు..

తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్‌.. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం సవిూక్షిస్తూనే ఉన్నారు. అవసరమైతే నేవీ సహకారం తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరును ఆదేశించారు. కాగా ప్రమాదానికి గురైన లాంచీ కెపాసిటీ 90 మందని.. లాంచీలో 150 లైఫ్‌ జాకెట్లు కూడా ఉన్నాయని లాంచీ ఓనర్‌ తెలిపారు. ప్రమాద ప్రదేశంలో సుడిగుండం ఉన్నట్టు తెలిపారు. అక్కడ డ్రైవర్లు సరిగా నడపలేదని.. అలాగే లాంచీ మునిగిన చోట ఫోన్‌ సిగ్నల్స్‌ లేవని వెల్లడించారు. ఇప్పటివరకు 25 మందిని రక్షించారు. బోటులో 61 మంది ప్రయాణికులున్నారు. కాగా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

ఆ లాంచీకి టూరిజం శాఖ అనుమతి లేదు: మంత్రి అవంతి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో ఆదివారం పర్యాటకుల లాంచీ మునిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ అవంతి శ్రీనివాస్‌ స్పందించారు. గోదావరిలో లాంచీ తిరిచేందుకు పర్యాటక శాఖ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని లాంచీని తిప్పుతున్నారని తెలిపారు.గల్లంతైన వారి కోసం సహాయచర్యలు కొనసాగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్‌ కోసం రెండు లాంచీలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

గోదావరి పడవ ప్రమాదంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర పర్యాటకులతో ఉన్న పడవ మునిగిన ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. పడవ మునిగిపోయిందన్న విషయం తెలిసి బాధ కలిగిందన్నారు. సుమారు 50 మంది గల్లంతయ్యారని తనకు తెలిసిందన్నారు. పర్యాటకుల ఆచూకీ, ఇతర సహాయ చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటన ప్రదేశానికి వెళ్ళాల్సిందిగా జనసేన నాయకులకు, శ్రేణులకు పవన్‌ విజ్ఞప్తి చేశారు. అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

పడవ ప్రమాదంపై స్పందించిన ¬ంమంత్రి సుచరిత

తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం వద్ద పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ¬ంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ప్రమాద సమయంలో గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉందన్నారు. బోటులో 61 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోందని.. ప్రయాణికుల దగ్గర లైఫ్‌ జాకెట్లు ఉన్నాయని సుచరిత తెలిపారు. గల్లంతైన వారి కోసం పోలీస్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారని ¬ంమంత్రి వెల్లడించారు. మరోవైపు గల్లంతైన వారిలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లుగా సమాచారం. సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కచులూరు మందం బయలుదేరాయి. ఒక్కో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందంలో 30 మంది సభ్యులు, ఒక్కో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందంలో 40 మంది సభ్యులు ఉంటారు. సహాయక చర్యల కోసం పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లను అధికారులు ఘటనాస్థలికి పంపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close