Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

బెర్ముడా ట్రైయాంగిల్‌ అక్కడకు వెళితే అదృశ్యం

? 20 ఫ్లైట్లు – 40 షిప్‌ లు

? 84 గాల్లోకి లేచి గల్లంతు

? 54ఏళ్ళకు ఒక్కటే దొరికిన వైనం

హిస్టరీలో మిస్టరీ కథనాలు-5

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

నగరంలో, అడవిలో తప్పి పోతే ఏదో ఒక దారి పట్టుకొని ఏదో ఒకవిధంగా అడ్రస్‌ కు చేరుకోవచ్చు. అదే ఎక్కిన విమానం ఇలా గాల్లోకి వెళ్ళి అలా అదృశ్యం అయితే… ఎక్కిన ఓడ సముద్రంలోకి ఇలా వెళ్ళి అలా అదృశ్యం అయితే… అందులోని వారి పరిస్థితి ఏమిటి..? అదృశ్యమైన వాటి గురించి సహేతుకమైన కారణాలు శాస్త్రవేత్తలు చెప్పకపోవడంతో ప్రజలలో అనేక అపోహలు నేటికీ రాజ్యమేలుతున్నాయి. ఇలా విమానాలు, ఓడలు ఓకే ప్రదేశంలో అదృశ్యం అయితే… మహా మిస్టరీ.

విమానాలు, ఓడలు అదృశ్యం అయితే అందులోని మనుషులు ఏమైనట్లు.? ఆ అదృశ్య విషయాలన్నీ తెలుసుకోవాలంటే ‘బెర్ముడా ట్రయాంగిల్‌’ ఇలా వెళ్ళి అలా వద్దాం. రండి.

ఎక్కడ ఉంది.?:

‘బెర్ముడా ట్రయాంగిల్‌’ వాయవ్య అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉంది. దీనినే ‘డెవిల్స్‌ ట్రయాంగిల్‌’ అని కూడా అంటారు.

నిజానికి ఇది త్రికోణాకృతిలో ఉండదు. ఫ్లోరిడా అట్లాంటిక్‌ తీరం, శాన్‌ యువాన్‌, ఫోర్టిరికో మధ్యలో ఉన్న దీవి బెర్ముడా. ఎక్కువ ప్రమాదాలు బాహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగాయి. అనేక ఏళ్ల నుండి ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు, ఈ ప్రదేశం విూదుగా ఎగిరే విమానాలు అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యాయి. దీంతో అనేక కథలు, ఊహలు పుకార్లుగా మారి షికార్లు కొట్టాయి.

అమెరికా, యూరోప్‌, కరేబియన్‌ దీవుల ఓడలు విమానాలు ఎక్కువగా ఈ ప్రాంతంలో తిరుగుతాయి. ఇక్కడ గల్ఫ్‌ స్ట్రీమ్‌ సాగర అంతర్వాహిని 5 లేదా 6 నాట్ల వేగంతో ఉంటుంది. దీని వల్ల ఈ ప్రమాదాలు జరిగి ఉండవచ్చు అని పరిశీలకులు చెబుతారు. కానీ ప్రజలు మాత్రం ఈ ప్రాంతంలో జరిగే సంఘటనలకు సంతృప్తికరమైన కారణాలు చెప్పలేక పోవడతో…. గ్రహాంతర వాసులు, అజ్ఞాత వ్యక్తులు ఈ పని చేస్తున్నాయనే ఊహలకు రెక్కలు వచ్చాయి.

వీడు మొదలెట్టాడు:

క్రిస్టఫర్‌ కొలంబస్‌ 1492, అక్టోబర్‌ 11 న ఈ ట్రయాంగిల్‌ లో ఏదో అసంబద్దమైనది ఉందని రాసాడు. అంతే అబద్దపు ప్రచారగాళ్ళకు పనిదొరికింది. 1950, సెప్టెంబర్‌ 16న జోన్స్‌ అనేక ఊహాగానాలు జోడించి రాసాడు. జార్జి సాండ్‌ అనే రచయిత అమెరికా నౌకాదళంకు చెందిన ఐదు అవేంజర్‌ బాంబర్‌ విమానాలు ఎలా అదృశ్యమైన వివరాలు రాసాడు.

మింగేసే మేఘాలు:

బెర్ముడా ట్రయాంగిల్‌ మిస్టరీ ఛేదించాలని ప్రయత్నించిన శాస్త్రవేత్తలు.. వాతావరణ పరిస్థితులను ట్రాక్‌ చేశారు. ఈ క్రమంలోనే కిల్లర్‌ క్లౌడ్స్‌(చంపే మేఘాలు)ని గుర్తించారు. అదృశ్యమైన ఓడలు, విమానాలకు మేఘాలు కూడా కారణమని గుర్తించారు. కానీ నిరూపించ లేకపోయారు.

గంటకు 170 కి.విూ.ల వేగం:

ఈ బెర్ముడా ట్రయాంగిల్‌ దగ్గర ఉండే హెక్సోగోనల్‌ ఆకారంలో మేఘాలు విస్తరించి ఉండటం వల్ల .. వీటి ద్వారా వచ్చే గాలులు చాలా భయంకరంగా ఉంటాయి. వీటి వేగం గంటకు 170 కీ.విూ.లు అందుకే ఆ మార్గంలో వెళ్లే విమానాలు, ఓడలు.. అంతుచిక్కని విధంగా అదృశ్యమయ్యాయి. ఇదీ నిరూపణ కాలేదు.

మేఘాల వెడల్పు మరీ ఓవర్‌ యాక్షన్‌:

సాధారణంగా బెర్ముడా ట్రయాంగిల్‌ కి పడమర వైపు మేఘాలు ఏర్పడి ఉంటాయి. అయితే చాలా మేఘాలకు ఒక పొడవాటి స్ట్రెయిట్‌ గీత ఉంటుంది. ఇది.. అసాధారణమైన విషయం. అలాగే.. ఈ మేఘాలు 20 నుంచి 55 మైళ్ల వెడల్పు ఉన్నట్లు ‘అంచనా’ వేస్తున్నారు.

తెరపైకి ఎయిర్‌ బాంబ్స్‌:

ఈ మేఘాలు సాధారణమైనవి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు వీటిని ఎయిర్‌ బాంబ్స్‌ అని పిలుస్తారరు. అంటే ఇవి గాలి శక్తితో ఉన్న పెద్ద పెద్ద బాంబులన్నమాట. సాధారణ బాంబులలాగే ఇవి కూడా విస్ఫోటన శక్తిని కలిగి ఉంటాయి. అయితే అది గాలి రూపంలో విస్ఫోటన శక్తి కలిగి ఉంటాయి. గాలి బాంబుల వాదన కూడా గాల్లోనే పేలిపోయింది.

అబ్బో అలలు.. 45 అడుగుల ఎత్తు:

ఈ మేఘాలు విస్ఫోటనం చెందినప్పుడు గంటకు 170 మైళ్ల వేగంతో బెర్ముడా ట్రయాంగిల్‌ అలలు వీస్తుంటాయి. అంటే వచ్చిన ఉప్పెన అంత వేగం అన్నమాట. అంటే సముద్రం నుంచి 45 అడుగుల ఎత్తువరకు ఈ అలలు ఎగసిపడుతుంటాయి. మేఘాల వల్ల 20 విమానాలు, అలల కారణంగా 40 ఓడలు గల్లంతు అయితే వాటి ఆనవాళ్ళు, అందులో ప్రయాణిస్తున్న వారి శవాలు ఎందుకు లభ్యం కావడం లేదు. సమాధానం దొరకని హిస్టరీలో మిస్టరీ వీడేది ఎప్పుడు.? అత్యాధునిక సాంకేతిక ప్రపంచంలో వీరికి శాస్త్రోక్తంగా కర్మలు చేసిది ఎప్పుడో…?

ఃూచీ:

ఇప్పటి వరకూ 84 విమానాలు అదృశ్యం..!!

ఇప్పటి వరకూ ప్రపంచంలో 84 విమానాలు ఆచూకీ లేకుండా పోయాయని అంచనా. మొదట 1856లో తొలి సారి బెలూన్‌ విమానం కనిపించకుండా పోయింది 1923 డిసెంబర్‌ 21న సహారా ఎడారిని దాటుతున్న విమానం ఆచూకీ గల్లంతయ్యింది.

ఇందులో 49 ప్రయాణికులు ఉన్నారు. 1938లో 15 ప్రయాణికులు ఉన్న విమానం అదృశ్యం. 1944లో 24 మందితో ఉన్న మిలటరీ విమానం ఒకటి న్యూ అట్లాంటిక్‌ లో అదృశ్యం. మళ్లీ మరో 25 మంది చొప్పున కలిగి ఉన్న మిలటరీ విమానాలు అదృశ్యం అయ్యాయి.1948 జనవరి 30, ఆగస్టు 1 వరుసగా 31, 52 ప్రయాణిలకులతో కూడిన విమానాలు అదృశ్యం. డిసెంబర్లో ఫ్లోరిడాలో 32 మందితో కూడిన విమానం అదృశ్యం. 1949 నుంచి 52 వరకూ ప్రతీ ఏడు విమానాల మిస్సింగ్‌. 1957లో 67 మందితో కూడిన విమానం అదృశ్యం. 1962లో 107 మందితో కూడిన మిలటరీ విమానం పసిఫిక్‌ మహాసముద్రంపై అదృశ్యం. 1989లో హిమాలయ పర్వతాలలో 54 మందితో కూడిన విమానం మిస్సయ్యింది. ఇవి పెద్ద మిస్సింగులైతే ఆ తరువాత 2014లో జరిగిన మలేషియా విమాన మిస్పింగే పెద్దదిగా చెప్పవచ్చు. మధ్య మధ్యలో ఏదో ఒక దేశం పదిమంది, ఇరవైమంది ఉన్న విమానాలు మిస్సవుతూనే ఉన్నాయి. ఇందులో సైనిక విమానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఃనీలీ2

54 ఏళ్ల తర్వాత ఒక్కటి దొరికింది

54ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ విమానం శిథిలాలను ఆండీస్‌ పర్వాతాలలో గుర్తించారు. వివరాల్లోకి వెళితే..1961, ఏప్రిల్‌3న చిలీ ఫుట్బాల్‌ జట్టు సభ్యులు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది.

ఈ ఘటన దక్షిణ అమెరికాలోనే కాకుండా క్రీడా ప్రపంచానికి ఒక జవాబులేని ప్రశ్నలా మిగిలిపోయింది. ఒకటి సురక్షితంగా చేరగా, మరోకటి అదృశ్యమైంది. అప్పట్లో వీరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో అదృశ్యమైన విమానం మిస్టరీగానే మిగిలిపోయింది. శాంటియాగోకి 360 కిలోవిూటర్ల దూరంలోని 3200 విూటర్ల ఎత్తులో పర్వతాలపైన విమానం శిథిలాలను పర్వతారోహకులు కనుగొనటంతో ప్రపంచ వ్యాప్తంగా అదృశ్యమైన విమానాలలో ఒకటి దొరికింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close