టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో పటిష్టమైన పునాది :కేటీఆర్

0

జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యదిక స్థానాలతో ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో ఎంత పటిష్టమైన పునాది ఉందో ఈ ఫలితాలే రుజువు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

ఎన్నికల్లో కష్టపడ్డ జిల్లా పార్టీ ఇన్ఛార్జిలకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చారు. దేశ చరిత్రలో, స్థానిక సంస్థల చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంత ఏకపక్ష తీర్పురాలేదన్నారు. వందశాతం జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరుగలేదు. ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం. టీఆర్ఎస్ చరిత్రలో ఇది అతిపెద్ద విజయం. దేశంలో ఏ పార్టీ సాధించని ఘనత టీఆర్ఎస్ సాధించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు. ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మరో ఆరు జిల్లాల్లో విపక్షాలకు ఒక్కో స్థానం మాత్రమే దక్కింది. 32కు 32 జిల్లాల్లో జెడ్పీ పీఠాలను టీఆర్ఎస్ సొంతంగా కైవసం చేసుకుందన్నారు. ఓటు వేసిన ప్రజలందరికీ తలవంచి నమస్కరిస్తున్నానన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో 7జెడ్పీటీసీలకు ఐదింటిలో విజయం సాధించామని కేటీఆర్ తెలిపారు. ఇది గెలుపు కాదు..ప్రజలు మనకిచ్చిన బాధ్యత. ఇంతటి ఘనవిజయాన్ని అందించి ప్రజలు మాపై బాధ్యతను మరింత పెంచారు. గులాబీ శ్రేణుల వల్లే ఈ విజయం సాధ్యమైంది. ప్రతిపక్షాలను తిరస్కరిస్తూ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లో జరిగిన శాసనమండలి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్సీలకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here