నాగార్జున స్కూల్ తప్పిదాలకు విద్యార్ధిని మృతి

0


స్కూల్ యాజమాన్యం రక్షణ చర్యలు పాటించకపోవడమే విద్యార్థి మరణానికి కారణమని, మృతురాలి తల్లిదండ్రుల అభిప్రాయం.

 

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన మరుసటి రోజునే ఓ విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు క్రింద పడి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని తట్టి అన్నారం సమీపంలోని హనుమాన్‌ నగర్‌లో నివాసముంటున్న నరసింగరావు కుమార్తె వివిక(14) నాగోలులోని సాయినగర్‌ కాలనీలో ఉన్న నాగార్జున స్కూల్ లో  పదోతరగతి చదువుతోంది.ఆమె గురువారం ఉదయం 7.30 గంటలకు స్కూల్‌ బస్సులో ఇంటి నుంచి బయలుదేరి పాఠశాలకు చేరుకొంది. అనంతరం ఉదయం 8గంటల సమయంలో స్కూల్ భవనం మూడో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు క్రింద పడి పోవడంతో అది గమనించిన పాఠశాల సిబ్బంది, స్థానికులు ఆ బాలికను కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది.
విద్యార్థి ప్రమాద వార్త విని  తల్లిదండ్రులు బంధువులు స్థానికులు , విద్యార్థి సంఘాలు మానవ హక్కుల సంఘాలు భారీ సంఖ్యలో నాగార్జున పాఠశాల భవనం వద్ద గుమిగూ డి ఆందోళనకు దిగారు. విద్యార్థి తండ్రి నర్సింగరావు రోదిస్తూ ఇతర విద్యార్థి తల్లిదండ్రులకు ఈ దుస్థితి పట్టకూడదు అని బిల్డింగ్ కిటికీలకు అడ్డుగా రక్షణగా గ్రిల్స్ లేకపోవడమే క్రింద పడడానికి కారణమని అన్నారు. సిపిఐ సెక్రెటరీ చందు,కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు, ఓయు జెఏసి నాయకులు పరశురాజ్ , ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్, బచ్చు రామకృష్ణ  పలువురు మాట్లాడుతూ.. 10వ తరగతి  చదువుతున్న14 సంవత్సరాల విద్యార్థిని భవనం పై నుండి క్రిందపడి మృతి చెందడం పలు అనుమానాలకు తావు తీస్తుందని .. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణికి పసికందుల బలిఅయిందని , స్కూల్ యజమాన్యం ధనాపేక్ష నే ధ్యేయంగా కక్కుర్తిపడి భవన నిర్మాణంలో రక్షణ చర్యలు తీసుకోకుండా తగు సౌకర్యాలు తీసుకోకుండా పాఠశాలను నడపడమే ఇందుకు కారణమని ఇలాంటి స్కూల్స్ హైదరాబాద్ లో తెలంగాణరాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని వీటిని పర్యవేక్షించే ప్రభుత్వ అధికారులు ముడుపుల మత్తులో నిద్రపోయి మరిచిపోతున్నారని జిహెచ్ఎంసి  అధికారుల పర్యవేక్షణ కరువు స్కూలు భవన నిర్మాణం అస్తవ్యస్తం అగ్నిమాపక చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ విద్య ఉద్యోగులు ఎం ఈ ఓ , డిఇఓ, పర్యవేక్షణ కరువు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయమై విద్యా శాఖ మంత్రి వెంటనే స్పందించి నాగార్జున స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోని స్కూల్ అనుమతులను రద్దు చేయాలని మృతురాలి కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని నిద్రపోతున్న ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోని సస్పెండ్  చేయాలని డిమాండ్ చేసినారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మిగితా పాఠశాలలపై పర్యవేక్షణ జరిపి రక్షణ చర్యలు తీసుకునే విధంగా  చూడాలని డిమాండ్ చేసినారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here