Featuredజాతీయ వార్తలు
ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం

అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక భవనం నుంచే మొదలు :
ముఖ్యమంత్రి వైయస్ జగన్
అధికారం చేపట్టాక తొలిసారిగా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశం. రెండు రోజుల సమావేశాల్లో భవిష్యత్ ప్రణాళికను కలెక్టర్లతో చర్చించనున్న ముఖ్యమంత్రి. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక భవనం నుంచే మొదలు పెడుతున్నాం. ప్రజావేదికలో ఇదే కలెక్టర్ల చివరి సమావేశం, రేపు ఎస్పీలతో మీటింగ్ తర్వాత ఎల్లుండి నుంచి ఈ భవనాన్ని కూల్చివేస్తున్నాం – కలెక్టర్ల మీటింగ్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. మనం పాలకులం కాదు. ప్రజా సేవకులం. అందరూ మీ మీ జిల్లాలో మంచిపేరు తెచ్చుకోవాలి. కలెక్టర్ల సమావెశంలో వై యస్ జగన్.