Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

బానిస సంకెళ్ళపై విచారణ

ప్రశ్నించిన రాష్ట్ర బాలల హక్కుల సంఘం

? స్పందించిన ఎస్పీ

? భేషజాలకు పోని పోలీసులు

? బాల బాధితుడి విడుదల

? ‘ఆదాబ్‌’కు కృతజ్ఞతలు

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

‘బాలుడికి బానిస సంకెళ్ళు ఏల’ అంటూ ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ప్రచురించిన సంచలన కథనం శనివారం అటు ప్రభుత్వాన్ని, ఇటు మానవతా సంఘాలు, బాలల సంఘాలను కదిల్చింది. సిఎం కార్యాలయం కూపీ లాగింది. డిజిపి ఆఫీస్‌ వివరాలు సేకరించింది. ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఆరా తీశాయి. మానవ హక్కుల సంఘాలు ప్రశ్నించాయి. ఇక బాలల హక్కుల సంఘం అగ్గివిూద గుగ్గిలం అయింది. సూర్యాపేట ఎస్పీతో నేరుగా సంప్రదింపులు జరిపింది. ఆయన విచారణకు ఆదేశించారు. ఎట్టకేలకు ఆ బాలుడికి సంకెళ్ళ నరక యాతన మాత్రం తప్పింది. ఆ మైనర్‌ బాలుడిని జువైనల్‌ ¬ంకు తరలించారు.

బాలల సంఘం పోరాటం:

సూర్యాపేటజిల్లా, చివ్యెంల మండల పోలీస్‌ స్టేషన్‌ లో మైనర్‌ బాలుడిని అక్రమంగా నిర్భందించడమే కాకుండా కిటికీ ఊచలతో కలిపిన గొలుసుతో ఓ పశువు కన్నా హీనంగా బంధించడాన్ని బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న బాలల హక్కుల సంఘం ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. పిల్లలు తెలియక, మానసిక పరిపక్వత లేక నేరాలు చేసినపుడు వారిని సరిదిద్దడంలో ‘కరెక్షనల్‌ ¬మ్స్‌’ విఫలం అవుతున్నందు వల్లనే పిల్లల కరడు కట్టిన నేరస్తులు అవుతున్నారని, పిల్లలను తీర్చిదిద్దాలే కాని శిక్షించి మరింత నేరస్తులను తయారు చేయకూడదని, పిల్లలు నేరాలు చేసినపుడు పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది.

ఃనీలీ

సుప్రీంకోర్టు కు వెళతాం:

సార్క్‌ దేశ అంతర్జాతీయ మానవహక్కుల, తెలంగాణ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున

తెలంగాణ రాష్ట్రంలో హక్కులు హరించుకు పోతున్నాయని, ప్రత్యేకంగా బాలల హక్కులు ఈ సంఘటనతో అందరికీ తెలిశాయని, సరైన చర్యలు తీసుకోకుండా ఉంటే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.

ఃనీలీ:

విచారణ చేస్తున్నాం -ఎస్పీ వెంకటేశ్వర్లు

ఈ విషయంపై సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు దృష్టికి బాలల హక్కుల సంఘం తీసుక వెళ్లింది. ఆయన ఈ విధంగా స్పందించారు. ”ఆ బాలుడు కరడు కట్టిన నేరస్తుడనీ, అతను మైనర్‌ అన్న సంగతి తర్వాత తెలసిందని, అయినా ఈ ఘటనపై విచారణ చేస్తున్నాం’ అని చెప్పారు.

ఃనీలీ:

ఆదాబ్‌ కు కృతజ్ఞతలు – అచ్యుతరావు (రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు)

ఓ మారు మూల ప్రాంతంలో జరిగిన సంఘటనను బాహ్య ప్రపంచానికి చెప్పిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సంచలన దినపత్రికకు బాలల సంఘం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఃూచీ:

విడుదల చేసిన పోలీసులు:

‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వచ్చిన కథనాన్ని ఎక్కడ పోలీసు శాఖ ఖండించలేదు. పట్టింపులకు పోలేదు. సరికదా… యథాతథంగా వివరాలు ఇచ్చింది. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు పోలీసులు వెళ్నకపోవడం కూడా అభినందించ వచ్చు. శనివారం సాయంత్రం స్వయంగా డిఎస్పీ నాగేశ్వరరావు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సన్నివేశాలను వివరించారు. బాలుడి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ చేసి బాలుడిని వారితో పంపిచామని చెప్పారు.

సూర్యాపేట విచ్చేసిన ఐజి నాగిరెడ్డి

ఇది ఇలా ఉండగా ”బాలుడికి బానిస సంకెళ్ళు ఏల..!” ఆదాబ్‌ కథనం తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి చెలరేగింది. దీంతో స్వయంగా సూర్యాపేట వెళ్ళి ఐజి నాగిరెడ్డి పరిస్థితిని సవిూక్షించారు. అధికారులను ఏం జరిగిందనే కోణంలో విషయాలను తెలుసుకున్నొరు. ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్‌ ఎస్పీ, డిఎస్పీ తదితరులు ఆరనతో ఉన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close