Featuredస్టేట్ న్యూస్

బతుకమ్మకు హుస్సేన్‌ సాగర్‌ ముస్తాబు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న జిహెచ్‌ఎంసి

ఆకట్టుకోనున్న స్వాగత తోరణాలు…కటౌట్లు

హైదరాబాద్‌

సద్దుల బతుకమ్మ ఉత్సవానికి నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ తీరం ముస్తాబవుతోంది. గతనెల 28న ఎంగిలిపువ్వుతో ప్రారంభమైన బతుకమ్మ ఈనెల 6న సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నది. చివరిరోజైన సద్దుల బతుకమ్మ జరిగే ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణం కనిపించేలా హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది. భారీ లైటింగ్‌లను, కటౌట్లను ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఆకట్టుకునే స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తోంది. దీనికితోడు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్‌ఏ ప్రయత్నాల్లో ఉంది. ఈ ఏడాది దాదాపు రూ.49 లక్షలతో బుద్ధభవన్‌ నుంచి సంజీవయ్యపార్క్‌, సాగర్‌పార్క్‌ కలిపి ఐదు బతుకమ్మ ఘాట్లకు పెయింటింగ్‌ వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతోపాటు ఎన్టీఆర్‌ మార్గ్‌, నె/-లకెస్‌రోడ్‌లో ప్రత్యేక అలంకరణతో పాటు, లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యకూడళ్లలో బతుకమ్మ విశిష్టతను తెలుపుతూ పేపర్‌ బతుకమ్మలు, భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ వేడుకలు జిల్లాల్లో ఘనంగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది పెద్దఎత్తున బతుకమ్మ సంబురాలను వైభవంగా జరుపుతున్నారు. అందులో భాగంగా పెద్దఎత్తున మహిళలు బతుకమ్మలు పేర్చగా ఎల్‌బి స్టేడియంలో సద్దుల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. గతంలో బతుకమ్మ పండుగకు ఆదరణ కరువైతే, రాష్టాన్న్రి సాధించాక కేసీఆర్‌ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నది. బతుకమ్మ పండుగ కీర్తిని ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత విదేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించి దేశ ఖ్యాతిని చాటిచెప్పారు. సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో సద్దుల బతుకమ్మ పండుగకు సకల ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

ఐటి ఉద్యోగుల వినూత్న ప్రయత్నం

బతుకమ్మ సంబురాలను సందేశాత్మకంగా నిర్వహించాలని ఐటీ ఉద్యోగులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూలతో దర్శనమిచ్చే బతుకమ్మను సాంకేతికతతో రూపొందించనున్నారు. ఐటీ రంగంలో నూతన, ఉత్తమ ఉపాధి వేదికలుగా నిలుస్తున్న తొమ్మిది టెక్నాలజీస్‌తో టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో చేపట్టనున్న ఈ టెక్‌ బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమలశాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ప్రశంసించా రు. ఐటీ రంగంలో ఉపాధి కోరుకుంటున్న యువత ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్‌పై పట్టు సాధించేల ప్రేరణ కలిగించేందుకు సాంకేతిక బతుకమ్మను చేపట్టినట్టు టీటా ఫౌండర్‌ సందీప్‌కుమార్‌ మక్తాల తెలిపారు. ఇందులో భాగంగా

బతుకమ్మ గోపురం 3డీ ప్రింటింగ్‌ డిజైన్‌తో రూపొందించబడి ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఓవర్‌ థింగ్స్‌(ఐవోటీ) ఆధారంగా బతుకమ్మ ఓపెన్‌ అవుతుంది. రోబోటిక్స్‌ రోవర్‌ సహాయంతో బతుకమ్మ తన చుట్టూ తాను తిరుగుతుంది. డ్రోన్‌ సహాయంతో ఆ పరిధిలో బతుకమ్మ చక్కర్లు కొడుతుంది. ఇలా పలు సాంకేతిక విశిష్టలతో బతుకమ్మ రూపుదిద్దుకోనున్నది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close