బుజ్జగిస్తాం రండి…

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

సీట్లు రాని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను బుజ్జగించడానికి ఏఐసీసీ అధిష్టానం రంగంలోకి దిగింది. స్థాయిని దృష్టిలో ఉంచుకుని కొందరిని ఢీల్లీకి, మరికొందరిని హైదరాబాద్‌ కు, ఇంకొందరిని జిల్లా కేంద్రాలకు పిలిపుల కార్యక్రమం ప్రారంభించింది. సోమవారం లోపు పార్టీ హైకమాండ్‌ సనత్‌ నగర్‌పై మరోసారి పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశా రు. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి శశిధర్రెడ్డికి ఫోన్‌ వచ్చింది. కాంగ్రెస్‌ ముఖ్యనేత అహ్మద్పటేల్‌ ఆయనతో మాట్లాడుతూ దిల్లీకి రావాలని సూచించారు. దీంతో శశిధర్రెడ్డి హస్తినకు చేరుకున్నారు. వీరితోపాటు మరో 18మంది ఆశావహులు ఢిల్లీకి సోమవారం చేరుకుంటారు.

హైదరాబాద్‌లో…:

మాజీ ఎమ్మెల్సీ, మాజీ కార్పోరేషన్‌ చైర్మన్లు ఇతర రాష్ట్రస్థాయి ప్రముఖులను దువ్వడానికి రాహుల్‌ గాంధీ ధూతలు గోవా మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక మంత్రి శివకుమార్‌ లు హైద రాబాద్‌ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాత్రం బిసీ, కమ్మ కులస్థులకు ‘సమ అన్యాయం ‘ జరిగిందని, దీంతో కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారని చెప్పారు.

కారెక్కిన ముత్యంరెడ్డి: చెరుకు ముత్యంరెడ్డి ఉదయం నాలుగంటలపాటు టిపిసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ రెడ్డి అపాయింట్‌ మెంట్‌ కోసం వేచి చూశారు. పిలుపు అందక పోవడంతో ఆయన తెరాస అధినేత టచ్‌ లోకి వెళ్ళారు. హరీష్‌ రావు వేగంగా స్పందించి కారెక్కించారు.

కుమురం భీం జిల్లాకు భట్టి బృందం: కాంగ్రెస్‌ విడుదల చేసిన మూడో జాబితాలో బోథ్‌ టికెట్‌ సోయం బాపురావుకు కేటాయించారు. ఆ పార్టీకి చెందిన అనిల్జాదవ్‌ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. టికెట్‌ రాని ఆశావహులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సర్వే నివేదికలు చూపి, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు సర్ది చెప్పారు. ప్రస్తుతం టికెట్‌ దక్కని వారికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ లేదంటే రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు ఇస్తామనే ఆశ చూపారు. మొదటి జాబితా వెలువడటంతో మొదలైన అసమ్మతి మూడో జాబితా వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇద్దరు నేతలు ఏనుగు గుర్తుపై బరిలో దిగుతుండగా.. మరొకరు ఎన్సీపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే రాహుల్‌ బుజ్జగింపుల మంత్రం అంతగా పనిచేయలేదనే చెప్పాలి. అధినేతలు ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్న తరుణంలో అసమ్మతి నేతల వల్ల తలనొప్పిగా మారింది. ఆదివారంనాడు కుమురం భీం జిల్లాలో భట్టి విక్రమార్క బృందం పర్యటించింది.సీపీఐలో బాహాబాహి: ప్రజా కూటమి నుంచి వైరా నియోజకవర్గ స్థానాన్ని దక్కించుకున్న సీపీఐలో ఇంటి పోరు రచ్చ కెక్కింది. అంతర్గత పోరు కారణంగా శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి యర్రాబాబు, మండల కార్యదర్శి యామాల గోపాలరావు, నాయకులతో కలసి ఆ పార్టీ అభ్యర్థి బాణోత్‌ విజయాబాయి శనివారం నామినేషన్‌ వేసేందుకు వైరాలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సీపీఐ నుంచి టికెట్‌ ప్రయత్నించి భంగపడ్డ బాణోత్‌ లాల్సింగ్‌ అదే సమయంలో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు తన అనుచరులతో అదే సమయంలో ర్యాలీగా కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో పార్టీ కండువాలు, జెండాలు చేతపట్టుకుని వారంతా హడావుడి చేశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అధికారికంగా విజయబాయిని అభ్యర్థిగా ప్రకటించామని జిల్లా కార్యదర్శి బాగం హేమంత్రావు, ఇతర నాయకులు లాల్సింగ్కు స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీని అడ్డుకున్నారు. పార్టీ వ్యతిరేక చర్యలు పాల్పడటం సమంజసం కాదని లాల్సింగ్‌ అనుచరుల మెడల్లోని పార్టీ కండువాలు, వారి వద్దనున్న జెండాలను లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల నాయకులు ఒకరినొకరు నెట్టుకున్నారు. అనంతరం సీపీఐ అభ్యర్థిగా విజయాబాయి, తన అనుచరులతో కలసి లాల్సింగ్‌ స్వతంత్ర (సీపీఐ తిరుగుబాటు) నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థి నామినేషన్‌ అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంత్రావు మాట్లాడుతూ లాల్సింగ్ను రెండు నెలల క్రితమే తాము పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామన్నారు. అయినా పార్టీ జెండాలతో ర్యాలీగా వచ్చినందునే తాము అభ్యంతరం తెలిపామన్నారు. లాల్సింగ్కు తమ పార్టీతో ఏ సంబంధం లేదన్నారు. కూటమి నుంచి తమ అభ్యర్థి విజయాబాయి విజయం ఖాయమన్నారు. ఈ సంఘటనపై లాల్సింగ్‌ మాట్లాడుతూ తనను పార్టీ సస్పెండ్‌ చేయలేదన్నారు. తనకు అన్యాయం జరిగినందునే నామినేషన్‌ వేసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఏదేమైనా ఎర్రపార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని.. ఆ పార్టీల లక్షణాలు అలవర్చుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here