బిసి/ఎస్సీ/ఎస్టి హాస్టల్లో పిల్లలను చేర్పించండి. ఉచిత భోజన వసతి – చదువు ఉపయోగించుకోండి

0

            


            రాష్ట్రంలోని బిసి/ఎస్సీ/ఎస్టీ హాస్టళ్లలో 3 తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే పిల్లలను పాటశాల హాస్టళ్ళలో చేర్పించాలని, అలాగే కాలేజి కోర్సులు చదివే వారికి కాలేజి హాస్టళ్ళలో చేర్పించాలని, ఉచిత భోజన వసతి, చదువు ,సౌకర్యాలు పొందాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే.  తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు మరణించిన పిల్లలకు, అనాధలకు, అత్యంత వెనుకబడిన వారి పిల్లలకు వెంటనే చేర్చుకుంటారు.

          హాస్టళ్లలో విద్యార్థులకు మంచి సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రోజూ మూడు పూటలా ఉచిత భోజనం, అన్ని సౌకర్యాలు గల గదులు, పుస్తకాలు, నోట్ బుక్స్,  4 జతల టేరికాట్ డ్రెస్సులు ఇస్తారని తెలిపారు. అలాగే  పుష్టికరమైన ఆహారం పెడతా.రు రోజు ఆహారంలో ఒక కోడి గుడ్డు, రోజు పండ్లు, పాలు, పెరుగు పెడుతారు. వారానికి రెండుసార్లు మాంసాహారం పెడతారు.

          తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలలో బీసీ/ఎస్సీ/ఎస్టి హాస్టల్లో ఉన్నాయి. రాష్ట్రంలో బీసీ హాస్టళ్ళు  702, ఎస్సీ హాస్టల్స్  890, ఎస్టి హాస్టల్స్ 309 ఉన్నాయి. ఇందులో 3 లక్షల మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. ఇది గాక అదనంగా SC లకు 241, ST లకు 133, BC లకు 262 గురుకుల పాటశాలలు ఉన్నవి.

          ఇటీవల ప్రభుత్వం విద్యార్థుల మెస్ చార్జీలను మూడవ తరగతి నుండి 7వ తరగతి  వారికి నెలకు 1100, అలాగే కాలేజీ హాస్టల్ కు 1500 భోజనం ఖర్చులు ఇస్తారు. అలాగే సన్న బియ్యంతో నాణ్యత గల పుష్టికరమైన ఆహారం పెడతారు. అలాగే పాకెట్ మనీ ,కాస్మోటిక్ ఛార్జీలు ఇస్తారు.

          అలాగే కాలేజీ హాస్టల్ లో కూడా ఇంటర్మీడియట్ నుంచి పీ.జీ కోర్సులు చదివే వరకు అడ్మిషన్లు ఇస్తారు. వీరికి కూడా ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

          ఇటివల ప్రకటించిన SSC ఫలితాలలో హాస్టళ్ళ విద్యార్థుల ఉత్తిర్ణతశాతం 94 ఉంది. అలాగే గురుకుల పాటశాల ఉత్తిర్ణత శాతం 98.8 ఉంది. మంచి ఉన్నత విద్యా ప్రమాణాలు గల విద్యా ఇవ్వడం జరుగుతుంది.

           ఈ హాస్టళ్ళలో పిల్లలను చేర్పిస్తే చదివి భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలుగా తయారవుతారు. చాలామంది హాస్టల్లో ఉండి చదివిన వారు ప్రస్తుతం దేశంలో 40 మంది వరకు ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ లకు సెలక్ట్ అయ్యారు. వేల సంఖ్యలో డాక్టర్లు, లక్షల సంఖ్యలో ఇంజనీర్లు, ఇతర ఉన్నత చదువులు చదివారు. అభివృద్ధి చెందారు. తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో ప్రస్తుతం హాస్టల్లో ఉండే చదివిన వారు ఏడుగురు మంత్రులు, 36 మంది శాసనసభ్యులున్నారు.

          హాస్టళ్లలో పిల్లలను చేర్పించడానికి బీసీ సంఘాలు, దళిత సంఘాలు, యువజన సంఘాలు ప్రచారం చేసి  చేర్పించాలని కోరారు. సంబంధిత హాస్టల్ వార్డెన్ లను, అధికారులను సంప్రదించి హాస్టళ్లలో చేర్పించాలి. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ఈ కింది ఫోన్ నెంబర్: 040- 27641710  కు ఫోన్ చేసి సహాయం పొందగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here