Interviewsఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

పురపాలక సవరణ బిల్లుకు ఆమోదం

చర్చలేకుండానే ఆమోదం తెలిపిన అసెంబ్లీ

  • పురపాలనలో పౌరుడే కేంద్ర బిందువు కావాలి
  • అందుకే నూతన మున్సిపల్‌ నూతన చట్టం
  • ఐటీ రంగంలో బెంగళూరును దాటిపోయాం
  • అసెంబ్లీలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌

తెలంగాణ పురపాలక సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పురపాలక మంత్రి కేటీఆర్‌ బిల్లును ప్రవేశపెట్టగా.. జులై 2019లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఐదు సవరణలతో సభ్యులందరూ ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డి బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పురపాలనలో పౌరుడే కేంద్ర బిందువు కావాలని అన్నారు. జవాబుదారీ తనంలో తక్కువ కాలవ్యవధిలో మెరుగైన సేవలు పొందేలా సవరణలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో, పట్టణాల్లో పాలన కోసం ఆరువేరువేరు చట్టాలు అమల్లో ఉన్నాయని, ఇవన్నీ చాలా పురాతనమైనవని మంత్రి పేర్కొన్నారు. పట్టణ పరిపాలనలో ఎన్ని సంస్కరణలు అమలు చేసినా ఎంత ఖచ్చితంగా వ్యవహరించానా ఆయా చట్టాల్లో ఉన్న లొసుగులు లోపాల వల్ల వాటి అమలు తీరు సరిగా జరగక ఫలితాలు సక్రమంగా రావటం లేదని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 1965లో అదే మాదిరిగా పారదర్శకమైన అనుమతుల విధానాన్ని తీసుకొని రావాలని, పురపాలన అంటే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అన్నారు. పురపాలనలో పౌరుడే కేంద్ర బింధువుగా కావాలని, పౌరుడే పాలకుడు కావాలనే ఒక మంచి ఆలోచనతో సిటిజన్‌ ఫ్రెండ్లీ అర్బన్‌ పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. తద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం, వేగవంతంగా పట్టణ పౌరసేవలందించటం పూర్తిపారదర్శకంగా పరిపాలన ఉండేలా చూసుకోవటం, నగర, పట్టణ పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయడం, పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించుకొని వ్యూమన్‌ ఇంట్రర్‌ఫియరెన్స్‌ తగ్గించి మరింత మెరుగైన సేవలు అందించాలనేలక్ష్యంతో ఈ నూతన చట్టం అమల్లోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రతీపనిని నిర్ణీత సమయంలో పూర్తిచేయడం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ జులై 2019న ఈ బిల్లును ప్రవేశపెట్టారని కేసీఆర్‌ తెలిపారు. ఇందులో కేవలం ఐదు నూతన విధానాలను అమల్లోకి తీసుకురావటం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా సివిల్‌ న్యాయస్థానాల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. సివిల్‌ న్యాయ స్థానాల సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టగా, శాసనసభ బిల్లును ఆమోదం తెలిపింది. సభ్యులందరూ ఏకగ్రీవం తెలపడంతో స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డి బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా అమల్లోకి వచ్చిన బిల్లు ద్వారా న్యాయవాదాలు, ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

ఐటీ రంగంలో బెంగళూరును దాటిపోయాం : మంత్రి కేటీఆర్‌

కేంద్రంలో పాలన సాగించిన బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ఐటీఐఆర్‌కు ఒక్కనయాపైసా ఇవ్వలేదని, ఇస్తే రుజువు చేయమనండి అంటూ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు.. ఐటీఐఆర్‌ విధానాన్ని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వమే పక్కన పెట్టిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం 2013లో… బెంగుళూరు, హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు అనుమతి ఇచ్చిందన్నారు. ఐటీఐఆర్‌కు యూపీఏ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఆఫీసు స్పేస్‌ ఆక్యుపేషన్‌లో బెంగుళూరును హైదరాబాద్‌ దాటిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దలు ఉద్దరిస్తారని తాము చూడలేదని.. తమ పని మేము చేసుకుని పోతున్నామని పేర్కొన్నారు. ఐటీఐఆర్‌ను వాళ్లు ఉద్దరించారని.. తాము నాశనం చేసినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఐటీఐఆర్‌ విషయంలో యూపీఏ ఒక కాగితం పారేసి పోయిందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుండి 12 లక్షల 67 వేల టీఎస్‌ఐ పాస్‌ ద్వారా సృష్టించామన్నారు. తెరాస హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్‌ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఆఫీస్‌ స్పేస్‌ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్‌ బెంగళూరును దాటిపోయిందన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకపోతోందని, కాబట్టే 17శాతం వృద్ధి రేటు సాధ్యమైందన్నారు. ఐటీ రంగంలో గతంలో మూడు లక్షల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 5లక్షల ఉద్యోగాలు వచ్చాయని సభకు తెలిపారు. కాంగ్రెస్‌ అంచనాలను తలదన్నే విధంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు విషయంలో తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతకు కేసీఆర్‌ సర్కార్‌పై సంపూర్ణమైన విశ్వాసం ఉందన్న, ఐదేళ్లలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కాంగ్రెస్‌ సభ్యుడు భట్టికి సూచించారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కొనసాగించమని మోదీ సర్కార్‌ తేల్చిచెప్పిందని, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేం చేసుకుంటూ పోతున్నామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close