FeaturedUncategorized

తెలుగుదేశం ఖాతాలో రూ. 170 కోట్లు..!

బాబుపై ఐటి ఆయుధం

‘ఎల్‌ అండ్‌ టీ’ నో ఎస్కేప్‌

‘షాపూర్‌ జీ పల్లంజీ’ బుక్డ్‌

రూ. 3,300 కోట్ల లోగుట్టు కథనం -2

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అందరూ ఓ తానులో దౌర్భాగ్య ముక్కలే. నీచ, నికృష్టులు ఓ ‘సమూహం’గా చేరి… రాజకీయ ముసుగులో. నిసిగ్గుగా.. నిర్జీవంగా.. నిస్సత్తువగా… నిర్లజ్జగా.. ఓదార్పుతో రాజ్యం ఏలుతున్నారు. ఈ దౌర్భాగ్యులకు తర, తమ బేధాలు ఉండవ్‌. వావి,వరసలు ఉండవ్‌. ఉండేదల్లా… చస్తే తమ వెంట రాని ‘నోట్ల’ కోసం గుడి మెట్లపై కూర్చుని.. శవం దగ్గర ఇడిచిన చినిగిన బట్టలను వేసుకొని… ‘నకిలీ యాచకుల్లా’ అన్నీ ఉన్న అనాథలా… ‘కుష్టు రోగం’తో కాదు ‘మందు లేని రోగం’తో చావలేక, బతకలేక బతుకీడ్చే నాయళ్ళ ‘నగ్న శత’ రూపాలకు నిలువెత్తు నిదర్శనం ఈ కక్కుర్తి దోపిడీలు. ఎందుకురా..! మీ బతుకులు..? ఎవరికోసం ఈ సంపాదన..? ఏం కట్టుకు పోతార్రా..? శవాల మీద ‘పేలాల’ను ప్రేతాత్మల్లా పీక్కుతినే ‘బ్రోకర్లు’ సైతం సిగ్గుపడే ‘బ్రోతల్‌’ బద్మాష్‌ ‘మెఘా’ నాయాళ్ళారా… ఆపండిరా..! ఎలాంటి ఆశలు లేకుండా… నిజాయి తీగా రోజుకు రూపాయలు.. వందలు సంపాదించే.. సామాన్య బీద, బిక్కి జనాలు.. ”మీలాంటీ రాజప్రసాదాలు… ఆడుకోడానికి ‘గోల్ప్‌’ మైదానాలు అడగట్లేదు కదర్రా…! ”ఈ సభ్య సమాజంలో..! కనీసం మనుషుల్లా వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను.. పసి పిల్లలను బతకనీయండ్రా…! ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ మాత్రమే అందించగల కథనం మీకోసం ప్రత్యేకం.

ఇది తెలిసిందే..: అధికారంలో ఉన్నప్పుడు అందరూ అన్నీ ‘నీతి’ మాటలే చెపుతారు. పదవులు పోగానే కుప్పలు తెప్పలుగా… అవి’నీతి’ కథలు బయటకు తన్నుకొస్తాయి. కంట్రాక్టులు పొందిన కంపెనీలు తమ సంపాదనలో కొంతభాగాన్ని నాయకులకు, పార్టీలకు గుంభనంగా చందాలుగా ఇవ్వడం పరిపాటే. అధికారికంగా కొంత..! అనధికారికంగా బోలెడంత..! అయితే లెక్కల్లోకి రాని విరాళాలు దొరికినప్పుడే సమస్య. గతంలో ఏ పార్టీ స్థోమతను బట్టి అంటె..అధికారం, డీల్‌ చేసే పద్ధతిని బట్టి విరాళాల సేకరణ. రాచమార్గంలో ఆ పార్టీ విరాళాలు పొందేది. అయితే

తెలుగుదేశం పార్టీ ఉచ్చులో చిక్కు హకుంది.

ట్రెండ్‌ మారింది: కొంతకాలంగా రాజకీయ ట్రెండ్‌ మారిపోయింది. మార్చారు. ఒక పార్టీ మరో పార్టీకి ఆర్థిక సాయం చేస్తున్నది. తమిళనాడులో గత ఎన్నికల్లో ఆర్థికంగా బలంగా ఉన్న డీఎంకే అధికారికంగానే సీపీఎం, సీపీఐలకు సాయం చేసింది. తెలంగాణ సిఎం. కేసీయార్‌ జగన్కు నగదు సాయం చేశాడనీ… చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి ఆర్థిక సాయం చేశాడనీ… బోలెడంత సంబడం ఉండనే ఉంది. కర్నాటక కుమారస్వామికి కేసీయార్‌, చంద్రబాబు ఇద్దరూ విడివిడిగా ఆర్థికసాయం చేశారని మరో విచిత్రవార్త కూడా చక్కర్లు కొట్టింది. హ్హ.హ్హా.హ్హా.. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే..?

ఈ..ఈ..ఈ..: బీజేపీ కూడా అదే అనుకుంటున్నట్టుగా ఉంది. జగన్‌ భుజాల మీద తుపాకీ పెట్టి కాలిస్తే సరి. ‘నడుమ మాకెందుకు’ అని?! పోలవరంలో 2346 కోట్ల అదనపు చెల్లింపులపై ఇటీవలే పార్లమెంటులో కేంద్ర మంత్రే స్వయంగా వివరణ ఇచ్చాడు. కానీ…కేంద్ర మంత్రి తన సమాధానంలో జగన్‌ ప్రభుత్వం నియమించిన ‘నిపుణుల కమిటీ’ ఈ మేరకు అదనపు చెల్లింపులను తేల్చిందని మాత్రమే ప్రస్తావించాడు. (అహ్హా.. చక్కిలిగిలిగింతలు పెట్టుకొని నవ్వకోండి). అలాగే ‘కాంపిటెంటు అథారిటీ’ ఆమోదం మేరకే చెల్లింపులు జరిగినట్టు గతంలో కేంద్రానికి జగన్‌ ప్రభుత్వమే ఓ లేఖ రాసినట్టు ప్రచారం సాగుతున్నది.(ఎవరు ఎవరికి సర్టిఫికెట్టు ఇస్తున్నారు ఆ లేఖ ద్వారా..? హ..అహ్హ..అహ్హా) అంటే పోలవరంలో అక్రమాలు జరిగినట్టా..? జరగనట్టా..? జగన్‌ ప్రభుత్వానికే ఓ క్లారిటీ లేదు?మ. ఉండదు కూడా. ఇక కేంద్రం వాటి ఆధారంగా ఏం చర్యలు తీసుకోవాలి..? (వాళ్ళు తీసుకునేది వేరే ఉంది.) అందుకని ‘మీరు గనుక అక్రమాలు నిర్ధారిస్తే మీరే కేసులు పెట్టండి’ అని కేంద్రం రాష్ట్రానికి చెబుతున్నట్టుగా ఓ సమాచారం.

జై హుజూర్‌..: మరో సమాచారం చక్కర్లు కొట్టింది? దాని సారాంశం ఏమిటంటే..? ”ముంబైకి చెందిన షాపూర్‌ జీ పల్లంజీ నుండి 150 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి విరాళాలుగా వెళ్లాయంటున్నారు ఐటీ అధికారులు తన ఐదేళ్ల పదవీ కాలంలో ఈ సంస్థకు దాదాపు రూ.2,230 కోట్ల రూపాయలు పనుల కాంట్రాక్టు పనులు అప్పజెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.,. మొత్తం 700 కోట్ల చెల్లింపుల (అనూహ్యమైన అంకె ఇది?)కు గాను 150 కోట్లు గత ఎన్నికల సమయంలో ఇచ్చింది ఆ కంపెనీ. హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు వెళ్లింది. ఆ డబ్బు. ఈమేరకు టీడీపీకి, ‘షాపూర్‌ జీ’ కంపెనీకి నోటీసులు సిద్ధం చేస్తున్నది ఐటీ శాఖ?” గతంలోనే 150 కోట్లు ఓ ఆంధ్రా ప్రముఖుడికి చెల్లింపులు జరిగాయంటూ ఐటీ శాఖే ప్రకటించినందున ఈ ప్రచారం కూడా కలకలం రేకెత్తిస్తున్నది. ఇంతకీ ఆ 170 కోట్ల విరాళం డీల్‌ చేసిన ప్రముఖుడెవరు..? ఈ 150 కోట్లు అందుకున్న ప్రముఖుడు ఎవరు..? ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తుందా..?! లేక నాన్చీ, నాన్చీ, మెడపై ఓ పెద్ద కత్తి వేలాడదీసి, ఆ ప్రముఖుడిని పూర్తిగా లొంగదీసుకునే ఆలోచనలో ఉన్నదా..? ప్రస్తుతానికి మిస్టరీ..!!

(రేపు.. బుక్కైన ‘బకరాలు’ ఎవరు..?)

అమితానందంలో భాజపా శ్రేణులు

‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ప్రచురిస్తున్న లోగుట్టు కథనాలపై ఢిల్లీ నుంచి ప్రశంసలు వచ్చాయి. భాజపాలోని ఓ కీలక నాయకుడం.. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి’కి స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు. అంతే కాకుండా ఈ లోగుట్టు పై ‘ప్రధానమంత్రి కార్యాలయం’ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close