Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

బీజేపీకి మ్యాటర్‌లేదు..

అది తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తోక పార్టీనే

  • 26న నార్కెట్‌పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా
  • కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌

తెలంగాణలో బీజేపీది హడావుడేనని.. ఆ పార్టీకి విషయం లేదని, తెలంగాణ ప్రజలు బీజేపీని విశ్వసించరని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ తోకపార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇక, రాష్ట్రంలో బీజేపీ హడావిడి చేస్తోంది.. కానీ, విషయం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు కొన్నిపొరపాట్ల వల్లనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎండగడుతూ ప్రజాల్లోకి వెళ్లేందుకు ఈ నెల 26వ తేదీన నార్కెట్‌పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు వెంకట్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఓటు బ్యాంకే లేని బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే నవ్వొస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా సాగుతున్నా.. తెలంగాణలో మాత్రం బీజేపీకి అవకాశం ఉండదని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ పూర్వవైభవం పొందనుందని, టీఆర్‌ఎస్‌ పార్టీ పాలన పట్ల ప్రజలు విసిగిపోతున్నారని, కాంగ్రెస్సేతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారని అన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌, బీజేపీలోకి వెళ్లినవారంతా ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్‌లోకి వస్తారని, ఆ విధంగా ప్రజలే కాంగ్రెస్‌కు దన్నుగా ఉంటారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ పెట్టిన బిల్లులకు మద్దతు ఇస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ, రాష్ట్రంలో మాత్రం బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని, ఈ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులని ప్రజలు అర్థంచేసుకున్నారని, ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close