మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు

0

మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ.ఎన్. సి కృపాకర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఏ ఆకాంక్ష ల సాధన కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం దిశగా తెలంగాణ సాగుతోందన్నారు ఈ.ఎన్. సి కృపాకర్ రెడ్డి. ప్రజా సంక్షేమంలో ఇవాళ దేశానికే మిషన్ భగీరథ ఆదర్శంగా నిలిచిందన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా భగీరథ లాంటి తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం ఆలోచించడం తెలంగాణ సాధించిన విజయం అన్నారు.
ప్రతీ ఒక్కరికి శుద్ది చేసిన నీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయం లో భాగం కావడాన్ని మిషన్ భగీరథ ఇంజనీర్స్, సిబ్బంది గర్వంగా భావిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ లో తాగునీటి కొరత అనేది లేకుండా చేయడమే మిషన్ భగీరథ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్లు విజయపాల్ రెడ్డి, విజయ్ ప్రకాశ్, రమేష్ తో పాటు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here