టిన్ పిన్ బౌలింగ్ క్రీడ కు తగిన ప్రోత్సాహకం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

0

తెలంగాణ టిన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ లోగో ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ A. వెంకటేశ్వర రెడ్డి, స్మాష్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వీరేందర్ గౌడ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ క్రీడ కు తగిన ప్రోత్సాహకం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ క్రీడకు విశేష ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. 
కొత్తగా రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ ను ఏర్పాటు చేయటం ఆనందం గా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అసోసియేషన్ ద్వారా టిన్ పిన్ బౌలింగ్ క్రీడను క్రీడాకారులకు మరింత చేరువ చేసేందుకు కృషిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రాష్ట్ర స్థాయిలో వివిధ రకాలైన టౌర్నమెంట్ల నిర్వహణ తో పాటు, క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి టౌర్నమెంట్ల కు చేరువ చేసేందుకు అసోసియేషన్ ప్రతినిధులు కృషిచేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఈ సందర్భంగా తెలంగాణ టిన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాహుల్ రెడ్డి తో పాటు అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. క్రీడాకారులకు మెమెంటోలు ప్రధానం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here