క్రైమ్ న్యూస్స్టేట్ న్యూస్

తప్పు చేసినోడు ‘కరెక్ట్’ … వార్తలు రాసినోల్లపై ‘కేసులు’

బంగారు తెలంగాణాలో…
దోపిడీలకు ద్వారాలు
◆ సంకెళ్ళకు, ఉరికొయ్యలకు ‘ఆదాబ్’ భయపడదు

అన్యాయం,అక్రమం జరుగుతుందని వార్తల ద్వారా చెప్పటం ఈ బంగారు తెలంగాణాలో నేరమా..? తప్పకుండా నేరమే… దొంగలందరూ కలసి ఊళ్ళు పంచుకున్న నైజం. ‘జిఎచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ లో రూపాయి ఖర్చు పెట్టకుండా భవనం అనుమతి వస్తుందా…?’ ఇల్లు కట్టిన ప్రతి వాడికీ తెలుసు. ఎవడెంత నొక్కేస్తాడో… అందరూ నిజయితీ పరులైతే… అసలు దొంగ నా’వెధవ’ ఎవడు.. మరి. తప్పుచేసినోడి మీద ఫిర్యాదు చేస్తే చర్యలు శూన్యం. అది రాసిన జర్నలిస్టులపై కేసులా..? ఎవడ్రా ఇది బంగారు తెలంగాణ అని చెప్పింది.

అసలేం జరిగింది:
సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని ఇంటి నెంబర్ 9-2-81 లో అక్రమ నిర్మాణంపై పూర్తి సమాచారంతో ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రిక వరుస పరిశోధనాత్మక కథనాలు ప్రచురించింది. దీంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో నిర్మాణ దారుడు, జిహెచ్ఎంసి బేగంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏకమయ్యారు. ఆ అక్రమ నిర్మాణాలపై ఎవరు రాసినా కేసులు నమోదు చేయించటమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి తోడు అక్రమ భవననిర్మాణ దారుడితో మారేడుపల్లి ఖాకీలు సైతం చేతులు కలిపారు. ఆ అక్రమ నిర్మాణాలను ఎవరు ప్రశ్నించిన వారిపైన ఏదో ఒక రకమైన కేసు పెట్టి భయభ్రాంతులకు, వేధింపులకు గురి చేయటం పరిపాటిగా మారింది. అక్రమాలను ప్రశ్నించడమే జర్నలిస్టులు చేసిన నేరం.. సికింద్రాబాద్ రిపోర్టర్లు సత్యనారాయణ,మధు లు అక్రమాలను ప్రశ్నించినందుకు బహుమతిగా ఆయనపై మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో భవన నిర్మాణదారుడు ఇచ్చిన తప్పుడు పిర్యాదు తో కేసును నమోదు చేశారు పోలీసులు. 9-2-81 ఇంటి నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుండి కనీస అనుమతులు కూడా లేకుండా ఏకంగా నాలుగు అంతస్తులు నిర్మించారు (సమాచార హక్కు చట్టం కింద పూర్తి ఆధారాలు ఉన్నాయి) బేగంపేట సర్కిల్ ఏసీపీ, సెక్షన్ అధికారి పూర్తి సహకారంతోనే అనుమతులు లేకుండా ఇంత అక్రమ భవనం నిర్మించారు అన్నది అందరికీ తెలిసినదే.. ఏ అధికారి ఏ గడ్డి, ఏ ప్రాంతంలో పీకుతున్నారో తెలియాల్సి ఉంది. (మా జర్నలిస్టులను అంటే ఆ మాట కూడా అనకూడదా..? మరి) నిర్మాణ సమయంలో స్థానికులు అడ్డుకుంటున్నారని కోర్టు నుండి స్టే తెచ్చుకొని నిర్మాణము కొనసాగించారు. (కోర్టు స్టే అర్థాన్ని సబంధిత పట్టణ ప్రణాళికా అధికారి చెప్పాలి.) ఈ అక్రమ నిర్మాణాన్ని చేయాలని ఎక్కడా లేదు. ఉండదు కూడా. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఇంటి నిర్మాణదారుని, బిల్డర్ నీ వదిలేశారు. ఎందుకంటే అక్కడ వెధవలకు మేత లక్షల్లో ఉంటుంది కదా..మరి. ప్రశ్నించిన పాపానికి ఇప్పటివరకు దాదాపు ఐదుగురిపై అక్రమ కేసులు బనాయించిన ఘనత మారేడుపల్లి పోలీసులకే సగర్వంగా దక్కుతుంది. (తెలంగాణ పోలీసు అధికారులకు ఈ అక్రమ నిర్మాణంలో వాటా అందినట్లు చెపుతున్నారు.(దీనిని ఆదాబ్ విశ్వసించడం లేదు) డబ్బు ఎక్కడో పోలీసు అక్కడే అన్నట్లుగా మారింది మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిస్థితి. (వారి విషయాలను ఆదాబ్ హైదరాబాద్ సేకరించింది. మరోసారి చూద్దాం).
వాస్తవాలని పరిగణనలోకి తీసుకోకుండా ముందు ఫిర్యాదును బుట్టదాఖలు చేశారు. దాదాపు 15 రోజుల తర్వాత ఏమి చేయాలో దొంగలందరూ.. అంటే ఆక్రమ నిర్మాణ సూత్రధారులు అందరూ ఒక పక్కా ప్రణాళిక వేసుకొని కేసు నమోదు చేసిన మహా ఘనత మారేడుపల్లి పోలీసులది.

18-5-19 నాడు రెజిమెంటల్ బజార్ లోని అక్రమ నిర్మాణంపై కథనం వస్తే దానిపై వివరణ తీసుకోవడానికి జిహెచ్ఎంసి ఏ.సి.పి కుద్దుస్ కార్యాలయానికి వెళితే అధికారి కార్యాలయంలో లేరు. ‘ఆదాబ్ హైదరాబాద్’ రిపోర్టర్లు ఆయన కోసం వేచి చూశారు. అప్పటికే అక్రమ నిర్మాణం దారులతో కుమ్మక్కయిన ఏసీపీ, సెక్షన్ అధికారి వారిని పిలిపించాడు. (ఎంతటి అనుబంధమో..)
ఏసీపీ కార్యాలయంలో జర్నలిస్టులను చూసిన అక్రమ నిర్మాణదారుడు తన గుండాలతో వారిపై దాడి చేయించడానికి యత్నించారు. ఇష్టారాజ్యంగా దూషించారు. ఈ విషయాన్ని వివరంగా రాస్తు మే 18వ తేదినే మారేడ్ పల్లి సీఐ కి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదును స్వీకరించక పోగా…. ‘మీ రిపోర్టర్ల సంగతి మాకు తెలుసు, ప్రభుత్వ అధికారుల మీద రాసేంత ధైర్యం ఉందా..? గెజిటెడ్ ఆఫీసర్ల పైనే వార్తలు రాసేంత ఉందా మీకు… అంత ఉందా మీకు.. అని చెప్పారు. తొలి ఫిర్యాదు తీసుకోకుండా పంపించి వేశారు. దీంతో మరుసటి రోజు నార్త్ జోన్ డి.సి.పి కార్యాలయంలో జర్నలిస్టులు ఫిర్యాదు చేయడంతో సదరు డి.సి.పి. ‘ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదు’ అని మారెడ్ పల్లి సీఐని ప్రశ్నించారు. దానితో 18 తారీకు నాడు ఫిర్యాదు తీసుకున్నట్లు సీఐ రశీదు ఇచ్చారు. కానీ అక్రమ నిర్మాణ దారులు, బిల్డర్లు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు వారిపై కేసును నమోదు చేయలేదు. వాస్తవాలను, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఆదాబ్ రిపోర్టర్ల పై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం. దేశంలో అత్యంత నీతి వంతమైన జాతిరమలో టౌన్ ప్లానింగ్, పోలీసు శాఖ ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. రెజిమెంటల్ బజార్ లోని ఈ అక్రమ నిర్మాణం పై మారేడు పల్లి పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం, అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఏ రిపోర్టర్ ఆ భవనం వైపు చూసిన వారిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేసులు నమోదు చేస్తున్నారు. అసలు అక్రమ నిర్మాణానికి? పోలీసులకు ఏమిటి సంబంధం..?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close