పిల్లలమర్రి లో చారిత్రక కళా ఖండాల ప్రదర్శన

0

మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన శాల ను రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రి V శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, పురావస్తు శాఖ సంచాలకులు దినకర్ బాబు, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ లతో పాటు రాష్ట్ర పురవస్తూ శాఖ అధికారులు నారాయణ, రాములు నాయక్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ రాధ అమర్, జిల్లా గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ పురావస్తు శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రదర్శన శాలలో అద్భుతమైన అతి పురాతనమైన చారిత్రక కళా ఖండాలను సందర్శకులకు తిలకించేందుకు అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ ప్రదర్శన శాల వల్ల మన ప్రాచీన సంస్కృతి, సంపద భవిష్యత్ తరాలకు అందించటము జరుగుతుందన్నారు. తెలంగాణ లోనే అత్యంత పురాతనమైన చారిత్రక ప్రాంతం మన మహబూబ్ నగర్. ఇది ఎంతో మనకు గర్వకారణమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రాచీన చరిత్ర, సంస్కృతి కి ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. మన సంస్కృతి, చరిత్ర ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తల్లిదండ్రులు తమ పిల్లలకు గత చారిత్రక ప్రాధాన్యం ను తెలియపరచవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రదర్శన శాలలో 10 వేల ఏళ్లనాటి గుడి గోపురాలు, విగ్రహాలు కలిగిన దేవాలయం ప్రత్యేకత సంతరించుకుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పిల్లలకు చారిత్రక విషయాలను తెలియపరిచి తమ భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రాచీన కాలంలో మానవ జీవన విధానం నది పరివాహక ప్రాంతంలో నే ఉన్నదని తెలియ పరిచారు. మన జిల్లాలో ఉన్న కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే మానవ పురోగతి జరిగి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా ఎంతో వైభవంగా ఉండిందని, కాలక్రమంలో మన చరిత్ర మరుగున పడిందని, ఇపుడు ఆ చరిత్రను వెలికి తీయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here