Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

మరుగుదోడ్లలోనే అవినీతి కంపే..

గ్రామాన్ని మింగిన అధికారులు..

  • పూర్తికాకున్నా ఐనట్లు బిల్లులు స్వాహా..
  • బయటపడిని 25లక్షల స్కాం..
  • ఆధారాలతో బయటపెట్టిన యాక్‌ – ఆదాబ్‌ నిఘాలో బట్టబయలు

గ్రామాలన్నీ శుభ్రంగా ఉండాలి.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి గ్రామాల్లో శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పదే పదే చెపుతున్నారు. ఇప్పుడు ముప్పైరోజుల ప్రణాళిక ద్వారా గ్రామాలలోని ప్రజలను, నాయకులను, అధికారులందరిని భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోతున్నారు. పైనా ప్రభుత్వం చెప్పేది ఒకటైతే కిందిస్థాయిలోని అధికారులు, నాయకులు కుమ్మక్కై చేసేది మరోకటిగా మారిపోయింది. ప్రజలందరికి మరుగుదోడ్లు అందించి గ్రామాన్నంతా పరిశుభ్రంగా మార్చాలని 224 కుటుంబాలకు 224 మరుగుదోడ్లు ప్రభుత్వం మంజూరు చేస్తే అక్కడి అధికారులు, నాయకులు కలిసి లబ్దిదారులకు చేరకుండా, ఎవరికి అందకుండా 212 మరుగుదోడ్లు నిర్మించామని లక్షల రూపాయలను స్వాహ చేసిన మహా ఘనులు వారు. యూత్‌ ఫర్‌ యాంటీకరప్షన్‌ సంస్థకు లబ్దిదారులు ఫిర్యాదుమేరకు తీగలాగితే డొంక కదిలినట్లు అక్కడ లక్షల రూపాయల అవినీతి బయటపడింది.. ఒక గ్రామంలో వందల మరుగుదొడ్లు కట్టకున్నా, కట్టినట్లుగా బిల్లులు తీసుకుంటున్నా జిల్లా అధికారులు పర్యవేక్షణ ఏలా ఉందో తెలిసిపోతుంది. ఇన్ని లక్షల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత ఉందో అర్ధం కావడం లేదు..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close