బుల్లెట్‌ వదిలి బ్యాలెట్‌ వైపు గద్దర్‌ పయనం

0

ఆగస్టులోనే చెప్పిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’

(రమ్యాచౌదరి)

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మేథావులే… కానీ… సమాజంపై అసహనం.. సరైన సమయంలో జరగని న్యాయం కోసం… యువత సహకారంతో… పెన్ను వద్దని గన్నుతో అడవిదారి పట్టారు. ఎందుకోసం పోరాడుతున్నారో… ఎవరి కోసం పోరాడుతున్నారో… లక్ష్యం ఏమిటో తెలియని అయోమయ స్థితి. ఎవరి కోసమైతే పోరుబాట పట్టారో… వారినే చంపే దుస్థితి. అదే ‘విప్లవం’ అనుకునే భ్రమలో బతుకుతూ… పొట్టకూటి కోసం పనిచేసే పోలీసోడిని, తమకు నచ్చని వారిని చంపుతూ… పైశాచిక ఆనందంలో.. దశాబ్దాలుగా ‘మునిగి’ తేలారు. అస్సలు లక్ష్యం తాకట్టు పెట్టుకుని… అసమర్థపు స్వార్థంతో అధఃపాతాళానికి దిగి’పోయారు’. వేలాదిమంది ప్రాణాలను తీసిన విప్లంవం… తాజాగా బుల్లెట్‌ తో కాదు.. బ్యాలెట్‌ తో సహజీవనం చేస్తామంటూ… సన్నాయి నొక్కులు నొక్కుతూ… ఎన్నికల వైపు కొత్త ఆలోచనలతో సాగుతున్నారు.

కులం నీడలో కాలం వెళ్ళదీస్తన్న గణేశా… వదిలేయండి.. ”ఏం సాధించారని… ఇంకా ఎంతమంది తల్లుల ఉసురు పోసుకుని… ఎన్ని ప్రాణాలు బలి కోరతారు.. తుప్పు పట్టిన భుజాన ఉన్న గన్ను వదిలేయండి.. లేదంటే భవిష్యత్తు తరాలు విూ గురించి చెప్పుకోవడానికి ఏం మిగిలి ఉండదు. ఎంతకాలం శవాలవిూద కవాతు ఎన్నాళ్ళు.. ఎన్నేళ్ళు. స్మశానంలో ‘బూడిద’ కూడా మిమ్మల్ని వెక్కిరిస్తూ.. ప్రతిరోజూ.. వసంతంలోని ‘వెల’ మాయ కోయిల కూస్తూంది.

ఇక ‘బ్యాలెట్‌’ యుద్దనౌక గద్దర్‌:

ప్రజా గాయకుడు గద్దర్‌ గజ్వేల్‌ నుంచి పోటి చేసే యోచనలో ఉన్నారు. ఆయన కుమారుడు కూడా ఎన్నికల్లో పోటి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే గద్దర్‌ తో పాటు ఆయన కుమారుడు కూడా ఢిల్లీ వెళ్లారు. గద్దర్‌ సీఎం కేసీఆర్‌ పై పోటి చేస్తానని గతంలోనే చెప్పారు. ప్రజా ఆశీస్సులు ఉంటే తప్పక విజయం సాధిస్తానని, విూ పాటనై వస్తానని గతంలోనే గద్దర్‌ చెప్పారు. గద్దర్‌ ఆది నుంచి కూడా వామపక్షాల సానుభూతిపరుడిగా ఉన్నారు. గద్దర్‌ హఠాత్తుగా కాంగ్రెస్‌ అధిష్టానంతో కలవడంతో విప్లవ మేథావులలో అంతర్మథనం మొదలైంది.

గద్దర్‌ జీవితం:

గద్దర్‌ మెదక్‌ జిల్లాలోని తూఫ్రాన్‌ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం నిజామా బాద్‌, మహబూబ్‌ నగర్‌ లో జరిగింది. ఇంజనీరింగ్‌ విద్య హైదరాబాద్‌ లో పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ చురుకుగా పాల్గొన్నారు. భావ వ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. దీని కోసం ఆయన బుర్ర కథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శన చూసిన దర్శకులు బి. నరసింగరావు.. భగత్‌ సింగ్‌ జయంతి రోజున ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన ప్రతి ఆదివారం తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971 లో నరసింగరావు ప్రోత్సాహంతో మొదటిపాట ‘ఆపర రిక్షా’ పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్‌. అందుకే ఆయన పేరు గద్దర్‌ గా స్థిరపడింది.

ఆగష్టు 24నే చెప్పిన ఆదాబ్‌ హైదరాబాద్‌

2018, ఆగస్టు 24న, రసవత్తర ఎన్నికలు అనే శీర్షికను ”నాన్నపై పాట..కొడుకుపై ఆట.. కూతురుపై మధురం” అంటూ కధ నం ఇచ్చింది. కేసీఆర్‌ పై గద్దర్‌, కేటీఆర్‌ పై విమ లక్క, కూతురు కవి తపై మధుయా ష్కీ పోటీ చేయ నున్న విషయం స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here