ఆరోగ్యం

నేడు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం

 


  జూన్  5వ తేదీ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకొని హైదరాబాద్ న‌గ‌రాన్ని వాయు కాలుష్యాన్ని నిరోధించ‌డం, కాలుష్య ర‌హిత న‌గ‌రంగా రూపొందించేందుకు జీహెచ్ఎంసీ ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. ప‌ర్యావ‌ర‌ణ‌నానికి పెనుముప్పుగా ప‌రిణ‌మించిన ప్లాస్టిక్ వాడ‌కాన్ని, విక్ర‌యాల‌ను   గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ద‌శ‌లవారిగా వాడ‌కాన్ని నిషేధించాల‌నే భారీ ల‌క్ష్యాన్ని కూడా నిర్థారించుకుంది. ముఖ్యంగా ఒకేసారి మాత్ర‌మే ఉప‌యోగించే అన్ని ర‌కాల ప్లాస్టిక్ వ‌స్తువుల వాడ‌కాన్ని పూర్తిగా నివారించేందుకు జూన్ 5వ తేదీన ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని  పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. ప్ర‌తి స‌ర్కిల్‌లో రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ సంఘాల‌తో ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించి ప్లాస్టిక్ వినియోగంపై వారితో ప్ర‌త్యేక ప్ర‌తిజ్ఞ‌లు నిర్వ‌హించ‌డం, పూర్తిస్థాయి అవ‌గాహ‌న‌, చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని క‌మిష‌న‌ర్ నిర్ణ‌యించారు. ప్ర‌తి స‌ర్కిల్‌లో క‌నీసం రెండు ట‌న్నుల ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను సేక‌రించాల‌ని ల‌క్ష్యాన్ని నిర్థారించారు.  వీటితో పాటు గ్రేట‌ర్‌లో ఉన్న దాదాపు 5ల‌క్ష‌ల స్వ‌యం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌లను ప్లాస్టిక్ నిషేదంలో భాగ‌స్వామ్యం చేయ‌డం, చిరు వ్యాపారులు మ‌ట‌న్‌, చికెన్ షాపులు ఇత‌ర వ్యాపారులు ప్లాస్టిక్ క‌వ‌ర్లు పూర్తిగా నిషేదించాల‌ని అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇంటింటికి రెండు డ‌స్ట్‌బిన్‌ల పంపిణీ, చెత్త సేక‌ర‌ణ‌కు 2,500 ఆటోట్రాలీల‌ను ప్ర‌వేశ‌పెట్టడం, స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మాల‌ను ఉదృతంగా నిర్వ‌హించ‌డం త‌దిత‌ర ఎన్నో ప‌ర్యావ‌ర‌ణ హిత కార్య‌క్ర‌మాల‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. ప్ర‌స్తుత హ‌రిత‌హారంలో క‌నీసం రెండు కోట్ల మొక్క‌ల‌ను హైద‌రాబాద్ న‌గ‌రంలో నాటాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. ఈగ‌లు, దోమ‌ల‌కు కార‌ణ‌మై శున‌కాల‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న 1,116 బ‌హిరంగ చెత్తవేసే ప్రాంతాల‌ను పూర్తిగా ఎత్తివేయ‌డం, బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హితంగా న‌గ‌రాన్ని ప్ర‌క‌టించ‌డం, పెట్రోల్ బంక్‌లు, హోట‌ళ్ల‌లోని టాయిలెట్ల‌ను న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డం, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్‌యార్డ్‌కు క్యాపింగ్ ప‌నులు చేప‌ట్ట‌డం త‌దిత‌ర స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను జీహెచ్ఎంసీ విజ‌య‌వంతంగా చేప‌డుతోంది. 
వాయు కాలుష్య నివార‌ణ అనే అంశం పై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం
వాయు కాలుష్య నివార‌ణ అనే నినాదాన్ని యూనైటెడ్ నేష‌న్ ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించినందున న‌గ‌రంలో వాయు కాలుష్య నియంత్ర‌ణ‌, వాహ‌నాల ఉప‌యోగాన్ని త‌గ్గించ‌డం, చెత్త‌ను త‌గ‌ల‌బెట్ట‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లాంటి ప‌లు కార్య‌క్ర‌మాల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో చేప‌డుతున్న‌ట్టు క‌మిష‌న‌ర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఎండిన ఆకుల‌ను త‌గ‌ల‌బెట్ట‌కుండా వాటిని కంపోస్ట్ ఎరువులుగా త‌యారు చేయ‌డానికిగాను ప్ర‌తి పార్కులో కంపోస్ట్ పిట్‌ల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌తి మున్సిప‌ల్ వార్డులో రెండు ఇంకుడు గుంత‌ల నిర్మాణాల‌ను చేప‌ట్టారు. ఈ ఇంకుడు గుంత‌ల నిర్మాణాన్ని నేడు వ‌న‌స్థ‌లిపురం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఎల్బీన‌గ‌ర్ శాస‌న స‌భ్యులు సుధీర్‌రెడ్డితో క‌లిసి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ప్రారంభించారు. 
చెత్త కాలిస్తే భారీ జ‌రిమానాలు
న‌గ‌రంలో వాయు కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్న చెత్త‌ను కాల్చేవారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ఇందుకుగాను చెత్త‌ను కాల్చేవారికి ఐదు వేల రూపాయ‌లు, భారీ ప‌రిమాణంలో చెత్త‌ను కాలిస్తే 25వేల రూపాయలు జ‌రిమానా వేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది చెత్త‌ను కాలిస్తే వంద రూపాయ‌ల నుండి 500 రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించారు.

Attachments area

Attachments area

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close