Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

చేనేతకు చేయూత

మహిళలకు పెద్దన్నగా కేసీఆర్‌

  • రెట్టింపైన నేతన్నల కార్మికుల ఆదాయం
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
  • సూర్యపేట జిల్లా ఆడపడుచులకు నిరాశే..
  • అమలులోనున్న ఎన్నికల కోడ్‌

నల్లగొండ

తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ తోబుట్టువుగా, పెద్దన్నగా అండగా నిలుస్తున్నాడని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నల్లగొండ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ నెల 28న బతుకమ్మ ప్రారంభమవుతోందని, ఆడబిడ్డలందరూ బతుకును గౌరవించుకునే పండుగ అన్నారు. ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేతన్నలు చాలా చక్కని చీరలు తయారు చేశారని, పెద్ద మొత్తంలో చీరల పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బతుకమ్మ పండుగకు చీరలు పంచిపెట్టే సంస్కృతిని మరింతగా అభివృద్ధి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 100 రకాల చీరల్ని అన్ని నియోజకవర్గాల్లో (సూర్యాపేట జిల్లా తప్ప) పంచిపెడుతోంది ప్రభుత్వం. బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు చీరలు ఇస్తే… వాటిని తయారుచేసేందుకు మరమగ్గ కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇదివరకు మరమగ్గ కార్మికులకు నెలకు రూ.8వేల నుంచి రూ.12వేలు మాత్రమే వచ్చింది. బతుకమ్మ చీరల తయారీ కారణంగా నెలకు రూ.16వేల నుంచి రూ.20వేల దాకా వస్తోంది. ఈ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మూడేళ్ల కిందట ఈ కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు చీరలు ఇస్తోంది. ఈ ఏడాది కోటి 2వేల మందికి ఇవ్వబోతోంది. మొత్తం 16000 కుటుంబాలు, 26000 మర మగ్గాల్ని వాడి… ఈ చీరల్ని తయారుచేశాయి. 10 రకాల డిజైన్లు, 10 రకాల రంగులు కలిపి… 100 వరైటీల్లో చీరలు రెడీ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు పెట్టింది. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.715 కోట్లు ఖర్చు చేసింది. గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలు చీరల్ని పంచుతున్నాయి. ఈసారి చీరల క్వాలిటీ పెంచారు. చీరతోపాటు జాకెట్‌ కూడా ఇవ్వబోతున్నారు. ఒక్కో చీర తయారీకి జీఎస్టీ కాకుండా రూ.280 ఖర్చు చేశారు. 2017లో 95,48,439, 2018లో 96,70,474 చీరెలు పంచారు. ఈసారి పంచే 1.02 కోట్ల చీరల్లో… 75 లక్షల చీరలు ఆల్రెడీ జిల్లాలకు వెళ్లిపోయాయి. కాబట్టి… అర్హులైన మహిళలు… ఆయా గ్రామ, వార్డు స్థాయిలో కమిటీ సభ్యులను కలిసి… చీరలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే… గ్రామ స్థాయి కమిటీలో పంచాయతీ, గ్రామ రెవెన్యూఅధికారి, గ్రామ మహిళాసంఘం ఆఫీసు బేరర్‌, రేషన్‌షాపు డీలర్‌… వార్డు స్థాయి కమిటీలో బిల్‌కలెక్టర్‌, వార్డు మహిళాసంఘం ఆఫీసు బేరర్‌, రేషన్‌డీలర్‌ సభ్యులుగా ఉంటారు. వారిని కలిసి అర్హులైన మహిళలు చీరలు పొందాల్సి ఉంటుంది.

చేనేత కార్మికులకు చేనేత మిత్ర భరోసా

2001, 2002 సంవత్సరాల సమయంలో పోచంపల్లిలో ఏడు మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, నాటి ఉద్యమనాయకుడు, నేటీ సీఎం కేసీఆర్‌.. వారికి సహాయం చేయ్యండని,  బతుకు విూద భరోసా కల్పించాలని అడిగితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. స్వయనా కేసీఆరే జోలెపట్టుకుని డబ్బులు అడిగి.. ఏడు కుటుంబాలకు రూ. 50వేల చొప్పున సహాయం చేశారన్నారు. కేసీఆర్‌ కరీంనగర్‌ ఎంపీగా ఉన్న సమయంలో నాడు ఎనిమిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ క్రమంలోనే నేతన్నలకు జీవనోపాధి కల్పించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. బతుకమ్మ చీరెలు కాకుండా, బడి పిల్లల యూనిఫాంలను కూడా నేతన్నలకే అప్పజెప్పామని కేటీఆర్‌ తెలిపారు. యూనిఫాంలు వేసుకునే సింగరేణి, ఆర్టీసీ సంస్థలతో మాట్లాడి రాష్ట్రంలోని నేతన్నలకే అప్పజెప్తామన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు స్థాపించే దిశగా ముందుకెళ్తున్నామని, బతుకమ్మ చీరెల ద్వారా ఆదాయం రెట్టింపు అయిందని తెలిపారు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం పథకాలు తీసుకురాలేదు. చేనేత మిత్ర పేరుతో రాష్ట్రంలో నేతన్నలందరికీ భరోసానిచ్చే విధంగా రసాయనాలు, నూలు, అద్దకానికి వాడే వస్తువులను 50శాతం సబ్సిడీతో ఇస్తున్నాం. నేతన్న చేయూత పేరిట నేతన్నల కుటుంబాల కోసం మరో పథకం అమలు చేస్తున్నామన్నారు. చేనేత లక్ష్మీ పేరిట మరో కార్యక్రమం తీసుకువచ్చామని కేటీఆర్‌ తెలిపారు. వరంగల్‌లో అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కును తీసుకువస్తున్నామని, ప్రతి సోమవారం కచ్చితంగా చేనేత వస్త్రాలు ధరించాలనే నిర్ణయం తీసుకుని.. ఆచరించి చూపిస్తున్నామని తెలిపారు. ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని, తద్వారా నేతన్నలకు జీవనోపాధి కల్పించిన వాళ్లం అవుతామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 

అనంతరం మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని కోటి మంది ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ జరుగుతుందన్నారు. కార్మికులు చేనేతకు పూర్వవైభవం తెస్తూ బతుకమ్మ చీరలను అందంగా తయారు చేస్తున్నారన్నారు.  నల్లగొండపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉందని, నల్లగొండ, సూర్యపేటల్లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశారని, యాదాద్రి ఆలయాన్ని అబ్బురపడే విధంగా పునర్‌ నిర్మాణం చేస్తున్నారన్నారు. యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు, చౌటుప్పల్‌ ఇండస్టీయ్రల్‌ పార్క్‌ రూపుదిద్దుకుంటున్నామని, రైతుల ఆత్మహత్యలు ఇక లేవు... చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇక ఉండవని మంత్రి అన్నారు. 35 వేల కోట్ల రూపాయలతో నల్లగొండలో పనగల్‌ రిజర్వాయర్‌ను మినీ ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, లింగయ్య, రవీంద్రనాయక్‌, ఎమ్మెల్సీలు తేర చిన్నపరెడ్డి, నాయకులు కూసుమంచి ప్రభాకర్‌రెడ్డి, శాంభయ్య శరణ్యరెడ్డి, పూల రవీందర్‌, చేనేత శాఖ ఎండీ శైలజ రామయ్యర్‌, కలెక్టర్‌ ఉపల్‌ తదితరలు పాల్గొన్నారు. 

సూర్యాపేట జిల్లాలో నిరాశే

సూర్యాపేట జిల్లా ఆడపడుచుల ఆశలపై ఎన్నికల కోడ్‌ నీళ్లు చల్లింది. హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో... ఆ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో ఉండటంతో... ఆ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. అందువల్ల సూర్యాపేట జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కాలేదు. ప్రభుత్వ కానుక పొందాలని ఎదురుచూసిన సూర్యాపేట జిల్లా ఆడపడుచులకు ప్రస్తుతానికి నిరాశ కలుగుతున్నట్లే. ఎన్నికలు ముగిసిన తర్వాతే వాళ్లకు చీరల పంపిణీ ఉంటుంది.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close