Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువిద్యస్టేట్ న్యూస్

మన చదువులు చట్టబండలేనా…

దిగజారిపోతున్న యూనివర్శిటీలు

ప్రపంచ యూనివర్శిటీలో చోటే లేదు..

పేరుకే పెద్ద పెద్ద విద్యాసంస్థలు..

లక్షలు వసూలు చేయడంలో రాజీ లేదు..

లక్షలకు లక్షల ఫీజులు.. పెద్ద పెద్ద యూనివర్శిటీలు.. అందులో ఏం చెపుతున్నారో, విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారో మాత్రం తెలియదు.. రంగురంగుల భవనాలతో, బహుళా అంతస్థులతో కళాశాల ప్రాంగణాలను చూస్తేనే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.. పైకి చూడడానికి మాత్రమే యూనివర్శిటీలు, కళాశాలలు అందంగా ఉంటాయి, లోన మాత్రం అంతా డొల్ల అనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఫీజులు వసూలు విషయాలపై ఉన్న ఆసక్తి, నాణ్యమైనా చదువులను అందించడంలో లేదని అర్థమైపోతుంది… యువతను భావిబారత మేధావులుగా తయారు చేయాలనే ఆలోచన ఏ ఒక్కరిలో కనబడడమే లేదు. చెప్పుకోవడానికి పేరుకు మాత్రమే నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి.. వారి పాటించే విధివిధానాల్లో అసలు తేడానే రానివ్వరు.. అనుకున్న ప్రకారం నిధులు రావాలి.. కళాశాలలో పనులు పూర్తవ్వాలి.. పెద్ద సార్లకు లక్షల్లో జీతాలు రావాలి.. కాని ప్రపంచ యూనివర్శిటీలతో పోటీ అంటే మాత్రం మనం చతికిలపడిపోతున్నాం.. కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతున్నాం.. మన రాష్ట్రం కాదు, మన దేశంలోని ఏ ఒక్క యూనివర్శిటీ కూడా వరల్డ్‌ యూనివర్శిటి ర్యాంకింగ్స్‌ విడుదల చేసినా జాబితాలో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యమేస్తుంది. మన భారతదేశానికి చెందిన ఏ ఒక్క విద్యాసంస్థ కనీసం టాప్‌ 300లో చోటు దక్కించుకోలేదంటే మన విద్యావిధానం, మన చదువులు, మన పాలనా వ్యవస్థ ఏలా ఉందో తెలిసిపోతుంది. మన దేశపు యూనివర్శిటిలలో మన విద్యార్థులు చదువుతున్న చదువులు పేరు పక్కన పెట్టుకోవడానికి మాత్రమే పనికోస్తున్నాయి కాని జీవితంలో స్థిరపడడానికి, ఉన్నతంగా ఎదగడానికి, నూతన ఆవిష్కరణలు, నూతన పరిశోధనలకు ఏ మాత్రం సరిపోవని మరోసారి తేలిపోయింది. యువత భవిష్యత్తుకు దారి చూపే చదువులు కాదని చెప్పకనే చెప్పవచ్చు.. కొన్ని రాష్ట్రాల్లో అత్బుధమైనా ఫలితాలు సాధించే యూనివర్శిటీలు ఉన్నా కాని అక్కడ కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేక వెనుకబడిపోతున్నాయి. దేశంలోని విద్యావ్యవస్థ రోజురోజుకు పతనమవడానికి ప్రధాన కారణం మన ప్రభుత్వాల నిర్లక్ష్యం, అలసత్వమని మరోసారి రుజువైపోయింది…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ప్రపంచ యూనివర్శిటి ర్యాకింగ్స్‌లో భారత విద్యాసంస్థలు ఒక్కటి కూడా చోటు సంపాదించలేకపోయాయి. 2020 సంవత్సరానిగానూ టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(టిహెచ్‌ఈ) వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాకింగ్స్‌ జాబితాను విడుదల చేసింది. వారు విడుదల చేసిన జాబితాలో భారతదేశానికి చెందిన ఏ ఒక్క విద్యాసంస్థ కూడా చోటు దక్కించుకోలేకపోయింది. టాప్‌ 300లో భారత విద్యాసంస్థలు లేకపోవడం 2012 నుంచి ఇదే తొలిసారని చెపుతున్నారు. టిహెచ్‌ఈ వరుసగా పదహరవ సంవత్సరం ప్రపంచంలోని యూనివర్శిటీలకు ర్యాంకులు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. 92 దేశాల నుంచి దాదాపు పదమూడు వందలకు పైగా యూనివర్శిటీల ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ర్యాంకులను కేటాయించింది. భారతదేశంలోని అత్తుత్యమ విద్యాసంస్థ ఐనా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగుళూరు, ఈ సారి తన ర్యాంకును దిగజార్చుకున్నది. గత ఏడాది ఈ సంస్థ ర్యాంకు 251-300 గ్రూపులో ఉండగా ఈ సంవత్సరం అది 301-350 జాబితాలోకి చేరిపోవడం గమనార్హం. మరోపక్క ఐఐటీ రోపార్‌ తొలిసారి ఈ జాబితాలో నిలిచింది. ఐఐఎస్‌ సీ బెంగుళూరుతో సమానంగా 301-350 జాబితాలో చేరింది. దాదాపు ఏడు భారత యూనివర్శిటీలు ఈ ఏడాది తక్కువ ర్యాంకులకు పడిపోయాయి. ఐతే మిగతా విద్యాసంస్థలు మాత్రం తమ స్థానాలను అలాగే పదిలంగా ఉంచుకున్నాయి. ఇక ఐఐటి ఢిల్లీ(401-500) ఐఐటీ, ఖరగ్‌పూర్‌(401-500) జామియా మిల్లియా ఇస్లామియా వంటి విద్యాసంస్థలు ఈ ఏడాది చక్కని ప్రదర్శననే కనబర్చాయి. దాదాపు 56 భారత యూనివర్శిటీలు ఈ ఏడాది జాబితాలో నిలిచాయి. గతేడాది ఈ సంఖ్య నలభై తొమ్మిదిగా ఉంటే ఏడు యూనివర్శిటీలు కొత్తగా జాబితాలో చేరడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. కాగా ఈ జాబితాలో వరుసగా నాలుగోసారి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకిగ్‌లో యూఎస్‌, యూరోప్‌, బ్రిక్స్‌ దేశాలకు చైనా గట్టి పోటీనిచ్చి చక్కటి ప్రదర్శనను కనబరిచింది. ఈ జాబితాలో యూఎస్‌, జపాన్‌ దేశాల నుంచి 110 చొప్పున విద్యాసంస్థలు స్థానం దక్కించుకున్నాయి. యూకే నుంచి వంద యూనివర్శిటీలు జాబితాలు ఉండగా చైనా నుంచి ఎనబై విద్యాసంస్థలు చోటు సంపాదించుకున్నాయి.

కనీస వసతులు లేని యూనివర్శిటీలు..

దేశంలో వేలాది యూనివర్శిటీలు ఉన్నాయి. లక్షలాది విద్యార్థులు నిత్యం విద్యను అభ్యసిస్తున్నారు. కాని ప్రభుత్వం మాత్రం యూనివర్శిటీలకు సరియైన వసతులు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. ప్రతి విద్యార్థికి చదువు అందుబాటులో ఉంచాలని కొత్త యూనివర్శిటీలను ఇబ్బడి ముబ్బడిగా ప్రకటిస్తూనే ఉన్నారు కాని వసతులు, సదుపాయాలు, నిధుల విషయంలో మాత్రం తమకేమి సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణలో అతిపెద్ద యూనివర్శిటీలు కాకుండా నూతనంగా గత నాలుగైదు సంవత్సరాల క్రితం నాలుగైదు యూనివర్శిటీలను ఏర్పాటు చేశారు. కాని వాటి అమలు బాధ్యతలను మాత్రం మరిచిపోయారు. పెద్ద పెద్ద యూనివర్శిటీలలో చదువులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధ్యాపకులు నియామకాలను నిలిపివేశారు. ఉన్నవాళ్లతోనే విద్యావ్యవస్థను నడిపిస్తున్నారు. బోధన సౌకర్యాలు కల్పించకుండా, కనీస వసతులు ఏర్పాటు చేయకుండా వాటిని గాలికి వదిలేశారు. ప్రభుత్వాల దృష్టికి విద్యార్థి సంఘాలు, అందులో పనిచేసే అధ్యాపకులు ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన లేదు. ప్రభుత్వమే తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుంటే నాణ్యమైనా విద్య ఇంకెలా అందుతుంది, మెరికల్లాంటి విద్యార్థులు ఏలా తయారవుతారనేది ఇప్పుడు అందరిని ఆలోచిస్తున్న ప్రధాన అంశంగా మారిపోయింది. ఇతర దేశాల నుంచి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పరిశోధనలు జరిగి వందల సంఖ్యలో శాస్త్రవేత్తలు తయారవుతుంటే మనదేశంలో వందల సంఖ్యలో కూడా పరిశోధనలు జరగట్లేదు. పదుల సంఖ్యలో దేశానికి, ప్రపంచానికి స్పూర్తిగా నిలిచే అతి కొద్ది మంది శాస్త్రవేత్తలు వారి ఉనికిని చాటుతున్నారు. దేశంలో అతి కొద్ది విద్యాసంస్థలే కాకుండా ప్రభుత్వ యూనివర్శిటీలుగా మారిన ప్రతి యూనివర్శిటిని ప్రత్యేకంగా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నిధులు కొరత, అధ్యాపకుల కొరత లేకుండా చేస్తే నైపుణ్యంతో కూడిన యువతరం తయారవుతోంది. మన యూనివర్శిటీలు కూడా ప్రపంచంలోనే గొప్ప సంస్థలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close