బీజేపీలోకి రాములమ్మ..!

0

కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలపై గురి

  • 18న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సభ
  • అమిత్‌షా సమక్షంలో భారీగా చేరికలు

కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మిగిలిన రాష్టాల్ల్రోనూ పాగావేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ, అదే వ్యూహాన్ని హర్యానాలోనూ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఒక్క ఎమ్మెల్యే లేని హర్యానా అసెంబ్లీలో ఏకంగా ఒకే రోజు పది మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని రెండవ అతిపెద్ద పార్టీగా అక్కడ అవతరించింది. రాబోయే కాలంలో అక్కడా అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇలా అన్ని రాష్టాల్ల్రో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే ధ్యేయంగా మోదీ, అమిత్‌షా ఆధ్వర్యంలోని త్రయం పనిచేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు బీజేపీ కేంద్ర అధిష్టానం గురి తెలంగాణపై పడింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నాలుగున్నరేళ్ల ముందే అందుకు అనుగుణంగా స్కెచ్‌ వేస్తోంది. రాష్ట్రంలో వివిధ పార్టీల్లో కీలకంగా ఉన్న నేతలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలపై కన్నేసింది. కొందరు బీజేపీ నేతలు ఆయా నేతలతో మంతనాలు సాగిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలోకి టచ్‌లో ఉన్నారు. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమైన ఆయన, మళ్లీ వెనక్కు తగ్గారు. కాగా త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం విస్తృతంగా సాగుతుంది. మరోవైపు మాజీ ఎంపీ వివేక్‌సైతం ఇటీవల బీజేపీలో చేరారు. తెలంగాణలోని ప్రముఖ నాయకులందరినీ పార్టీలోకి ఆహ్వనిస్తుంది బీజేపీ అదిష్టానం. ఈ నేపథ్యంలోనే ఒకప్పటి హీరోయిన్‌, ప్రస్తుతం టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతిని తిరిగి బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వాజ్‌పేయి హయాంలో బీజేపీలో విజయశాంతి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతోంది. కొద్దికాలంగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న విజయశాంతి ప్రస్తుతం తెలంగాణలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్నారు. అయితే తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ విజయశాంతిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించినట్లు, దీనికి ఆమె అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. విజయశాంతితో పాటు మాజీ డిప్యూటీ సీఎం కూడా కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. వారి బాటలోనే ముగ్గురు మాజీ ఎంపీలు, 8మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుందుకు సుముఖంగా ఉన్నారని, వారితో ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత కూడా బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 18వ తేదీన నాంపల్లిలో ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగే సభలో కేంద్ర ¬ంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గోనున్నారు. ఆయన సమక్షంలో భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here