Featuredప్రాంతీయ వార్తలు

ముంపు ప్రాంతాల‌ను పరిశీలించిన దాన‌కిషోర్‌, స‌జ్జ‌నార్‌లు


నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి ప్ర‌త్యామ్న‌య మార్గాల అన్వేష‌ణ‌


హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో గ‌త రాత్రి కేవ‌లం గంట‌ వ్య‌వ‌ధిలోనే 10.50 సెంటిమీట‌ర్ల ఆక‌స్మిక వ‌ర్షం కురిసిన నేప‌థ్యంలో సైబ‌రాబాద్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాలు నీట మున‌గ‌డంతో న‌గ‌ర‌వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ‌త రాత్రి ముంపుకు గురైన ప్రాంతాల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జ‌నార్‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి విస్తృతంగా ప‌ర్య‌టించారు. దాదాపు మూడు గంట‌ల పాటు ప‌ర్య‌టించిన వీరు రాత్రి ముంపు ప్రాంతాలను ప‌రిశీలించి ముంపుకు గ‌ల కార‌ణాలు, శాశ్వ‌త, తాత్కాలిక ప‌రిష్కారానికి వెంట‌నే చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లపై సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించారు. నేడు ఉద‌యం కూక‌ట్‌ప‌ల్లి, శిల్పారామం, హై-టెక్‌సిటీ, గ‌చ్చిబౌలి చౌర‌స్తా, రాడిస‌న్ హోట‌ల్, బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్‌, సుదర్శ‌న్‌న‌గ‌ర్‌, గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌, ఐకియా, కొండాపూర్‌, దుర్గంచెరువు త‌దిత‌ర ముంపుకు గురైన ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ క‌మిష‌స‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ గ‌త రాత్రి గ‌చ్చిబౌలి ప‌రిస‌ర ప్రాంతాల్లో కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే 10.35 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం కురిసింది. దీంతో బ‌ర్ల‌కుంట‌, తుమ్మిడికుంట చెరువులు నిండి పొంగ‌డంతో ర‌హ‌దారుల‌పై నీరు నిలిచాయి. అదే స‌మ‌యంలో ఐటీ కంపెనీ కార్యాల‌యాల నుండి ఉద్యోగులు ఇళ్ల‌కు వెళుతుండంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. మాదాపూర్‌, గ‌చ్చిబౌలి త‌దిత‌ర ప్రాంతాల్లో గంట‌కు రెండు లేదా సెంటిమీటర్ల వ‌ర్ష‌పాతాన్ని త‌ట్టుకునే డ్రెయిన్స్ మాత్ర‌మే ఉన్నాయి. హై-టెక్ సిటీ ముందు ఉన్న డ్రెయిన్‌లో ట్రాన్స్‌-కో లైన్లు ఉన్నాయి. దీంతో వ‌ర‌ద‌నీరు సాఫీగా వెల్ల‌డానికి అడ్డంకిగా మారాయి. మ‌రో ప్రాంత‌మైన రాడిస‌న్ వ‌ద్ద డ్రెయిన్‌లో ప్రైవేట్ కేబుల్ ఆప‌రేట‌ర్లు అక్ర‌మంగా త‌మ కేబుళ్ల‌ను వేయ‌డంతో వ‌ర‌ద‌నీరు ప్ర‌వాహానికి అవి కూడా అడ్డుగా నిలిచాయి. ఈ రోజు ప‌రిశీలించిన మేర‌కు డ్రెయిన్ల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గిస్తాం. న‌గ‌రంలో దాదాపు 85శాతానికిపైగా నాలాల పూడిక ప‌నులు కూడా పూర్త‌య్యాయ‌ని క‌మిష‌స‌న‌ర్ తెలిపారు. భారీ వ‌ర్షాల స‌మ‌యంలో ప్ర‌త్యామ్న‌య మార్గాల‌ను కూడా ట్రాఫిక్ పోలీసుల‌తో క‌లిసి అన్వేషిస్తామ‌ని తెలియ‌జేశారు. కాగా ఈ ముంపు, నీటి నిల్వ ప్రాంతాల‌ను జోన‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, డి.సి.పి వెంక‌టేశ్వ‌ర‌రావు, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ, హైద‌రాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్, ట్రాఫిక్ త‌దిత‌ర విభాగాల ఉన్న‌తాధికారులు కూడా ప‌రిశీలించిన‌వారిలో ఉన్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close