Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

పోలవరం బోటు ప్రమాదం సెలబ్రిటీ శవాలు కాదు…

ముక్కలు అయినా ఇవ్వలేరా..?

? మృతుల సంఖ్యలో గందరగోళం

? నగరంలో ఆత్మ’గౌరవ’ హత్య

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

మనిషి మరణించిన తరువాత…

పేదవాడిది శవం,

మధ్యతరగతి వాడిది మృతదేహం,

కాస్త డబ్బుంటే భౌతికకాయం,

ఇంకా బాగా డబ్బులు ఉన్న వాడిదైతే పార్థీవదేహం. ఇది సమాజంలో డబ్బును బట్టి ప్రాణం లేకుండా ఉన్న విగతజీవి పేరు డబ్బును బట్టి మారుతోంది. ఇటీవలి పోలవరంలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారిని కడసారి చూపుకు నోచుకోలేని బంధువుల వ్యధ చూస్తే… కన్నీళ్ళకే కన్నీళ్ళు వస్తాయి. ఇంకా దొరకని ఆ ‘శవాల’ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది సుస్పష్టం. అదే ప్రమాదంలో ‘శవాలు’ కాకుండా ఏ ‘పార్థీవదేహం’ అయితే ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా…? శవాలలో కూడా సెలబ్రెటీ శవాలు వేరనే ఉదంతం. సాంకేతిక సభ్యసమాజం తలదించుకునే వ్యవహారంపై ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కన్నీటిని నింపుకొని కర్మకాండ:

ఈ భూవ్మిూద ఎవరికీ రాకూడని కష్టం.

కుమార్తె కడసారి చూపు కోసం ఆ కుటుంబం పడిన వేదన రోదనగానే మిగిలింది. వెయ్యి కళ్లతో ఆఖరిచూపు కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో బాధతో దహించుకుపోతున్న హృదయంతో…ఏ లోకాన ఉన్నా తమ గారాలపట్టికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ ఆ తండ్రి.. కనిపించని బడభాగ్నిని కడుపులో ఉంచుకొని పిండప్రదానం చేశారు. వివరాల్లోకెళితే… మంచిర్యాలకు చెందిన సబ్‌ ఇంజినీర్‌ రమ్యశ్రీ కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. ఆమె ఆచూకీ కోసం తండ్రి, కుటుంబసభ్యులు 12 రోజులుగా ఎదురుచూసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్‌ వద్ద ఆమె కుటుంబసభ్యులు పిండప్రదానం చేశారు.

ఇంటికి ఎలా వెళ్లేది..:

కుమార్తె జాడ తెలియకుండా కనీసం మృతదేహం కూడా దొరకకుండా ఇంటికి ఎలా వెళ్లేదంటూ రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. బోటును బయటకు తీస్తే మృతదేహాలు లభ్యమవుతాయని వేచి ఉన్నా, అమ్మాయి ఆచూకీ లభించకపోవడంతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశామని తండ్రి సుదర్శన్‌ చెమర్చిన కళ్లతో చెప్పారు.

మా వాళ్లను గుర్తించేదెలా..?:

తమవారిని కడసారైనా చూసుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బోటు ప్రమాదంలో గల్లంతైన వారి బంధువులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని వాడపల్లి వద్ద మంగళవారం లభ్యమైన మృతదేహాన్ని గుర్తించేందుకు అవకాశం లేకుండా ఉంది. జన్యు పరీక్ష చేసి నిర్ధారించాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

జన్యు పరీక్ష చేస్తాం:

పోలవరం మండలంలోని వాడపల్లి వద్ద మంగళవారం లభ్యమైన వ్యక్తి మృతదేహానికి సంబంధించి గందరగోళం నెలకొంది. పాత పట్టిసీమకు చెందిన బోటు సిబ్బంది మణికంఠ(21), కాకినాడకు చెందిన బోటు డ్రైవర్‌ సత్యనారాయణ(60) బంధువులు ఆ మృతదేహం ఆనవాళ్లు మావంటే మావని పోలీసులకు చెబుతున్నారు. ఇరు కుటుంబాల రక్త సంబంధీకులకు జన్యు పరీక్ష చేసి నిర్ధారించాలని కోరుతున్నారు. ఇరు కుటుంబాల వారికీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. డీసీహెచ్‌ఎస్‌ రమేశ్‌ కిషోర్‌ మాట్లాడుతూ జన్యు పరీక్షల ఆధారంగా మృతదేహాన్ని సంబంధిత బంధువులకు అప్పగిస్తామన్నారు.

ఆశ చంపుకొని..:

ఆశ చంపుకుని రెండు రోజుల నుంచి తెలంగాణకు చెందిన నాలుగు కుటుంబాల వారు మృతదేహాల జాడ తెలియకుండానే సొంతూళ్లకు వెనుదిరిగారు. కనీసం శరీర భాగాలైనా ఇవ్వండని ఒకరు హృదయ విదారకంగా రోదించడం కనిపించింది. కాకినాడకు చెందిన బోటు డ్రైవర్లు సత్యనారాయణ, నూకరాజు కుటుంబ సభ్యులు, పాత పట్టిసీమకు చెందిన బోటు సిబ్బంది మణికంఠ, హైదరాబాద్‌ కు చెందిన అంకెం పవన్కుమార్‌, అంకెం వసుంధర భవానీ కోసం వారి బంధువులు నిరీక్షించారు.

కడసారి చూపైనా దక్కుతుందా?:

పాపికొండలు విహారయాత్రలో గల్లంతైన వారి ఆచూకీ 12 రోజులు గడిచినా నేటికీ లభ్యం కాకపోవడంతో వారి బంధువులు విలపిస్తున్నారు. కడచూపైనా దక్కుతుందని వారంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ కంటి విూద కునుకు లేకుండా గడుపుతున్నారు. గల్లంతైన వారి బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఏ అంబులెన్సు వచ్చినా కన్నీటితో పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం అందరి చూపు గోదావరిలో మునిగిన పర్యాటక బోటును ఎప్పుడు వెలికితీస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే బోటులో మృతదేహాలు బయటకు రాకపోవడంతో గోదావరి ఒడ్డు గిరిజనులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఏ అలికిడి వచ్చినా..:

కచ్చులూరు కొండ నుంచి గోదావరి నదిలో దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌ వైపునకు ఏ బోటు వెళ్లినా నది ఒడ్డుకు వచ్చి ఎదురుచూస్తున్నారు.

అసలు మృతులు ఎందరు..?:

ఈ విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు ఎలా ఉన్నా… ఎంతమంది చనిపోయారనే విషయంలో ఖచ్చితమైన లెక్క లేదు. బోటు వెలికి తీస్తే మాత్రం లెక్క తేలవచ్చు.

ముగింపు:

ఇప్పటికైనా ఆ బోటు వెలికితీసి… శవాలను బంధువులకు అప్పగిస్తారని ఆశిద్దాం. లేదంటే శవాల కోసం గుండెలు అవిసేలా రోదిస్తూ…ఎదురుచూసే వాళ్ళంతా… విూ ఇళ్ళల్లో పార్థీవదేహాలు ఉండాలని శపిస్తే… ఓం శాంతి.

ఃూచీ:

అనాథ గారి ఆత్మ ‘గౌరవ’ హత్య

?అంత్యక్రియలకు డబ్బులిచ్చి మరీ…

అతని పేరు విజయ్‌. నగరానికి చెందిన అతను అనాథ.. నా అన్నవారు ఎవరూ లేరు.. డిగ్రీ వరకు చదివాడు. క్యాబ్‌ డ్రైవర్గా పనిచేస్తూ జీవితం వెళ్లదీస్తున్నాడు.. ఒంటరి బతుకుపై విరక్తి కలిగింది. ఇలా ఎన్నాళ్లని మథనపడ్డాడు. తన జీవిత పయనాన్ని ముగించాలని నిర్ణయానికి వచ్చాడు. తనలాంటి అనాథల మృతదేహాలు దొరికితే అంత్యక్రియలు నిర్వహించే సంస్థ గురించి తెలుసుకున్నాడు. క్యాబ్‌ డ్రైవర్గా తాను సంపాదించిన రూ. 6 వేలను ఆ సంస్థ (సెర్వ్‌ నీడి)కు అందించాడు. అనాథల శవాలు దొరికితే అంత్యక్రియలకు వినియోగించాలని కోరాడు. మంగళవారం బల్కంపేట నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రి సవిూపంలో గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు లేఖ రాశాడు. తన మృతదేహానికి సెర్వ్‌ నీడి సంస్థ వారు అంత్యక్రియలు చేయాలని కోరాడు. బుధవారం సాయంత్రం అతడి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. పోలీసులు వచ్చి సర్వ్‌ నీడి సంస్థ వారికి సమాచారం అందించగా.. వారు అంత్యక్రియలు నిర్వహించారు. అలా అతను తన అంతిమ సంస్కారాలను సైతం ముందుగా అనుకున్నట్టే జరిపించుకోవడం స్థానికులను కదిలించింది. కంటతడి పెట్టించింది.

చివరిగా..:

కోట్లు అక్రమంగా సంపాదించే నాయకులారా… విూ వారసులు రేపు విూకు అంత్యక్రియలు ఎలా చేస్తారనే బెంగ వద్దు. ‘సర్వ్‌ నీడ్‌’ కొన్ని డబ్బులు పంపించండి.

ఃనీలీ:2

సముద్రతీరంలో మునిగిన బోటు

తూర్పుగోదావరి జిల్లా, తొండంగి మండలంలోని యర్రయ్యపేట పంచాయతీ సముద్ర తీరంలో బుధవారం సాయంత్రం వేటకు వెళ్లిన పదిమంది జాలర్లున్న బోటు మునిగింది. దీంతో అప్రమత్తమైన మత్స్యకారులు తోటి మత్స్యకారులకు సమాచారం ఇవ్వడంతో వారు వేరే బోటుపై వెళ్లి పది మందిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా ఉందని అందువల్లే కెరటాల ఉద్ధృతికి బోటు బోల్తాపడిందని వారు తెలిపారు. అనంతరం మునిగిన బోటును తాడు సాయంతో బయటకు లాగారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close