Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

దళితుడిని భోజనం పెట్టక అవమానించారు

మనిషి తినే భోజనం ఇదేనా…దళితుల పట్ల అధికారుల వివక్షజాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చర్మం రాములు ఆవేదనవికారాబాద్   ఆదాబ్ హైదరాబాద్.తను దళితుడు అయినందున అధికారులు వివక్షతో నాణ్యమైన భోజనం అందించడం డా నాసిరకం భోజనం పెట్టి అవమానించారని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రాములు అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా సిద్దులుర్ హరిజన వాడను సందర్శించిన అనంతరం భోజనం కోసం వికారాబాద్ బంగ్లాలో బసచేశారు మధ్యాహ్నం భోజనం సందర్భంగా అధికారులు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ డైరెక్టర్లకు చైర్మన్ కు నాసిరకం భోజనాన్ని ఏర్పాటు చేశారు ఈ విషయమై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అధికారులపై మండిపడింది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ లో అందరూ దళితుల కారణంగానే అధికారులు వివక్షతో నాసిరకం భోజనం పెట్టారని మండిపడ్డారు ఇది మనుషులు తినే భోజనం దీంతో ఎలా భోజనం చేస్తారని వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా అధికారుల పై ఆయన మండిపడ్డారు దళితులను ఒకే ఒక్క కారణం చేత కమిషన్ను పట్టించుకోలేదని అన్నారు అన్ని తెలిసిన తమ పరిస్థితి ఇలా ఉంటే దేశంలో ఉన్న దళితుల పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉందో ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిజన గిరిజనులకు కోసం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే దళితులను వివక్షతో వారికి సంక్షేమ పథకాలు అందించడంలో లో అధికారులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు హాస్టళ్లు హరిజనవాడలో కనీస సదుపాయాలు కొరవడి దుర్భరమైన స్థితిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని అన్నారు ప్రభుత్వం నిధులు కేటాయించినా అభివృద్ధి చేయడంలో అధికారులు వివక్ష చూపుతున్నారని అన్నారు దళితుల పట్ల చులకన భావన తో ఉంటే అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయవలసిన పరిస్థితి ఇ ఉంటుందని హెచ్చరించారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దళితుల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారి అభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరారు దళితులు లు ఉన్నత స్థానంలో ఉన్న కుల వివక్షతో చిన్న చూపు చూడడం తగదని హెచ్చరించారు

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close