Featuredజాతీయ వార్తలు

దేశంలో ఉగ్రవాదులు..

ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలతో అప్రమత్తం

భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు

పలు రాష్టాల్రకు ముందస్తు హెచ్చరికలు

జనసమ్మర్ధం ఉన్న చోట పోలీసుల గస్తీ

విమానాశ్రయాల్లో హై అలర్ట్‌

న్యూఢిల్లీ : దేశంలోకి ఉగ్రవాదులు దూరారన్న హెచ్చరికలతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టంచేశారు. అమెరికా హెచ్చరికలకు తోడు ఐబి హెచ్చరికలతో ఉత్తరాదిలో ఉన్న అన్ని విమానాశ్రయాల్లో భారీ భద్రతను పెంచారు. ఢిల్లీలో నలుగురు జైషే ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు రావడంతో భద్రతను పటిష్టం చేశారు. పలు రాష్టాల్ల్రో ఇప్పటికే హై అలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీకి చెందిన స్పెషల్‌ సెల్‌ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో ఢిల్లీలోకి ప్రవేశించినట్లు సమాచారం ఉన్నది. హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీతో పాటు సవిూప పట్టణాల్లో భారీ స్థాయిలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ హెచ్చరికల గురించి గురువారం ఉదయం ప్రధాని మోదీ నివాసంలో చర్చ జరిగింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలకు హెచ్చరికలు అందాయి. మోదీ, షా, దోవల్‌కు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది కూడా. శ్రీనగర్‌, అవంతిపురా, జమ్మూ, పఠాన్‌కోట్‌, హిండన్‌ లాంటి వైమానిక స్థావరాల వద్ద ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో ఢిల్లీలోకి ప్రవేశించారని, ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు

హెచ్చరించారు. జన సమ్మర్థం ఉన్న చోట దాడులకు ఈ నలుగురు ఉగ్రవాదులు కుట్ర చేశారని నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులు దేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద ప్రభావిత నగరాలతో పాటు పెద్ద నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close