ముచ్చటగా మూడో సారి” సునీత రెడ్డి “

0


వికారాబాద్ జిల్లాలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు


వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ” సునీత రెడ్డి “

.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తిరుగులేని ప్రజా నాయకులుగా వెలుగుతున్న పట్నం దంపతులు మరోసారి వికారాబాద్ పరిషత్ పగ్గాలను చేపట్టనున్నారు మొదటిగా బంటారం మండలం జడ్పిటిసి అభ్యర్థిగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సునీత మహేందర్రెడ్డి రెండోసారి యలల్ మండలం నుంచి పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలం నుంచి జడ్పిటిసి అభ్యర్థిగా గెలుపొంది వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా శనివారం నాడు ఎన్నిక కాబోతున్నారు టిఆర్ఎస్ పార్టీ అధిష్ఠాన వర్గం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్రెడ్డి పేరును ఖరారు చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన జడ్పిటిసి అంత టిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న క్యాంపులో ఉన్నారు అక్కడ వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరు అనే విషయమై చర్చించి మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసి పార్టీ అధిష్టానవర్గానికి నివేదించినట్లు తెలుస్తుంది వీరంతా శనివారం టిఆర్ఎస్ పార్టీ క్యాంపు నుంచి వచ్చి వికారాబాద్ లో అధికారికంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సునీత మహేందర్రెడ్డి ని ఎన్నుకోవడానికి అన్ని మార్గాలను సుగమం చేసుకున్నారు ప్రస్తుతం మూడో సారి ఇ వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సునీత మహేందర్రెడ్డి ఇ బాధ్యతలు చేపట్టబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు దీంతో ఆయన కొంతకాలంగా పార్టీలో ఉంటూ తటస్థంగా ఉన్నారు తర్వాత సానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయంగా బలం పెంచుకోవడానికి కోటిపల్లి మండలం నుంచి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి ఇ గెలుపొందడానికి చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగానే ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఎమ్మెల్సీగా గెలుపొందారు తాండూరు నుంచి ఓటమిపాలైన తర్వాత జరిగిన పరిణామాల పరంపరలో ఇద్దరు దంపతులు మళ్లీ పదవులు దక్కించుకున్నారు రాజకీయంగా తిరుగులేని వ్యక్తులుగా వికారాబాద్ జిల్లాలో చలామణి అయ్యే అవకాశం ఉంది తాండూరులో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఓటమిపాలు కాదని రాజకీయంగా దూరంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావించారు కానీ పట్టువీడని విక్రమార్కుడు మళ్లీ అన్ని పదవులు దక్కించుకొని అజేయుడుగా తిరిగి వికారాబాద్ గడ్డపై అడుగు పెట్టి రాజకీయ పగ్గాలు చేపట్టి ఇ ఇ పార్టీని బలోపేతం చేయడానికి పూనుకున్నారు కాగా రాజకీయంగా కొందరు ఎమ్మెల్యేలు లు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కి అనుకూలమైతే మరికొందరు దూరం కావచ్చునని భావిస్తున్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకుండా తామే అన్ని కార్యక్రమాలు నిర్వహించారు కానీ ప్రస్తుతం రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పట్నం దంపతులు పాగా వేసి ఇ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు దీంతో కొందరు రాజకీయ నాయకులకు మింగుడు పడక పోయినప్పటికీ మరో వర్గం సంతోషంగా వీరి విజయాన్ని ఆహ్వానిస్తున్నారు దీంతో వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో శరవేగంగా రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఏది ఏమైనా పట్నం దంపతులు తమ ఉనికిని చాటుకుని ప్రజలకు సేవలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని సిద్ధమయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here