ప్రతి ఓటు కీలకమే…

  0

  ఇన్ని రోజులు గుర్తుకురాని ఓటర్లు ఇప్పుడు గుర్తుకు వస్తున్నారు.. వారి ఓట్లు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కీలకం కానున్నాయి… రావాలి రావాలి మీరే మా దేవుళ్లు అంటూ రాయబారాలు మొదలెట్టారు. చేసుకోవడానికి స్వంత రాష్ట్రంలో కూలిపని కల్పించని పార్టీలు గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటున్నారు.. ఒకటి కాదు రెండు కాదు పదుల నియోజకవర్గాల్లో, లక్షల ఓటర్లు బతకాడినికి వెళ్లినవే ఉన్నాయి. పల్లెలను విడిచి పట్నాలకు వెళ్లిన వారిని, గల్ఫ్‌ దేశాలలో బతుకుతున్న వారిని రప్పించేందుకు పరుగులు పెడుతున్నారు బరిలో ఉన్న అభ్యర్థులు..

  హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎన్నికలు అంటేనే హాడావుడి.. ఒక పక్క ప్రచారం జరుగుతూనే ఉంటుంది. మరొ పక్క తన అనుకునే ఓటర్లకు తాయిలాలు ఇస్తూనే ఉంటారు. మిత్రుడికి తెలిసిన మిత్రులకు, బంధువులకు తెలిసిన స్నేహి తులకు రాష్ట్రంలోనే కాకుండా బతకడానికి నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రతి ఒక్కరిని ప్రేమగా చేరదీసే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీ నాయకులు.. బంగారు తెలంగాణ ఏర్పడ్డాక అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఉపాధి కల్పించడంలో, చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ది చేయడంలో విఫలం కావడంతో చాలా గ్రామాల నుంచి యువకులు, జనాలు బతుకు ప్రయాణం సాగించేందుకు పొట్ట చేత పట్టుకొని పోయిన వారెందరో ఉన్నారు. వారందరిని రప్పించి వారి ఓట్లను వాడుకునేలా ప్రయత్నాలు ప్రారంభించాయి రాజకీయ పార్టీలు.. ఏ నియోజకవర్గ నుంచి ఎంతమంది ఏఏ ప్రాంతాలకు ఎక్కడెక్కడ వలసపోయారు. ఎక్కడ బతుకుతున్నారు వాళ్లను ఏలా తీసుకురావాలి అని ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలో జరగబోయే అన్ని పార్టీలకు ఇప్పుడు ప్రతి ఓటు ప్రధానమే కానుంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో నాయకులు అప్పుడే గెలుపోటముల లెక్కలు వేసుకుంటున్నాయి. అనుకూల ప్రతికూల అంశాలతో పాటు సామాజిక వర్గాల పరంగా ఓటర్లకు గాలం వేసేందుకు పావులు కదుపుతున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు అవసరమైతే వారి బంధుగణాన్ని మొత్తం రంగంలోకి దింపి ఎవరికి పరిచయాలు ఉన్నాయో, ఎవరికి ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలుసుకొని వారితో మాట్లాడి తమ వైపు తిప్పుకునేలా మమ్ముర ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోని ప్రజలు ఇతర ప్రాంతాలతో పాటు గల్ప్‌ వలస వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నారు. అత్యధిక స్థానాల్లో ప్రధాన ఓటింగ్‌ ఉన్న గల్ఫ్‌ కార్మికులపై పోటీచేసే అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఉత్తర తెలంగాణలోని 25 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో గల్ఫ్‌ ఓటర్లు ఉంటారు. వారిని ఏలా రప్పించాలి, ఎవరితో పిలిపించాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలిసింది.

  వలస ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.

  బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు కాకుండా గల్ఫ్‌ వెళ్లిన ఓటర్లు ఇంచుమించుగా 13లక్షలు మంది ఉన్నట్లు అంచనా వేశారు. వారందరికి ఉత్తర తెలంగాణలో ఓట్లు ఉన్నాయి. వీరిని అకర్షించేందుకు పోటాపోటీ పథకాలను ప్రవేశపెడుతున్నాయి టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు. గత ప్రభుత్వ విధానాల వల్లే దేశం విడిచి వెళ్లున్నారని టిఆర్‌ఎస్‌ విమర్శిస్తుంటే, కాదు కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధి కరవై జీవనోపాధి కోసం వెళ్లినవారే ఎక్కువమంది ఉన్నారని కాంగ్రెస్‌ అంటుంది. గల్ఫ్‌ కార్మికులను ఆదుకోవడంలో టిఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంది. అధికారంలోకి రాగానే ఆదుకునేందుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తామని ఇరు పార్టీలు గంట కొడుతున్నాయి. ఉన్న రాష్ట్రంలో ఉపాధి కల్పించడానికి చాతకాని ప్రభుత్వాలు ఓట్లకోసం మాత్రం మళ్లీ అమలుకాని హమీలిచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లున్న వారిలో 80 శాతానికి పైగా కూలీ పనుల కోసమే వెళ్తున్నారు. దళారులు కూడా వీరిని దోచుకుంటూ, ముందు ఏం చెపుతున్నారో, వెళ్లాక ఏం పనిచేపిస్తున్నారో అర్థంకాదు. కట్టుకున్న భార్యను, కన్నపిల్లలను వదిలి బతుకుజీవనం కోసం అంతదూరం వెళ్తున్నవారిని అనుకొని ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ముందుకు వచ్చే నాయకులు ఎవ్వరూ ఉండరు. కాని ఇప్పుడు వారీ ఓట్లే అవసరమయ్యాయి. సాధారణ రోజుల్లో వీరి స్థితిగతులను పట్టించుకోని పార్టీలు, ఎన్నికల సమమయంలో గల్ఫ్‌ కార్మికులు సంక్షేమం కోసం పాటుపడతామని హామీలు ఎక్కుపెడుతున్నారు. సదరు అంశాలను మేనిఫెస్టోలో చూపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం గల్ఫ్‌ దేశాల్లో పర్యటించింది. అక్కడి పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సమస్యలు తెలుసుకున్నామని వారికి త్వరలోనే అన్నిరకాలుగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని వరాల జల్లులు కూడా కురిపించడం మొదలు పెట్టారు. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ గల్ఫ్‌లో పాగా వేసేసరికి టిఆర్‌ఎస్‌ కూడా ఆప్రమత్తమై టిఆర్‌ఎస్‌ ఎంపీ కవిత, గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందో, ఇంకా ఏం చేయబోతుందో వంటి కార్యక్రమాలను కూడా వివరించడం జరిగిపోయింది.

  ఉపాధీ లేక గల్ఫ్‌ దారి.. ఎన్నిలు ముందు మాత్రమే

  నాయకులకు మేము గుర్తుకు వస్తున్నామని, ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు ఎవ్వరికి చెప్పినా పట్టించుకునే వారు లేరు. సొంత రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పనిచేసుకోవడానికి పనిలేక దేశంకాని దేశంలో బతుకుతున్న జీవితాలు వ్యధలు మాత్రం వర్ణనాతీతంగానే ఉన్నాయి. అక్కడి పరిస్థితులు, పనివిధానాలను తట్టుకోలేక అక్కడే మరణించేవారు ఉన్నారు. గొప్ప రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా పేరుగాంచిన తెలంగాణలో కనీసం పనిచేసుకొని బతకడానికి పనిలేనప్పుడు ఏలా బతకాలన్నదే నేటి గల్ఫ్‌ కార్మికుల ప్రశ్న. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలో నుంచి 25 నియోజకవర్గాల నుంచి దాదాపుగా పదమూడు లక్షలమంది వలస వెళ్లారంటే మన రాష్ట్రం ఏ రంగంలో ముందుకు పోతుందో తెలియని ప్రశ్ననే. గల్ఫ్‌ కార్మికులు కోసం సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలను మరిచిపోలేమని అంటున్నారు గల్ఫ్‌ కార్మికులు. సంక్షేమం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఓ మంత్రిని నియమించారు. కార్మికుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారంటూ చెబుతున్నారు. గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ. లక్ష ఎక్ష్‌గ్రేషియా ప్రకటించారు. రాయితీ రుణాలను అందజేశారు. గల్ఫ్‌ దేశాల్లో క్షమాభిక్షను అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తే చట్ట విరుద్ధంగా ఉన్న కార్మికులను స్వరాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చొరవ చూపింది. అప్పుడు రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న చర్యలను ఇప్పటి రాజకీయ పక్షాలు తమ మేనిఫెస్టోలలో చేర్చాలని గల్ఫ్‌ కార్మికులు కొరుతున్నారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా గల్ఫ్‌ కార్మికుల సమస్యలకోసం పాటుపడాలన్నారు. స్వంత రాష్ట్రంలో ఉపాధి లేక దేశం కాని దేశంలో బతుకుతున్నారు. గల్ఫ్‌ రాష్ట్రాలలో ఉంటున్న కార్మికులను ఆకట్టుకునేలా హామీలు ఇస్తూ వారిని మచ్చిక చేసుకునే పనిలో రాజకీయ పార్టీలు, ఆయా నియోజకవర్గ నాయకలు పరుగులు పెడుతున్నారు. నాయకులు హామీలను ఎంత మంది నమ్మి ఓటు వేసేందుకే ప్రయాణమవుతారో తెలియదు..

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here