Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దంచి కొడుతున్న వానలు

  • ఆకాశానికి చిల్లు పడిందానట్లు..
  • ప్రాజెక్టులను నీటి ప్రవాహం
  • అప్రమతంగా ఉండాలన్న అధికారులు
  • ముంబయిలో రెడ్‌ అలర్ట్‌

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా..తెలుగు రాష్ట్రాలపై వరుణుడు విరుచుకపడుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిస్తుంది. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో పశ్చిమమధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో వానలు విపరీతంగా కురుస్తున్నాయి. అయితే ఈ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మూడు రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాయలసీమతో పాటు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తెలంగాణలోని వికారాబాద్‌, మహబూబాబాద్‌, జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. నల్లగొండలో వర్షం ఏకదాటిగా కురిసింది. నల్గోండ, ఖమ్మం, ఆదిలాబాద్‌ మూడు జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది. సాధారణ జన జీవనానికి విఘాతం కలిగింది. పంటలకు నష్టం వాటిల్లుతోంది. అనేక గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి. నల్గొండ జిల్లాలోని 31 మండల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. యాదాద్రి జిల్లాలో 12మండలాలు, సూర్యాపేటలో 20మండలాల్లో కుంభవృష్టి కురిసింది. తెలంగాణలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్‌ 19వ తేదీ గురువారం అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 5.8 కిలోవిూటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో వచ్చే 12 గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమతో పాటు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆయ ప్రాంతల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు బాగానే కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో నిన్న రాత్రి నాన్‌ స్టాప్‌గా మూడుగంటలపాటు వర్షం దంచికొట్టింది.

ప్రాజెక్టులకు జల ప్రవాహం

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం నీటి ప్రవాహం 23.9 అడుగులకు చేరుకుంది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున రెండు నుంచి మూడు అడుగుల మేర నీటిమట్టం పెరిగే అవకాశమున్నట్టు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ , మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 79వేల 343 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలు భారీగా పెరిగాయి. నాగార్జునసాగర్‌ నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్రకు వరద స్వల్పంగా పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకూ వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ఇన్‌ఫ్లో లక్షా 24వేల క్యూసెక్కులుండగా… అవుట్‌ఫ్లో లక్షా 18వేల 34 క్యూసెక్కులు. తొమ్మిదిగేట్ల ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు. తుంగభద్రకు వరద స్థిరంగా కొనసాగుతోంది. కర్నాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు స్థిరంగా వరద వస్తోంది. ప్రస్తుతం తుంగభద్రకు 21వేల 279 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా… 21వేల 63 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 1,633 అడుగుల నీటి మట్టానికి గాను 1,633 అడుగుల నీటిని నిల్వ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద భారీగా పెరిగింది. ప్రస్తుతం లక్షా 26వేల 657 క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల నుంచి 70వేల 113 క్యూసెక్కులు, పవర్‌హౌజ్‌ నుంచి మరో 43వేల 107 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 13వేల 437 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 78వేల 540 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌కు వరద వస్తోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 70వేల 456 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయికి నీరు చేరడంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.

ముంబయిలో రెడ్‌ అలర్ట్‌

దేశ వ్యాప్తంగా నగరంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కాగా.. ముంబయిలో ఈ ప్రభావం మరికాస్త ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ముంబయిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముంబయి నగరంలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముందుగానే రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చిరకల నేపథ్యంలో.. ముంబై నగరంలో గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ముంబై నగరంతోపాటు రాయగడ్‌, రత్నగిరి, సతారా, సాంగ్లీ జిల్లాలో గురువారం అతి భారీవర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంబై నగరవాసులకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించడంతో విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆశిష్‌ షెలార్‌ చెప్పారు. భారీవర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు జలమయం అయిన నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close