జీహెచ్‌ఎంసీలో అధికారులంతా…మావాళ్లే

0

అక్రమ కట్టడాల విషయంలో ఉపేక్షించేది లేదని ఓ పక్క జిహెచ్‌ఎంసి కమిషనర్‌ చెబుతుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాలు విస్మరించి అక్రమ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అందినకాడికి కోట్లు దండుకుంటున్నారు. అక్రమ కట్టడాల విషయంలో అనేక ఫిర్యాదులు వస్తున్న వాటిని సాకుగా చూపి టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది నిర్మాణ దారులకు నోటీసులతో అందినకాడికి దోచుకుంటున్నారు. ఎల్బీనగర్‌లోని మూడు సర్కిళ్లలో జోరుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్వచ్ఛంద సంస్థలు స్థానిక నాయకులు వాపోతున్నారు. కొందరు నిర్మాణదారులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి భారీ అంతస్తులు నిర్మించి యధేచ్చగా అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతున్నారు.

ఎల్బీనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): స్థానిక నాయకులు జంగారెడ్డి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జోనల్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది ఒక నిర్మాణానికి మాత్రమే ఇలాంటివి మరెన్నో బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్నా పట్టింకునే నాదులు లేరు. సాయి నగర్‌లో దొంగ పర్మిషన్‌ కాపీలు సృష్టించి లోన్‌లు ఇప్పిస్తామని చెప్పగా సామాన్య ప్రజలు మోసపోయి కొనుగోలు చేస్తున్నారు. ఒక వేళ సాయినగర్‌లో అధికారులు తనిఖీలు చేపడితే సామాన్య ప్రజల పరిస్థితేంటి… నాగోల్‌లోని సాయి నగర్‌ కాలనీ రోడ్‌ నెంబర్‌ 2 ప్లాట్‌ నెంబర్‌ 17 సుమారు 400 గజాల ఖాళీ స్థలంలో గల అక్రమ బహుళ అంతస్తు కట్టడం విషయమై స్థానిక నాయకులు జంగారెడ్డి ప్రశ్నిస్తే సదరు అక్రమ నిర్మాణ దారుడుదురుసుగా ప్రవర్తిస్తూ జిహెచ్‌ఎంసిలో మా బంధువులు ఉన్నారు ఈ అక్రమ కట్టడాలను ఆపడం మీ తరంకాదు అంటూ దాడులకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పటికి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పడి చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. పాపపుణ్యాలు మాకేమీ తెలియదు.. మీకే ఎరుక అంటూ అక్రమ విధి నిర్వహణలో నిమగ్నమైన ఎల్బీనగర్‌ జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికార వర్గం ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్న టౌన్‌ ప్లానింగ్‌ క్రింది స్థాయి నుండి జోనల్‌ కమీషనర్‌ వరకు అక్రమ కట్టడాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈస్ట్‌ జోన్‌లోని అన్ని సర్కిళ్ళ నుండి అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు నాయకులు స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదులు చేస్తున్న అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరం. జిహెచ్‌ఎంసి కమిషనర్‌ కరుణిస్తాడో లేక మంత్రి కరుణిస్తాడో వేచి చూడాల్సిందే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here