Featuredస్టేట్ న్యూస్

మీరు తిడితే…ఆయన తాట తీస్తున్నారు

◆ జేసీకి భద్రత కుదింపు
◆ త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ లీజు రద్దు
◆ తాజాగా ఫోర్జరీ కేసు
◆ ‘సంధి’కి వస్తాడా..? ‘సై’ కోడతారా..?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)

రతనాలసీమలో రాయలసీమ పౌరుషం’ రోడ్డెక్కి తోడలు కొడుతోంది. ‘నీ పెతాపమో.. నా పెతాపమో’ అంటుంది. ఫ్యాక్షన్ పడగనీడలో ‘పగ’లే వారికి శ్వాస. అందులోనూ నీతి ఉంది. మహిళలలను, పిల్లలను ‘టచ్’ చేయరు. ( అక్కడ కత్తులు పట్టుకొని తిరగరు. బాంబులు చుడుతూ ఏం కూర్చోరు. సినిమాల్లో మాత్రం అందుకు విరుద్దం.) అయితే వైఎస్, జేసీ కుటుంబాల మధ్య వైరం మాత్రం తగ్గకుండా కొనసాగుతోంది. ఈ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ హత్యలు నేరుగా లేవు కాని గ్రూపు తగాదాలున్నాయి. కడపజిల్లా పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలకు అనంతపురం తాడిపత్రి నియోజకవర్గం సరిహద్దుగా ఉంటుంది. ఇదే ‘నిప్పు ఉన్న పొగ’. తరతరాలుగా ఖాళీగా ఉన్నప్పుడల్లా.. అక్కడ గొడవలు సహజం. ఆ సంస్కృతిలో భాగంగా తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి భద్రత తగ్గించారు. బస్ ల విషయంలో ఫోర్జరీ కేసు. 1600 ఎకరాల భూమి లాగేసుకోవడం… ఇలా ఇలా ఒకదాని వెంట జరిగిపోతున్నాయి. ఆయన మాత్రం ఏం చేయగలడు. బాబును వాటేసుకొని బావురుమనడం తప్ప. బట్ ఆయన సఃధి చేసుకోడం. సరికదా.. ‘సై’ అనే రకమే..! ఏం జరుగుతుందో చూద్దాం. ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

గతంలో..:
జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురించి జగన్ పత్రిక ‘సాక్షి’లో కథనాలు రాశారని .. నాటి తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అనంతపురం ‘సాక్షి ఆఫీస్’ ఎదురుగా టెంట్ వేసుకుని జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ విషయంలో తీవ్రమైన అనుచిత పదజాలాన్ని ఉపయోగించి ప్రభాకర్ రెడ్డి రచ్చ చేశారు. ప్రభాకర్ రెడ్డి మాట తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్పట్లో భగ్గుమన్నాయి. ఆ వ్యవహారంపై జగన్ స్పందనను మీడియా కోరగా.. కుక్కలు మొరిగితే స్పందించాలా? అని ప్రశ్నించారు.

భద్రత విషయంలో మరో షాక్:
ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు జేసీకి సంబంధించిన వ్యాపారాలలో అక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలతో ప్రూవ్ చేసే పనితో ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతున్న సర్కార్ ఇక ఏకంగా జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వ భద్రతను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జేసీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ఈ నేపధ్యంలో గన్‌‌మెన్‌ లను 2+2 నుంచి 1+1 కు ఏపీ ప్రభుత్వం కుదించింది. ఇక తాజాగా ఆయన భద్రత కోసం కేటాయించిన 1+1 గన్‌మెన్లను కూడా పూర్తిగా తొలిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
.

సో… జేసీ బ్రదర్స్ ఇలా దొరికి…..!!?:

మొన్న టీవీల్లో స్క్రోలింగులు చూశాం కదా…! జేసీ బ్రదర్స్ తమ లారీలకు ఎన్‌ఓసీ కోసం తాడపత్రి ఎస్సై సంతకాన్ని ఫోర్జరీ చేశారని…? వాటి సాయంతో తమ లారీల్ని కర్నాటకలో అమ్మేశారని..! చాలామంది అస్సలు నమ్మలేదు… ఎహె, జేసీ బ్రదర్స్ చెబితే తాడిపత్రి ఎస్సై ఇంటికొచ్చి సంతకాలు చేస్తాడు కదా..! అసలు ఈ ఫోర్జరీ వార్తలే పెద్ద ఫేక్ అని ఎదురు వాదనకు దిగారు నో, నో, జగన్ ప్రభుత్వం వచ్చాక… దొరికితే జగన్ ‘పాత బూతులన్నీ మనసులో పెట్టుకుని తాటతీస్తాడని తెలిసీ అలా ఎందుకు చేస్తాడు’ అంటూ మరికొన్ని వాదనలు. పైగా ఎన్ఓసీ అనేది చాలా చిన్న విషయం కదా అని ఇంకొందరు… కానీ ఆఫ్టరాల్ ఎస్సై సంతకాలు కూడా వెళ్లి అడగాలా, చేసేస్తే పోలా అనుకున్నట్టున్నారు…! నిజంగానే చేసేశారు…’ (మచ్చుకు మూడు ఇస్తున్నాం)

దటీజ్ జ’గన్’:
అవును బాబూ… అవును. చూశారు కదా… జగన్ అధికారంలోకి వచ్చాకే చేశారు. ‘నకిలీ రెడ్డి అయినా సరే, మా రెడ్డే కదా అన్నీ మాఫీ అయిపోతాయిలే’ అనుకున్నారా..? అసలే మేం చేసినవి బయటికెలా వస్తాయని అనుకున్నారా..? అదేమో తెలియదు గానీ… ‘మా అధికారంలోకి వస్తే మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటాను’ అని అప్పట్లో జేసీ ఏదో మాట్లాడాడు కదా…! అసలే పోలీసులు మంట మీదున్నారు…(సహజం కదా..!) ఇప్పుడు ఈ కేసులు బుక్ చేయటానికి రెడీ అయిపోయారు అంతేకాదు, అసలు ‘ఇలా సంతకాల ఫోర్జరీతో ఎన్ని లారీలు అమ్మారు’ అనేది తవ్వుతున్నారు. అలా చాలా చాలా ఉన్నాయని తేలుతున్నదట…! ఫోర్జరీ అనేది ఒక క్రిమినల్ కేసు.

తెచ్చి అమ్మటం ‘బెద్ద’ నేరం తెల్సా..:
నిజానికి ఇది పెద్ద కేసు ఏమీ కాకపోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత లారీలను నడిపించకూడదు. గతంలోనే సుప్రీం తీర్పు ఒకటి ఉంది. (కావాలంటే ఇస్తాం..) అయినా సరే, ఆయుష్షు తీరిన లారీలను కూడా జేసీ బ్రదర్స్ నడిపిస్తున్నారని మరో కేసు…! ఈశాన్య రాష్ట్రాల నుంచి కాలం చెల్లిన వాహనాలను తెచ్చి, అమ్మడం పెద్ద కేసే. అది ఇంకాస్త స్ట్రాంగుగా ఫ్రేమ్ చేసే పనిలో పడ్డారట పోలీసులు. (హైహై నాయకా..!) అవి రుజువైతే కోట్లకుకోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

మరిచే తిట్లా అవి..:
అన్న ‘వేదిక మీదే’ జగన్‌ను తిట్టిపోశాడు. తమ్ముడు ‘రోడ్డు పక్కన టెంట్ వేసి మరీ’ తిట్టాడు ఇటువైపు అసలే జ’గన్’. ఎలా మరిచిపోతాడు..? పైగా త్రిశూల్ సిమెంట్స్‌ పేరిట అప్పట్లో తను 1600 ఎకరాల సున్నపురాతి గనులున్న భూముల్ని ప్రభుత్వం నుంచి కేటాయించేసుకున్నాడు. లక్షల టన్నులు తవ్వకుని అమ్మేసుకున్నాడు. ఆ లీజు మొత్తం కూడా చెల్లించలేదు. అసలు అడిగేవాళ్లు ఎవరు తనను..? కానీ హైకోర్టులో ‘ఓ ప్రజావ్యాజ్యం’ నడిచి, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేసరికి, ఇదే అదునుగా జగన్ ప్రభుత్వం ఆ భూముల లీజు రద్దు చేసి పారేసింది. స్వాధీనం చేసుకోనుంది. దటీజ్ నాచురల్. అసలు సిమెంటు ఫ్యాక్టరీయే లేకుండా అంతమేరకు సహజవనరుల్ని ఇష్టారాజ్యంగా తవ్వేసుకున్న తీరుపై అంతిమ తీర్పు ఎలా ఉంటుందనేది వదిలేస్తే…

అన్నా ఇది బాగాలేదే..:
సదరు బ్రదర్స్ నడిపే బస్సుల నియమోల్లంఘనల్ని కూడా రవాణా శాఖ సీరియస్‌గా తీసుకుని, సీజ్ చేసి పారేస్తున్నది. జేసీ వెళ్లి, చంద్రబాబు కడుపులో తలకాయ పెట్టి బాధపడితే వచ్చేదేముంది ఇప్పుడు..? అసలు ఆయనే ఎవరి కడుపులో తలకాయ పెట్టి బాధపడాలో తెలియక లోలోపల కుమిలిపోతుంటే…!! ‘ఎంత చెట్టుకు అంత గాలి’. ఎవడిగోల వాడిది.

ముగింపు:
ఇదేమన్న ‘ఎమ్మెల్యేల కాలనీ భూకబ్జా’ నాటి కాలమా..! గప్పుడంటే ఆయన అయ్యగారు వైఎస్సార్ డిఫరెంట్. ఆయన కొడుకు జగన్ అసలే ఉడుకు రక్తంతో ఉన్నాడు. కొద్ది రోజులాగండే..! ధన్యోస్మి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close