బీసీ జాబితాలో చేర్చాలని వచ్చిన వినతులపై విచారణ

0

గుర్తింపులేని 30 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని వచ్చిన వినతులను విచారించడంలో భాగంగా తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఖైరతాబాద్ లోని తమ కార్యాలయంలో తేది.29.06.2019 నుండి 05.07.2019 వరకు బహిరంగ విచారణ మ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నదని తెలంగాణ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ బి.వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో కమిషన్ ఇదివరికే ప్రకటన జారీ చేసిందని, విచారణలో భాగంగా ఎవరైనా వ్యక్తులు, సంస్థలు, సంఘాలు తమతమ విజ్ఞప్తులు, సూచనలు , ఆక్షేపణలను వ్రాత పూర్వకంగా, మౌఖికంగా కమిషన్ కు సమర్పించడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారని అన్నారు. తమ తమ విజ్ఞప్తులు, సూచనలు, ఆక్షేపణలకు మద్దతుగా వారి వద్ద లభ్యంగా ఉన్న అట్టి డేటా/అదనపు సామాగ్రి సాక్ష్యాలను కమిషన్ చే సూచించబడిన నిర్ధిష్ట వెరిఫికేషన్ అఫిడవిట్ ను జతపరచవలసి ఉంటుందని తెలిపారు.
కావున ఆసక్తి గలవారు ఈ బహిరంగ విచారణలో పాల్గొని తమతమ అభిప్రాయాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో కమిషన్ కు నివేదించాలని తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్ మెంబర్ సెక్రటరీ బి.వెంకటేశం కోరారు.

బీసీ జాబితాలో చేర్చవలసిందని కోరిన కులాల జాబితా:

1.కాకిపడగల, 2. మందెచ్చుల, 3. సన్నాయోల్లు / బత్తిన, 4. కుల్ల కడగి, 5. బైల్ కమ్మర, 6. బాగొతుల, 7. బొప్పల, 8. తోలుబోమ్మలాట వాళ్లు, 9. గంజికూటి వారు. 10. శ్రీ క్షత్రియ రామజొగి, 11. ఏనూటి, 12. గుర్రపు వారు. 13. అద్దపు వారు, 14. కడారి సైదరోల్లు, 15. సరగాని, 16. ఓడ్, 17. మాసయ్యలు / పటం వారు, 18. సాధనా శూరులు, 19. రుంజ, 20. పాపల, 21. పనస, 22, పెక్కర, 23. పాండవుల వారు, 24., గౌడ జెట్టి, 25. ఆది కొడుకులు, 26. తెర చీరల, 27. సారోళ్ళు, 28. అరవ కోమటి, 29. అహీర్ యాదవ్, 30. గొవిలి.
ఈ రోజు జరిగిన బహిరంగ విచారణలో కాకిపడగల, సారోళ్ళు కులస్థులు బీసీ కమిషన్ ముందు వారి విజ్ఞప్తులను వినిపించారని ఆయన వివరించారు. మిగతా కులాల వారు వారి విజ్ఞప్తులు పైన పేర్కొన్న తేదీలలో ఖైరతాబాద్ లోని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మెయిన్ బిల్డింగ్ వెనుకవైపు బ్లాక్ నాలుగవ అంతస్తు లోని తమ కార్యాలయంలో కమిషన్ ఎదుట సమర్పించాలని తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్ మెంబర్ సెక్రటరీ బి.వెంకటేశం కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here