Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

మాకు ఏ దేశం మద్దతివ్వడం లేదు

యుద్ధం మినహా అన్ని ప్రయత్నాలు చేశాం

  • పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

న్యూయార్క్‌

జమ్మూకశ్మీర్‌ అంశంలో ఏ దేశం కూడా పాక్‌కు మద్దతు ఇవ్వడం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయాడు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లగక్కాడు. కశ్మీర్‌ అంశంలో ప్రపంచదేశాల తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని.. ఏ దేశం కూడా మోదీ విూద ఒత్తిడి తీసుకురావడం లేదని ఇమ్రాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిమిత్తం భారత్‌, పాక్‌ ప్రధానులిద్దరు న్యూయార్క్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ అంశంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదని, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడానికి మేం చేసిన ప్రయత్నాలు అన్ని వృథా అయ్యాయని అన్నారు. 100 కోట్ల జనాభా ఉన్న భారత్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఏ దేశం మాకు మద్దతివ్వడం లేదని, మోదీని వ్యతిరేకించడం లేదన్నారు. కశ్మీర్‌ అంశంలో యుద్ధం మినహా అన్నిరకాల ప్రయత్నాలు చేశామని తెలిపారు. ప్రపంచ దేశాల మద్దతు ఉన్నా లేకపోయినా తాము మాత్రం మోదీపై ఒత్తిడి తేస్తూనే ఉంటామని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు అంశాలను పాక్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌ అంశంలో భారత్‌ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టేందుకు పాక్‌ చేయని ప్రయత్నం లేదు. కానీ అవన్ని బెడిసికొట్టాయి. పాక్‌కు మద్దతు కొరవడటమే కాక ఇదిఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని.. చర్చల ద్వారా పరిష్కరించుకోమని సూచించాయి. కానీ ట్రంప్‌ మాత్రం ఇరుదేశాల ప్రధానులు అంగీకరిస్తే.. జమ్మూకశ్మీర్‌ అంశంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close