పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి అమలు

0

తెలంగాణ ప్రభుత్వం ప్రతీ నెల ఇచ్చే సంక్షేమ పింఛన్లను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆసరా పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1000 పింఛన్ ఇస్తుండగా.. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి అమలు కానున్నాయి.

పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి లబ్దిదారులకు అధికారులు అందజేస్తారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016, మిగతా వారికి రూ. 2,016 పింఛనుగా అందనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛనును రెట్టింపు చేస్తానంటూ ముఖ్యమంత్రి కేసిఆర్ హీమీ ఇవ్వగా… ఆ హామీని అమలు చేస్తున్నారు.

వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ-ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు ఇకపైపెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ.
2,016 అందనున్నాయి. అదేవిధంగా దివ్యాంగులకు రూ. 3,016 ఇవ్వనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here