జూబ్లీ హాలులో కవి సమ్మేళనం

0

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జూబ్లీ హాలులో నిర్వహించిన కవి సమ్మేళనం రాష్ట్ర అబ్కారీ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఐదేళ్ళ కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం చే పురస్కారాలు విజేతల ను కలిపి వేదికపైకి తీసుకువచ్చి వారిచే కవి సమ్మేళనం ను నిర్వహించటం, అది పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీ హాల్లో నిర్వహించటం ఒక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 
ప్రత్యేక రాష్ట్ర సాధన ఏర్పాటు కోసం మా తెలంగాణ ప్రజల గోసను శ్రీకృష్ణ కమిషన్ కు విన్నవించుకునేందుకు జూబ్లీ హాల్ కు వచ్చి ఎన్ని సార్లు విజ్ఞప్తిని చేసినా, శ్రీకృష్ణ కమిటీ కనీసం మా విజ్ఞప్తిని పట్టించుకోకు0డా నిర్లక్ష్యం చూపిన ఈ జూబ్లీహాల్ వేదికపై తెలంగాణ కవులచే కవితా గానం చేయడం మరచిపోలేని రోజుగా అభివర్ణించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఎక్కడైతే అవమానాలపాలు అయ్యా మో అక్కడే ఆత్మగౌరవంతో మా కవులచే కవితలు వినిపించాము ఇది తెలంగాణ ప్రజలందరి ఘన విజయమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు సారథ్యం వల్లే ఇది సాధ్యమైంది పబ్లిక్ గార్డెన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడం ఎంత విశిష్టత జూబ్లీహాల్లో కవి సమ్మేళనం జరగడం కూడా అంతే విశిష్ఠతను సంతరించుకుందని శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ కాలంలో కవులు కళాకారులు సాహితీవేత్తలు గొంతు ఎత్తి కవిత రాసి ఉద్యమానికి ఊపిరి అయ్యారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వారి బాధ్యత మరింత పెరిగింది అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కవులు కళాకారులు సాహితీవేత్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశిస్తున్నా బంగారు తెలంగాణ సాధనలో లో తన వంతు పాత్ర పోషించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ కవులను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, మెమొంటో నగదును మంత్రి శ్రీనివాస్ గౌడ్ కవులకు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here