Featuredరాజకీయ వార్తలు

పైసలైపోయి టీఆర్‌ఎస్‌ పరేషాన్‌

గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌లో అసంతఅప్తి సెగ రాజుకుంది. టిక్కెట్లు ఆశించి భంగపడిన వారంతా ఒక్కొక్కరుగా నిరసన గళం విప్పుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 6 నుంచి 8 సెగ్మెంట్లలో గులాబీ పార్టీకి రెబల్స్‌ బెడద తప్పేలా కనిపించడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చి.. పార్టీకోసం పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీడీపీ నుంచి వచ్చిన తాజా మాజీ ఎమెల్యే మాధవరం క అష్ణారావుకే కూకట్‌పల్లి టిక్కెట్‌ కన్ఫామ్‌ చేసింది టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం. మొదట్నుంచీ పార్టీలో ఉన్న గొట్టిముక్కల పద్మారావు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంతో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. ఈసారి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కూకట్‌పల్లి కార్పొరేటర్‌ పన్నాల కావ్యారెడ్డి భర్త పన్నాల హరీశ్వర్‌ రెడ్డి కూడా రెబల్‌గా బరిలోకి దిగుతానంటున్నారు.సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు జూబ్లీహిల్స్‌ టిక్కెట్‌ ఇవ్వడాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుబడుతున్నారు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వడంపై వెంగళరావునగర్‌, రెహ్మత్‌ నగర్‌ కార్పొరేటర్లతో సహా మిగితావారు సైతం రగిలిపోతున్నారు. అధినేత నిర్ణయంపై అసంత అప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మురళి.. ఈసారి టికెట్‌ ఇవ్వనందున రెబల్‌గా పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది.సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానందకే మళ్లీ కుత్బుల్లాపూర్‌ టికెట్‌ దక్కింది. దీంతో అక్కడి నుంచి పోటీ చేయాలని భావించిన కొలను హన్మంత్‌రెడ్డి రెబల్‌గా బరిలోకి దిగబోతున్నారు. సెటిలర్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండే చోట అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే టిక్కెట్‌ ఫైనల్‌ చేసినట్టు అధిష్టానం చెప్తున్నా.. పార్టీ నేతలు వినిపించుకోవడం లేదు.రాజేంద్రనగర్‌ టిక్కెట్‌ను టీడీపీ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు ఇవ్వడంతో.. అక్కడ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్న శ్రీశైలంరెడ్డి డీలా పడిపోయారు. ప్రస్తుతం శ్రీశైలం రెడ్డి కుమారుడు మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌గా ఉన్నారు. పార్టీ తమను నిర్లక్ష్యం చేస్తోందని భావిస్తున్న వీళ్లిద్దరూ.. వేరే దారి చూసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.శేరిలింగంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి మరోసారి అవకాశమిచ్చారు కేసీఆర్‌. దీంతో ఎప్పట్నుంచో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ అసంతఅప్తితో రగిలిపోతున్నారు. జగదీశ్వర్‌ గౌడ్‌ భార్య పూజితా గౌడ్‌ కూడా హఫీజ్‌పేట కార్పొరేటర్‌గా ఉన్నారు. ఈ ఇద్దరూ రివర్సయితే కొంత డ్యామేజ్‌ జరుగుతుంది కాబట్టి బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌లో పరిస్థితి కూడా ఇప్పుడు గందరగోళంగానే ఉంది. ఉప్పల్‌ టికెట్‌ భేతి సుభాష్‌రెడ్డికి దక్కడంతో మేయర్‌ బంతు రామ్మోహన్‌ అలిగారు. ఎప్పటి నుంచో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు రామ్మోహన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రౌండ్‌ కూడా ప్రిపేర్‌ చేసుకున్నారు. ఈ టైమ్‌లో సుభాష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో.. రామ్మోహన్‌ అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలువురు అభిమానులు చక్రిపురం మహంకాళి ఆలయంలో 116 కొబ్బరికాయలు కొట్టి.. బంతు రామ్మోహన్‌కు టిక్కెట్‌ వచ్చేలా చూడాలంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం ఏడుగురు కార్పొరేటర్లు బంతు రామ్మోహన్‌కు మద్దతు తెలిపారు. సుభాష్‌రెడ్డిని తప్పించి మేయర్‌కే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.ఎల్‌.బి.నగర్‌ నియోజక వర్గ టికెట్‌ రామ్మోహన్‌ గౌడ్‌కు ఇవ్వడం పై స్థానిక నేతలు, తెలంగాణ ఉద్యమ కారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజక వర్గ సీనియర్‌ నాయకుడు వజీర్‌ ప్రకాశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాచం సత్యనారాయణ, కుంట్లూర్‌ వెంకటేశం..కార్యకర్తలతో సమావేశమై.. త్వరలోనే భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. మరోవైపు టిడిపి, కాంగ్రెస్‌ పొత్తు నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న రామ్మోహన్‌ గౌడ్‌కు టికెట్‌ ఇవ్వడం వలన ఎల్‌.బి. నగర్‌లో గెలవడం కష్టం అని వారు అన్నారు.తీగల కఅష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని మహేశ్వరం టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. టిక్కెట్‌ ఆశించి భంగపడిన కొత్త మనోహర్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 2014లో ఓడిపోయినప్పటికీ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాననీ,అయినా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా రంగంలోకి దిగి కఅష్ణారెడ్డిని ఓడిస్తానంటున్నారు. కంటోన్మెంట్‌ నియోజక వర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిన గజ్జెల నాగేష్‌ కూడా ఈ సారి టికెట్‌ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.సిట్టింగ్‌ అభ్యర్థి సాయన్నకు వ్యతిరేకంగా గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు మద్దతు తెలిపే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఎన్నికల బరిలో దిగటం అంటే కోట్లతో వ్యవహారం. పైకి ఎన్ని చెప్పినా ఒక్కో అభ్యర్ధి లక్షల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అయినా గెలుపు గ్యారంటీ ఉండదు. అది ఏ పార్టీకి మినహాయింపు కాదు. అధికార పార్టీ..ప్రతిపక్షం ఎవరైనా సరే ‘కోట్లు’ కుమ్మరించాల్సిందే. కాంగ్రెస్‌ పార్టీ ఇంత వరకూ అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించలేదు.ఎప్పుడు ప్రకటిస్తారో కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసీఆర్‌ ఆ పార్టీ అభ్యర్దులను ప్రకటించి ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. అసెంబ్లీని రద్దు చేసిన సెప్టెంబర్‌ 6నే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి కలకలం రేపారు. ఈ నిర్ణయాన్ని అప్పటికి అందరూ ఆహా..ఓహో అంటూ కీర్తించినా ఇప్పుడు మాత్రం ‘అభ్యర్ధుల’కు చుక్కలు కనపడుతున్నాయి. అధికారికంగా అభ్యర్ధి పేరు ప్రకటించినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ ‘క్యాష్‌ మీటర్‌’ రన్‌ జెట్‌ స్పీడ్‌ తో పరుగులు పెడుతోంది. పేరు ప్రకటించినప్పటి నుంచి అందరినీ ‘సంత అప్తి’ పర్చాల్సిందే.ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందిగా అంటే..కుదరదు. పెరుగుతున్న ఖర్చుల వ్యవహారం టీఆర్‌ఎస్‌ అభ్యర్దులను ఇరకాటంలోకి నెడుతోంది. చాలా చోట్ల అభ్యర్ధులకు అధిష్టానం కొంత నగదు సర్దుబాటు చేసిందని చెబుతున్నారు. అయినా రోజురోజుకూ ఖర్చులు పెరుగుతుండటంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను కలవరానికి గురిచేస్తోంది. ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్ధుల ఇంకా ఖర్చు ‘ఖాతా’ కూడా తెరవని పరిస్థితి ఉంటే..ఇప్పటికే తమ ఖాతాలో ‘ఖర్చు’ మోతమోగిపోతుందని..ఎన్నికల సమయానికి డబ్బు లేకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని టీఆర్‌ఎస్‌ అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా టిక్కెట్లను ప్రకటించటం వల్ల ప్రచారంలో ముందంజలో ఉన్నా ఖర్చు మాత్రం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అవుతుందని చాలా మంది అభ్యర్దులు మాత్రం లబోదిబోమంటున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close