Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

మరో పదేళ్లు నేనే సీఎం..

సెప్టెంబర్‌17న జాతీయ జెండా ఎగురవేస్తాం..

  • అప్పులపై ఆందోళన వద్దు
  • యురేనియం తవ్వకాలపై కీలక ప్రకటన
  • మొత్తం ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదు..
  • బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

వచ్చే మూడు టర్మ్‌లు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌దే అధికారం అన్నారు సీఎం కేసీఆర్‌. ఇది ఎవరూ ఆపలేరని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్‌ దిగిపోతడు..కేటీఆర్‌ అవుతారని ప్రచారం చేశారని తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌పై సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా తనపై, టీఆర్‌ఎస్‌పై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. కేసీఆర్‌ ఆరోగ్యం ఖతమైందంట..అమెరికా పోతడంట..చచ్చిపోయి 20 ఏళ్లు అయ్యింది..కేసీఆర్‌ దిగిపోయి..కేటీఆర్‌..చేస్తారంట..అనే ప్రచారం జరిగిందన్నారు. తన వయస్సు ఇప్పుడు 66 అని..ఇంకా పదేళ్లు చేయనా అని చెప్పారు. ఈ టర్మ్‌ నేనే ఉంటా..వచ్చే టర్మ్‌ నేనే ఉంటానని చెప్పారు. శాపాలు పెట్టినా గట్టిగానే ఉంటా..ప్రజల దీవెన..దేవుడి దయ..ఉంటాయన్నారు. ప్రజల కోసం తిప్పలు పడుతున్నాం..ఇంకా పడుతాం..వందకు వంద శాతం టీఆర్‌ఎస్‌దే అధికారమని స్పష్టం చేశారు.

శాసనసభలో బడ్జెట్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. నేడు ఉన్న పరిస్థితులను ఎటువంటి బేషజాలు, దాపరికాలు పెట్టకుండా వాస్తవ స్థితిగతులను అన్ని కూడా బడ్జెట్‌ ప్రసంగంలోనే చెప్పడం జరిగింది. దాంట్లోనే చాలా సమాధానాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా మిత్రులు కొన్ని విషయాలు సభలో లేవనెత్తారు. అందులో చర్చలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు మజ్లీస్‌ శాసనసభా పక్ష నాయకులు అక్బరుద్దీన్‌ ఓవైసీ, కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నాయకులు మల్లు బట్టి విక్రమార్క, టీఆర్‌ఎస్‌ పక్షం నుంచి గాదారి కిశోర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి శ్రీధర్‌బాబు, టీఆర్‌ఎస్‌ సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి చర్చలో పాల్గొన్నారు. వారు కొన్ని సూచలను చేశారు. కొన్ని విమర్శుల చేశారు. కొన్ని నిర్మాణాత్మక సూచనలు కూడా చేశారు. చర్చలో పాల్గొన్నందరికి ప్రభుత్వం తరపున దన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్థిక మాద్యం అనేది ఉంది, దాని పరిణామాలు ఏఏ రంగాలపై ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా, ప్రభుత్వం తరపున నేను చెప్పడమే కాదు, ప్రతి రోజు పత్రికల్లో విూడియాలో వస్తూ ఉంది. రాజకీయమైనటువంటి విమర్శలు పక్కన పెడితే విశ్లేషకులు, అర్థగణాంక శాస్త్రవేత్తలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు, ఇటీవలి కాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సలహాదారులుగా పనిచేసిన వారు. భారతీయ జనతాపార్టీకి చెందిన ఆర్థిక వేత్త సుబ్రమణ్య స్వామి లాంటి వారు. అందరూ కూడా విషయాలు బయటకు చెబుతా ఉన్నారు. ఆర్థికమాంద్యం పరిస్థితులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశం ఏం కాబోతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దేశ ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆనంద్‌ మహీంద్రా లాంటి వారు మూడేళ్లదాకా తేరుకోలేమని చెప్తున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం అయిన సెప్టెంబర్‌ 17న తెలంగాణ భవన్‌పై జాతీయ జెండా ఎగురవేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆ రోజు ఎవరు ఏం చేసినా పట్టించుకోబోమన్నారు. సెప్టెంబర్‌ 17 సవిూపిస్తుందంటే చాలు.. విమోచనమా..? విలీనమా..? అన్న చర్చ తెలంగాణ తెర పైకి వస్తుంది. ఎప్పటిలాగే బీజేపీ దాని అనుబంధ సంఘాలు సెప్టెంబర్‌ 17న తెలంగాణ విముక్తి దినోత్సవం జరపాలని డిమాండ్‌ చేస్తుండగా.. అభ్యుదయవాదులు, కొంతమంది తెలంగాణవాదులు మాత్రం విలీనం అనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 17 వచ్చిన ప్రతీసారి ప్రభుత్వం తన వైఖరిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో సెప్టెంబర్‌ 17 గురించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు అసలైన విముక్తి.. విమోచనం.. 2014 జూన్‌ 2 అని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 17న ఎవరికి నచ్చింది వాళ్లు చేసుకోవచ్చునని.. అలాగని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహించాలని భావించిన మాట నిజమేనని.. కానీ అన్నీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని.. గతాన్ని మళ్లీ తవ్వడమెందుకన్న ఉద్దేశంతో ఆరోజు ఎలాంటి దినోత్సవాన్ని జరపడం లేదన్నారు.కొత్తగా మతం పుచ్చుకున్నవాడికి నామాలు ఎక్కువ అన్న చందంగా.. కొంతమంది సెప్టెంబర్‌ 17 రాగానే హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజాంపై నిందలు వేసే బీజేపీ.. మరి సర్దార్‌ పటేలే స్వయంగా ఆయనకు రాజ్‌ ప్రముఖ్‌ బిరుదు ఇచ్చిన విషయం గురించి ఎందుకు మాట్లాడదని చెప్పారు. తెలంగాణ భారత యూనియన్‌లో విలీనం అయిన సందర్భంలో రెండేళ్ల పాటు క్రూరాతి క్రూరమైన ఊచకోత జరిగిందని చెప్పారు. సెప్టెంబర్‌ 17 హిందువులకో.. ముస్లింలకో సంబంధించింది కాదన్నారు. ఇప్పటి సమాజానికి దానితో అవసరం లేదు కాబట్టే దాన్ని పక్కనపెట్టేశామన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని.. శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రాధాన్యం అని చెప్పారు.

ఆర్థిక మాంద్యాన్ని నిర్మాణాత్మకంగా ఎదురుకొంటాం..

కాళేశ్వరం ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. రెండు పంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న అప్పు తీరుతుంది. తెలంగాణ రైతులు అంచు ధోతీ కట్టుకునే రోజులొస్తయి. కాళేశ్వరంపై పూర్తిగా వక్రీకరిస్తే నాకు బాధ అనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు ప్రజలందరికి తెలియాలి. కాంగ్రెస్‌ నాయకులు కాళేశ్వరానికి నాటు పడవలో వెళ్లి మోటు పాటలన్నీ పాడారు. సంపద ఎలా పెంచుకోవాలో ప్రభుత్వాలకు తెలియాలి. కొన్ని రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితే పెంచుకోవు. అప్పుల గురించి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోయే అవసరం లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫైనాన్స్‌ సంస్థకు ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్‌ కాలేదు. 25 ఏళ్లుకు తిరిగి ఇస్తామన్న బాండ్‌ను కూడా ఆర్బీఐ కూడా స్వీకరించింది.

ఆర్థిక మాంద్యం ఉందని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. శ్రీధర్‌బాబు ఏం మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఏ రోటికాడ ఆ పాట పాడుతుంది. మంథని నీళ్లు, బాన్సువాడ నీళ్లు అని వేర్వేరుగా ఉంటాయా?. మా నీళ్లు విూ నీళ్లు అని కాంగ్రెస్‌ నాయకులు చీప్‌గా ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో మతకల్లోలాలు, కర్ఫ్యూలు, చేనేతల ఆత్మహత్యలు వర్ధిల్లాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ పచ్చబడేలా చేస్తే మే వచ్చి ఎండగట్టినమా?. 2004, 2009లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చెప్పిందేదీ అమలు చేయలేదు. కాంగ్రెస్‌ హయాంలో కొత్త ఆయకట్టు కాదుకదా, ఉన్న ఆయకట్టు కూడా మాయమైంది. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కాంగ్రెస్‌లాగా ఆడితప్పడం, మభ్యపెట్టడం లాంటివి మే చేయలేదు. విూరు కట్టిన 7 ఇందిరమ్మ ఇళ్లు... మేం కట్టిన ఒక డబుల్‌ బెడ్‌రూం ఇంటితో సమానం. ఇంతకు ముందు పేదోడికి ఇల్లు కావాలంటే పైరవీకారులను పట్టుకోవాలి. ఇంటికి రూ.20వేల చొప్పున జేబులో వేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది. తెలంగాణ రాష్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 17వేల పై చిలుకు ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఇంకా 30 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగ ప్రకటన వేయగానే ప్రతిపక్ష నాయకులు కేసులు వేయిస్తారు. అవసరాలు ఎక్కడున్నాయో అక్కడ ఖాళీలు భర్తీ చేస్తున్నాం.

సబ్‌ప్లాన్‌ నిధులను మళ్లించామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల్లో ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్కుంది. దళితులను ఆదుకునే విషయంలో తెలంగాణ ఛాంపియన్‌ కావాలి. దళిత, గిరిజన అభ్యున్నతికి రాజకీయాలకు అతీతంగా పాటుపడాలి. హౌజ్‌ కమిటీలను వేస్తున్నాం కాబట్టి, తప్పుఒప్పులను సవరించుకుందాం. ఏ శాసనసభ్యుడు కోరినా ప్రతీ అధికారి సమాధానం చెప్పాలి.ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి దళితుల అభ్యున్నతి మొదలైంది. కాంగ్రెస్‌ హయాంలో తెచ్చిన సబ్‌ప్లాన్‌ చట్టాన్ని ఇంకా పటిష్టం చేసినం. సబ్‌ప్లాన్‌ నిధులను పైసా కూడా వేరేవాటికి వాడలేదు. ఎస్సీ, ఎస్టీ నిధులు ఆశించినమేరకు ఉపయోగపడాలి. సబ్‌ప్లాన్‌ కోసం కేటాయించిన రూ.54,350 కోట్లలో ప్రతీ పైసా లెక్క చూపిస్తాం.ఎన్నికలకు ముందు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అనేది ఎథికల్‌ అంశం. ఆస్పత్రుల మందుల కొనుగోలకు రూ.146 కోట్లు కేటాయించాం. కిడ్నీ బాధితులకు 40 డయాలిసిస్‌ సెంటర్లు పెట్టాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసవ సమయాల్లో మాతాశిశు మరణాలు తగ్గిపోయాయి. బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయి. ఇంకా కొన్ని విస్తరిస్తాం. అమ్మ ఒడి లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు.గర్భిణిలకు ఆర్థిక సాయం చేయాలని ఎవరూ అడగలేదు. గర్భిణిలు కూలిపని చేయడం సమాజానికి మంచిది కాదు. గర్భిణిలు వేతనం నష్టపోవద్దని మానవీయ కోణంలో ఆర్థిక సాయం చేస్తున్నాం. కంటి వెలుగు సర్జరీలు మొదలు కాకముందే వికటించాయని విషప్రచారం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఇంకా బలోపేతం కావాలి. రైతుబంధును బీజేపీ మంత్రులే వచ్చి మెచ్చుకుంటున్నారు. రైతుబంధు లాంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ఒడిషా సీఎం నా సమక్షంలోనే ప్రకటించారు.

యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆదివారం బడ్జెట్‌పై ఆయన సమాధానం ఇచ్చారు. యురేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..ఎవరికీ ఎలాంటి పర్మిషన్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇచ్చే ఆలోచన కూడా లేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఎలాంటి పరిస్థితుల్లో నల్లమల్ల అడవులు నాశనం కానివ్వమని సభలో వెల్లడించారు. అయితే..వద్దని చెప్పినా..గతంలో అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌ అని చెప్పారు. 2009లో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో, ఏపీలో కూడా అనుమతులు ఇచ్చారన్నారు. కడపలో తవ్వకాలు జరుగుతున్నాయని, కలుషితం అయిపోతోందనే వార్తలు వస్తున్నాయని సభకు తెలిపారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు (శ్రీశైలం, సాగర్‌, పులిచింతల, డెల్టా) మొత్తం కలుషితమై నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయన్నారు. దీని నుంచి హైదరాబాద్‌ డ్రింకింగ్‌ వాటర్‌ సమస్య ఉందని, రాజధానికి కూడా ప్రమాదం ఉందన్నారు. వీటన్నింటి దృష్ట్యా యురేనియం అనుమతులివ్వని మరోసారి సభకు స్పష్టం చెప్పారు. అందరం కలిసి కేంద్రంతో పోరాటం చేద్దామని, ఇందుకు సభ ఒక తీర్మానం పాస్‌ చేసే ఆలోచన ఉందన్నారు సీఎం కేసీఆర్‌. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం నడుస్తోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అడవులను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. సెలబ్రిటీలు, పొలిటికల్‌ లీడర్లు దీనిపై గళమెత్తుతున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేటీఆర్‌ చెప్పారు. శాసనమండలిలో ఈ ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్‌.

అప్పులపై ఆందోళన వద్దు : సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు సీఎం కేసీఆర్‌. అప్పులతో వచ్చే ఫలితాలు ఏడాదిలో కనిపిస్తాయన్నారు. రాష్ట్ర అప్పులు 21 శాతం ఉంటే..కేంద్ర అప్పులు 48 శాతం ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. బడ్జెట్‌ రూపకల్పనలో భేషజాలకు పోలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆపాలని కొందరు కుట్రలు చేసినా..సాధించామన్నారు. 21 శాతం వృద్ధి రేటు సాధించినట్లు చెప్పారు. కేవలం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసమే అప్పులు తీసుకొచ్చామని..సభలో వెల్లడించారు. రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రూ. 2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్నాయని వెల్లడించారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అప్పు ఉన్న దేశం అమెరికా అని తెలిపారు. డిస్కంలకు రూ. 9 వేల కోట్ల అప్పులున్నాయని, ఇది గతం నుంచి కొనసాగుతోందన్నారు. రూ. 75 వేల కోట్ల అప్పు గత ప్రభుత్వాలు నెత్తిన పెట్టాయని సభలో వెల్లడించారు. కాంగ్రెస్‌ సభ్యులు సత్యదూరమైన విషయాలు చెప్పారని ఖండించారు. వారు ఇంకా 1940లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. తలతోక లేకుండా మాట్లాడుతుంటే బాధేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు రెండు పంటల్లో తీరిపోతుందని, తెలంగాణ రైతు అంచు ధోవతీ కట్టుకొనే రోజులొస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. విూరు ప్రాజెక్టులు కట్టి పచ్చగా చేస్తే..తమ ప్రభుత్వం ఎండగొట్టిందా అంటూ ప్రశ్నించారు.

మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదు – సీఎం కేసీఆర్‌

మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదని సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. లక్షా 44 వేల 382 ఉద్యోగాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో లక్షా 17 వేల 714 ఉద్యోగాలు భర్తీ అయ్యాయన్నారు. ఉద్యోగాల భర్తీలపై కేసులు వేస్తారని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. విూ పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. నిరుద్యోగులను ఎంతకాలం మభ్యపెడుతారని సూటిగా ప్రశ్నించారు. సబ్‌ ప్లాన్‌ నిధులు పారదర్శకంగా ఖర్చు చేయడం జరిగిందని, దళితులను తమ ప్రభుత్వం పైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చేసే వారిపై నిందలు వేయవద్దని హితవు పలికారు. ఏ ప్రభుత్వం చేయని పనులు తమ ప్రభుత్వం చేస్తోందని..పథకాల గురించి వివరించారు. నిరంతర విద్యుత్‌ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్‌ అని, ప్రతి ఇంటికి గ్యాస్‌ ఇస్తామని ఇవ్వలేదన్నారు. కొత్తగా 25 లక్షల ఎకరాల ఆయుకట్టుకు నీరు ఇస్తామన్నారని గుర్తు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని..ఇలా ఎన్నో హావిూలు గుప్పించిన కాంగ్రెస్‌ ఏవిూ చేయలేదన్నారు సీఎం కేసీఆర్‌.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close