మీలా మృతిపట్ల ఉత్తమ్ సంతాపం …

0

 
గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోదుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మీలా సత్యనారాయణ మృతిపట్ల టి‌పి‌సి‌సి అధ్యక్షులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో మీలా సత్యనారాయణ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మీలా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కష్టే ఫలి అనే సిద్దాంతన్ని నమ్మి ఎన్నో వ్యాపారాలు నిర్వహించి అనేక మందికి ఉపాధి కల్పించిన మహనీయుడన్నారు. స్వాతంత్రోద్యమ పోరాటంలో పని చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తను చేసిన కృషి మరవలేమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here