జర్నలిస్టుల గుండు గీసిన కెసిఆర్

0



సి డి కేటగిరిలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు అందని ద్రాక్షే
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డ్ అందించడంలో చైర్మన్ అల్లం విఫలం


హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) తెలంగాణ ఏర్పాటుతోనే జర్నలిస్టులకు స్వర్ణ బాటలు వేస్తున్నట్టు తెగ డప్పు కొట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అక్రిడేషన్ కార్డుల జారీలో వేల సంఖ్యలో  జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. సి డి కేటగిరీలలో ఉన్న పత్రికలకు కేవలం 2 అక్రిడేషన్ కార్డులు జారీ చేసి చేతులు దులుపుకుంది. దానితో సి డి కేటగిరీలలో ఉన్న వందల పత్రికలకు అందులో విధులు నిర్వహించే రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు రాకపోవడంతో  దాదాపు 7000 పైన జర్నలిస్టు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జర్నలిస్టులకు ఎంతో చేస్తామని గొప్పలు చెప్పిన కెసిఆర్ ఈరోజు కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా అందరికీ మంజూరు చేయించలేని దుస్థితిలో పాలన సాగిస్తున్నారు. మాటలు తీయగా చేతలు శూన్యం అన్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ దృష్టికి జర్నలిస్టుల సమస్యను తీసుకుపోవాల్సిన మీడియా చైర్మన్ అల్లం నారాయణ అడ్రస్ లేకుండా పోయాడు. మీడియా చైర్మన్ పదవి తీసుకోవడానికి అనేక నక్క జిమ్మిక్కులు చేసే అల్లం నారాయణ ఏనాడు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ బి సి డి కేటగిరీలతో మొత్తం జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేమని  కనీస అవగాహన లేని వ్యక్తి ఈరోజు తెలంగాణ మీడియాకు చైర్మన్ అల్లం నారాయణ ఉండడం సిగ్గుచేటని జర్నలిస్టు లు మండి పడుతున్నాయి. సి డి కేటగిరిలో నీ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు కు అర్హులు కాదంటూ జీవో 239 ఎలా తీశారని జర్నలిస్టు ప్రశ్నిస్తున్నారు. జీవో ఏర్పాటు చేసే సమయంలో పూర్తిస్థాయిలో సమీక్షించకుండా నవీన్ మిట్టల్ జీవోను తనకు నచ్చినట్లు తయారు చేశారని దానిని పరిశీలించాల్సిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తూతూమంత్రంగా పరిశీలించడంతో చాలామంది జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.  జీవో 239 వల్ల చాలామంది తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరగదని ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. కనీస అవగాహన లేకుండా జీవో 239 జారీ చేశారని ఏ కేటగిరి లో ఉన్న జర్నలిస్టులకు కూడా అన్యాయం జరగదని కేవలం మండల స్థాయి రిపోర్టర్లకు అక్రిడేషన్ కేటాయిస్తే అదే మండలంలో మిగతా ప్రాంతాలలో పనిచేసే రిపోర్టర్ లకు అక్రిడేషన్ ఇవ్వకపోవడం అన్యాయం కాదా అని రిపోర్టర్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం మండల స్థాయి రిపోర్టర్లు ఒక్కరే ఉండరని ఇద్దరు, ముగ్గురు న్యూస్ సమాచారం సేకరిస్తున్నారు… మండలంలో దాదాపు ముగ్గురు నలుగురు రిపోర్టర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు కానీ కేవలం ఒక్కరికి మాత్రమే అక్రిడేషన్ కార్డు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఇలాంటి అనేక జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని జర్నలిస్ట్ సంఘాలు, మీడియా చైర్మన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వాళ్ల పబ్బం గడుపుకోవడానికి తప్ప వీళ్ల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టుకు న్యాయం జరగడం లేదనేది బహిరంగ రహస్యమే. మీడియా చైర్మన్ అల్లం నారాయణ పదవి అనుభవించడానికే తప్ప ఎందుకూ పనికిరాని చైర్మన్ గా చరిత్రలో నిలిచి పోవడం ఖాయమనీ  జర్నలిస్ట్ లు మండిపడుతున్నారు. తెలంగాణ జర్నలిస్టు లందరికీ అక్రిడేషన్ కార్డులు ఇప్పించ లేని అల్లం నారాయణ వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని జర్నలిస్టులు  హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కెసిఆర్, కేటీఆర్ స్పందించి సి డి కేటగిరీలలో ఉన్న దాదాపు 7వేలకు పై జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు అక్రిడేషన్ కార్డు అందే విధంగా చూడాలని విన్నవించుకుంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here