Featuredస్టేట్ న్యూస్

దసరా సెలవులు 22 రోజులా…?

  • ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు
  • కేసీఆర్‌పై లక్ష్మణ్‌ ఫైర్‌…

తెలంగాణాలో ప్రజా స్వామ్యాన్ని పాతర వేసి నియంత పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. ఒక పక్క విద్యార్దుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యాయమైన డిమాండ్‌ల కోసం కార్మికులు చేస్తున్న సమ్మెను కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. విద్యార్ధులు సమ్మెలో భాగస్వాములవుతారనే భయంతోనే దసరా సెలవులు పొడిగించారని అన్నారు. ఆనాడు కిరణ్‌కుమార్‌రెడ్డి అవలంభించిన విధానాలనే కేసీఆర్‌ అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు పండగ ముందు జీతం ఇవ్వలేదు. కష్టం చేసిన దానికి జీతం ఇవ్వకపోతే ఎలా?అంటూ ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ బలోపేతానికి ఒక్క చర్య అయినా చేపట్టారా? ఆరేళ్లలో ఒక్క ఆర్టీసీ ఉద్యోగాన్నిఅయినా భర్తీచేశారా? అంటూ లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు…’పోరాటాల ద్వారా సాదించుకుందాం. సకల జనుల సమ్మెకు ఆర్టీసీ సమాయత్తం చేయాలి. అందుకు రాజకీయ పార్టీలు కూడా ఏకం కావాలి. శాంతియుతంగా ఆర్టీసి కార్మికులు సమ్మెను కొనసాగించాలి. పోలీసు బలగాలను అడ్డు పెట్టుకొని సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కనీసం సెప్టెంబర్‌ మాసం జీతాలు కూడా కార్మికులకు ఇవ్వకుండా వారి కడుపు కొడుతున్నారు. దసరా పండగ రోజున 50 వేల మంది కార్మిక సోదరులు పస్తులు ఉన్న పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు అంటే తెలంగాణ బిడ్డలు కాదా?. చర్చలు జరిపేదే లేదు…మాట్లాడేదే లేదు అని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

దసరా సెలవులు 22 రోజులా…

కేసీఆర్‌ పోలీస్‌ బలగాల ద్వారా సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌. నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన బస్‌భవన్‌ వద్ద తాము శాంతియుతంగా జరిపిన నిరసనను పోలీసులు అడ్డుకోవటం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కార్మిక, ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలను సృష్టించారని.. నేడు కేసీఆర్‌ సైతం అదే పద్ధతిని ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. టీఎన్జీవో నేతలను ఇంటికి పిలిచి వారితో ముఖ్యమంత్రి చర్చలు జరిపారని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. 50 వేల కుటుంబాలకు సెప్టెంబర్‌ నెల జీతం ఇవ్వకుండా దసరా పండుగను జరుపుకోకుండా చేశారని.. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మాత్రం ఆగలేదని లక్ష్మణ్‌ విమర్శించారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి సైతం కేసీఆర్‌లా వ్యవహరించలేదన్నారు. కార్మికుల సమ్మెకు మద్ధతు తెలిపేందుకు ఉద్యోగ, కార్మిక, ఉద్యోగ సంఘాలు రెడీ అవుతున్న సమయంలో కావాలని ఉద్యోగ సంఘాలను ఇంటికి పిలిచారని లక్ష్మన్‌ ఆరోపించారు. నాడు కిరణ్‌కుమార్‌ రెడ్డి మొండిపట్టుదల కారణంగా ఎంతోమంది తెలంగాణ బిడ్డలు చనిపోయారని ఇప్పుడు కేసీఆర్‌ నిర్ణయాల వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

సమ్మెను గుర్తించేది లేదని, చర్చలు జరిపేది లేదని.. బస్సులు ఆపితే కేసులు పెడతామంటూ కే.చంద్రశేఖర్‌ రావు వార్నింగులు ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆందోళన చేస్తున్న మహిళా కండక్టర్ల చీరలను పోలీసులు లాగడమేనా ఆత్మగౌరవం అంటూ లక్ష్మణ్‌ ప్రశ్నించారు. కమీషన్లతో పాటు ఆర్టీసీని అనుచరులకు అప్పగించేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారని ఆయన విమర్శించారు. ఆరేళ్లలో ఒక్క డ్రైవర్‌, కండక్టర్‌, మెకానిక్‌ పోస్ట్‌ సైతం కేసీఆర్‌ ప్రభుత్వం భర్తీ చేయలేదని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. ఏడు వేల మంది ఉద్యోగులు రిటైరయ్యారని.. ఈ పోస్టుల భర్తీపై కేసీఆర్‌ చర్య తీసుకోలేదని, చివరికి ఆర్టీసీ కార్మికుల పీఎఫ్‌ సైతం వాడుకున్నారని ఆయన మరోపించారు. ఎవరైనా దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. విద్యార్థులు చదువుకోవాలా? వద్దా?. కేసీఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ ప్రయివేటీకరణ చేయడానికి అభ్యంతరం లేదు. అయితే సంస్థ లాభాలకు మాత్రమే ప్రయివేటీకరణ చేయాలి. ఇక వరంగల్‌లో ఆర్టీసీకి చెందిన మూడున్నర ఎకరాలు ఎవరికి ఇచ్చారు' అని సూటిగా ప్రశ్నలు సంధించారు. ప్రైవేట్‌ బస్సులను, డ్రైవర్లను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులను సచివాలయానికి రాకుండా ఆంక్షలు విధించడంతో పాటు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారని లక్ష్మణ్‌ మండిపడ్డారు.
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close