ప్రపంచ త్వైకొండో చాంఫియన్ షిప్ మాస్కట్ ఆవిష్కరణ

0

సచివాలయంలో ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రపంచ త్వైకొండో చాంఫియన్ షిప్ టోర్నమెంట్ మాస్కట్ ను ఆవిష్కరించారు.ప్రపంచ త్వైకొండో చాంఫియన్ షిప్ కు గ్లోబల్ సిటి హైదరాబాద్ నగరం వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు.
మెుదటి ప్రపంచ త్వైకొండో చాంఫియన్ షిప్ ఇంగ్లాండ్ లోని మాంచేస్టర్ నగరం లో జరిగింది. ఈ ఈవెంట్ నిర్వాహణకు పలు దేశాలు పోటి పడ్డాయి. నిర్వాహకులు భారతదేశం ను ఎంచుకోని అందులో భాగంగా దేశంలో ని అత్యత్తమ క్రీడా వసతులు కలిగిన , గ్లోబల్ సిటి గా పేరు గుర్తింపున్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 2వ ఎడిషన్ ప్రపంచ త్వైకోండో చాంఫియన్ షిప్ ను జూన్ 11 నుండి 16 వరకు హైదరాబాద్ లోని జి ఎం సి బాలయేగి అంతర్ఝాతీయ స్టేడియం లోని ఇండోర్ మైదానంలో జరుగుతుందన్నారు. ఈ చాంఫియన్ షిప్ లో ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, చైనా, ఇంగ్లండ్, అమెరికా, నేపాల్ లాంటి 25 దేశాలకు చెందిన క్రీడాకారులు,మన దేశం నుండి 29 రాష్ట్రాలు,6 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 2500 మంది, జాతీయ, అంతర్ జాతీయ స్థాయి క్రీడాకారులు తలబడబోతున్నారని వెల్లడించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ ఈవెంట్ ను సుమారు 10 వెల మంది క్రీడాభిమానులు వివిధ దేశాల నుండి ప్రత్యక్షంగా తీలకీంచబోతున్నారు. వివిధ దేశాలలోని చానళ్లు లైవ్ కవరేజీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారని తెలిపారు. సుమారు 5 కోట్ల బడ్జేట్ తో పూర్తిగా ప్రవేట్ స్పాన్సర్ షిప్ లతో ద్వారా ఈ ఈవేంట్ ను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి కెసిఆర్ అదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం, క్రీడా శాఖ తరుపున గచ్చిబౌలి స్టేడియం లోని ఇండోర్ స్టేడియం ను , క్రీడాకారుల వసతి ని కల్పించి వారికి సహాయ సహకారాలను అందజేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ప్రపంచ త్వైకొండో చాంఫియన్ షిప్ నిర్వాహకులను అభినందించారు మంత్రి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here