డెల్టాకార్ప్‌ షేర్లు భారీగా పతనం

0

ముంబాయి : నేటి ట్రేడింగ్‌లో డెల్టాకార్ప్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. 13 శాతం దిగజారి రూ. 186 వద్దకు చేరాయి. సోమవారం ఉదయం భారీ

వాల్యూమ్‌లతో విక్రయాలు జరిగాయి. దీంతో 2017 సెప్టెంబరు 25 తర్వాత ఇంత స్థాయిలో షేర్ల ధరలు పతనం కావడం ఇదే తొలిసారి. రూ. 6189

కోట్ల మేరకు జిఎస్టఇ ఎగవేత కేసులో డిజి జిఎస్‌టి ఇంటిలిజెన్స్‌ కేసులు నమోదు చేయడంతో షేరు ధర పతనం అవుతుంది. దీనికి తోడు గోవా ప్రభుత్వం

కెసినో లైసెన్స్‌లను పునః పరశీలిస్తానని పేర్కొనడంతో షేర్ల విక్రయాలు జరుగుతున్నాయి. డెల్టాకార్ప్‌ ప్రధానంగా కెసినో గేమింగ్‌ వ్యాపారాన్ని చేస్తుంది.

ప్రస్తుతం వచ్చిన జిఎస్‌టి ఆరోపణలపై డెల్టా కార్ప్‌సిఈఓ స్పందిస్తూ తాము జిఎస్‌టి నిబంధనలనుపాటిస్తున్నామని అన్నారు. తాము జిఎస్‌టిని

ఎగ్గొట్టలేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here