“బాత్రూమ్” లోనే…“గుండె పోటు మరణాలు” వస్తాయి..ఎందుకంటే..

0

 

బాత్రూమ్ లోనే గుండె పోటు ఎందుకు వస్తుంది అనే సందేహం ఇప్పటివరకూ ఎవరికీ వచ్చి ఉండదు..అయితే చాలా మంది బాత్ రూమ్స్ లో గుండె పోటు వచ్చి మరణించిన వారు అనేకమంది ఉన్నారు మనం వింటూనే ఉంటాము..అయితే తాజాగా సినీ నటి శ్రీదేవి చనిపోవడంతో ఈ వార్త ఇప్పుచు చర్చనీయంసం అయ్యింది..నిజంగానే అసలు స్నానం చేసేటప్పుడు ఎందుకు గుండె పోటు వస్తుంది అంటే దానికి కారణం లేకపోలేదు..

సహజంగా గుండె పోటు ఎందుకు వస్తుందంటే…గుండెకి రక్త ప్రసరణ జరిగే క్రమంలో ఆ ప్రసరణకి అడ్డంకులు కలిగినప్పుడు గుండె పోటు సంభవిస్తుంది..ఈ సమయంలో..రక్తం నేరుగా గుండెకి వెళ్ళే దారిలేక పక్కకి చిమ్ముతూ ఉంటుంది..ఇలా రక్తం పూర్తి స్థాయిలో గుండెకి చేరదు..దాంతో గుండెపోటు సంభవిస్తుంది..ఒక్కోసారి ఈ తీవ్రత ఎక్కవగా ఉంటె ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది..

అయితే స్నానాల గదిలో ఈ గుండె పోటు ఎందుకు వస్తుంది అంటే..దీనిపై పలువురు విద్యలు చెప్పిన విషయాలని పరిశీలిస్తే చాలా మంది స్నానం చేసే క్రమంలో ముందుగా తలని తడుపుకుంటారు..ఇప్పుడు అందరు షవర్స్ కింద స్నానం కాబట్టి ముందుగా తడిచేది తలే..అయితే ఇలా చేయడం వలన వేడి ర‌క్తం గ‌ల‌ శరీరం ఒక్కసారిగా ఆ ఉష్ణోగ్ర‌త‌ను బ్యాలెన్స్ చేసుకోలేదు దాంతో నీళ్లు ప‌డిన త‌ల భాగం వైపున‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ ఒక్క‌సారిగా హెచ్చుకి చేరుతుంది..దీంతో ర‌క్త‌నాళాల్లో ఎవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటుకు కార‌ణ‌మ‌వుతాయి.

అంతేకాదు ఈ సమయంలోనే ఒక్కోసారి పక్షవాతం కూడా రావచ్చు..అందుకే ముందుగా స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాల నుంచి పైకి నీటిని వేసుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి. ముఖ్యంగా అధిక ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్‌, మైగ్రేన్‌తో బాధ‌ప‌డుతున్నవారు ,మాత్రం స్నానం చేసేట‌పుడు ఈ విధానాన్నే అనుసరించాలని సూచిస్తున్నారు వైద్యులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here