జీ20 సదస్సులో పలు దేశాధినేతలతో మోదీ భేటీ

0

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈరోజు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ సమావేశమయ్యారు. ఇరాన్ ఆంక్షలు, 5జీ, వాణిజ్యం, రక్షణ సహకారంపై వీరివురి మధ్య చర్చలు జరిగాయి. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారో, సౌదీ రాజుతో కూడా మోదీ భేటీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here