తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి కష్టపడి పనిచేస్తా : కిషన్ రెడ్డి

0

కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డికి శుక్రవారం ఇక్కడ బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అంతకు ముందు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన హెలికాప్టర్‌లో బేగంపేట పాత విమానాశ్రయానికి చేరుకున్నారు. కిషన్ రెడ్డికి స్వాగతం చెప్పడానికి వచ్చిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీజేపీకి చెందిన అన్ని అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్యారడైజ్, రాణిగంజ్, వైస్రాయ్ హోటల్, ముషీరాబాద్, గోల్కొండ ఆర్టీసి క్రాస్ రోడ్డు, నారాయణగూడ చౌరస్తా, హిమాయత్ నగర్, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్‌బాగ్, అబిడ్స్ మీదుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి స్వాగత ర్యాలీ చేరింది. బీజేపీ ఆఫీసులో జీ కిషన్ రెడ్డిని పార్టీ నేతలు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి కష్టపడి పనిచేస్తానన్నారు. తనను గెలిపించిన సికింద్రాబాద్ నియోజకవర్గం, తెలంగాణ ప్రజలకు
రుణపడి ఉంటానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here