Featuredఅంతర్జాతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

మళ్లీ మహాకూటమి..!

ఉత్తమ్‌ ఆలోచనలు..

  • ఎల్‌. రమణకు ఫోన్‌..
  • పోటీపై టీడీపీ డైలమా..
  • కానరాని టీజేఎస్‌, వామపక్షాలు..

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్గొండ పార్లమెంట్‌ సీట్‌ గెలిచినప్పటినుంచి మొదలైన ఒక చర్చ హుజూర్‌ నగర్‌ పరిస్థితేంటి? ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ కూడా వెలువడడంతో అన్ని రాజకీయ పార్టీలూ ఈ విషయంపై తమ దృష్టిని కేంద్రీకరించాయి. తెలంగాణలోని హుజూర్‌నగర్‌పై పట్టు సాధించేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఇటు బీజేపీ పార్టీలు దృఢ సంకల్పంతో ముందుకెళుతోంది. ఈ విషయమై బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా కర్ణాటక తరువాత దక్షిణ భారతదేశానికి గేట్‌ వే గా తెలంగాణను పరిగణిస్తుంది. సో, మొత్తంగా అర్థమయ్యేదేంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి అన్న విషయం తేటతెల్లమవుతుంది. అయితే ఈ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీలు పకడ్భందీగా ముందుకు వెళేందుకు అనేక వ్యూహాలను రచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటిఫికేషన్‌ విడుదలైన కొన్ని గంటల్లోపే తమ అభ్యర్థిని ప్రకటించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ నోటిఫికేషన్‌ విడుదల కాకమేందే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తవమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతిరెడ్డిని ప్రకటించారు. ఈ ప్రకటన వేళువడిన తర్వాత మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఖండిస్తూ అనేక ప్రకటనలు చేశారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒక్కటై పద్మావతిని గెలిపిస్తామని ధీమాలు వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌పై పట్టు కోసం ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొవడానికి ఉత్తమ్‌ అండ్‌ కో మాత్రం అచీతూచి అడుగులు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్‌ కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్‌ హవాలో మహాకూటమి ప్లాన్‌ ఏ మాత్రం వర్కవుట్‌ కాలేదు. ఎన్నికల్లో కలిసికట్టుగా రాజకీయ ప్రయాణం చేసిన ఈ పార్టీలు… ఆ తరువాత మళ్లీ కలిసి పని చేయలేదు. అయితే తాజాగా హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో మళ్లీ మహాకూటమి ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బరిలో నిలుస్తున్నారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీకి టీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా రెడీ అయిపోయాయి. అయితే ఇక్కడ పోటీలో ఉండే అంశంపై టీడీపీ, వామపక్షాలు, తెలంగాణ జనసమితి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ నేతలు హుజూర్‌ నగర్‌లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నాలుగు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా చేసేందుకు టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే హుజూర్‌ నగర్‌ బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిరెడ్డి మహాకూటమి అభ్యర్థిగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో ఒకసారి విఫలమైన మహాకూటమి… మళ్లీ హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా పురుడు పోసుకుంటుందా అన్నది త్వరలోనే తేలనుంది.

ఎల్‌ రమణకు ఫోన్‌, మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్‌

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో తిరిగి పాగా వేయాలని ఉత్తమ్‌ ప్లాన్‌లు వేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారంను ప్రారంభించిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇతర పార్టీల మద్దతు కోరడంలోనూ ముందంజలోనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైతే టీడీపీ,వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి కూడా అదే పంథాలో నడవాలను నిర్ణయించుకుంది. అందులో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫోన్‌ చేశారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించేందుకు సహకరించాలని ఫోన్‌ లో కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఎల్‌ రమణ అన్నట్లు సమాచారం. రెండు రోజుల్లో పార్టీ తరపున సమాధానం చెప్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నట్లు సమాచారం.

టీడీపీ డైలమా.. చంద్రబాబుదే తుది నిర్ణయం..

తెలంగాణలో జరగబోయే హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. హుజూర్‌ నగర్‌లో పోటీ చేసే అంశంపై టీ టీడీపీ నేతలు ఎల్‌. రమణ అధ్యక్షతన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో సమావేశమయ్యారు. అయితే దీనిపై నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు మూడు రోజుల్లో దీనిపై తమ నిర్ణయం ఏమిటో చెబుతామని టీడీపీ నేత నర్సిరెడ్డి తెలిపారు. తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేసుకునే అంశంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు… హుజూర్‌ నగర్‌లో పోటీపై త్వరలోనే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీడీపీ… తెలంగాణలో రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ… హుజూర్‌ నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ… హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close