Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

చెల్లని చెక్కు… 3వేల కోట్ల స్కాం బట్టబయలు

సీజీ పవర్‌ వ్యవహారం బయటపడిన వైనం

  • లకారం పెట్టుబడితో..
  • ఉన్నత పదవులు – విచ్చలవిడి ఖర్చు
  • నోరు విప్పని ఎస్‌ బ్యాంక్‌

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక్క చెల్లని చెక్కు ఏకంగా రూ.3,000 కోట్ల విలువైన కుంభకోణం బయట పెట్టింది. కేవలం లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి డొల్ల కంపెనీలను సృష్టించి ఈ పెద్ద మొత్తాన్ని నొక్కేశారు. సీజీ పవర్లో జరిగిన అవకతవకలపై వైష్‌ అసోసియేట్స్‌ నిర్వహించిన దర్యాప్తులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నత స్థాయి పదవుల్లోని వ్యక్తులు విచ్చలవిడిగా నిధులను మళ్లించి కంపెనీలను గుల్ల చేసిన వైనం చూసి దర్యాప్తు సంస్థ కూడా నోరెళ్లబెట్టింది. దర్యప్తులోని కీలక విషయాలను ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ బయటపెడుతుంది.

ఆరోపణలు ఇవీ.. : సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ లోని ఉన్నత స్థాయి వ్యక్తులు కనీసం కంపెనీ నిబంధనలు పాటించకుండా ఏంచక్కా నిధులను మళ్లించారు. ఈ క్రమంలో బోర్డు అనుమతులు కూడా తీసుకోలేదు. ఈ అవకతవకల విలువ రూ.3,000 కోట్ల మేరకు ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీల నుంచి అవంత ¬ల్డింగ్స్‌ లబ్ధిపొందింది. దీంతోపాటు కంపెనీ బయటి మార్గాల ద్వారా కూడా నిధులను మళ్లించింది.

ఈ లావాదేవీలతో మెక్కారు…: 2016లో సీజీ పవర్కు చెందిన నాసిక్లోని భూమి, కర్మాగారాన్ని బ్లూగార్డెన్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్కు రూ.200 కోట్లకు విక్రయించారు. ఈ నిధుల్లో రూ.145 కోట్లను అవంత ¬ల్డింగ్స్‌(ఏహెచ్‌ఎల్‌)కు, రూ.53 కోట్ల నిధులను యాక్టాన్‌ అనే కంపెనీకి బదలాయించారు. ఇక్కడ నిధులు బదిలీ చేసిన కంపెనీలు రెండూ ఎటువంటి వ్యాపారాలు చేయవని తేలింది. ఇవి డవ్మిూ కంపెనీలు. ఈ రెండు కంపెనీలను 2016 మార్చిలో ఒకే చిరునామాతో ప్రారంభించారు. ఈ రెండిటి మూలధనం రూ.1,00,000 మాత్రమే. ఒకొక్క దానిపై 50 వేలు పెట్టుబడి.

2017లో సీజీ పవర్కు చెందిన ముంబయిలోని కంజూర్‌ మార్గ్‌ లోని భూమిని బ్లూగార్డెన్‌ ఎస్టేట్కు రూ.190 కోట్లకు విక్రయించింది. దీనికి బోర్డు అనుమతులు లేవు. వాస్తవానికి అప్పటికే ఈ భూమిని రూ.499 కోట్లకు విక్రయించేందుకు ఒక కంపెనీతో ఒప్పందం చేసుకొంది.. కానీ, ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండానే దీనిని బ్లూగార్డెన్‌ కు విక్రయించడం గమనార్హం. వచ్చిన డబ్బును మళ్లీ  యాక్టాన్‌ కంపెనీకి మళ్లించింది. వీటిలో  ఇద్దరు సీజీ ఉద్యోగులకు ఒకరికి రూ.3కోట్లు, మరొకరికి రూ.కోటి చెల్లించింది. కంపెనీ నుంచి నిధులకు బయటకు మళ్లించడానికి ఈ మార్గాన్ని ఎంచుకొన్నట్లు వైష్‌ అసోసియేట్స్‌ పేర్కొంది. ఈ లావాదేవీలకు బోర్డు అనుమతలు కానీ, రిస్క్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ అనుమతులు కానీ లేవు. అంతా మాయాజాలం.

ఇలా బయటపడింది…: అవంతి ¬ల్డింగ్స్‌ సంస్థ ఎస్‌ బ్యాంక్లో రూ.500 కోట్ల రుణం తీసుకొని రీపేమెంట్‌ కోసం పోస్టు డేటెడ్‌ చెక్కులను ఇచ్చింది. ఏప్రిల్‌ 2న ఎస్‌ బ్యాంక్‌ కు సీజీ పవర్‌ జారీ చేసిన ఒక చెక్కు బౌన్స్‌ అయింది. అప్పటికే మార్చి నుంచి సీజీ పవర్‌ మాతృ సంస్థ అవంత ¬ల్డింగ్స్‌ రుణదాతలు వద్ద తాకట్టు పెట్టిన షేర్లను జప్తు చేసుకోవడం మొదలైంది. ఈ క్రమంలో చెక్‌ బౌన్స్‌ కావడంతో ఆపరేషన్స్‌ కమిటీ దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆ చెక్కును గమనించి కమిటీ ఒక విషయం గుర్తించింది. సీజీ బోర్డు అనుమతి లేకుండానే ఈ చెక్కును జారీ చేసినట్లు తేల్చింది. దీంతో ఎస్‌ బ్యాంక్‌ బౌన్స్‌ అయిన చెక్‌ స్థానంలో మరో చెక్కును ఇవ్వాలని కోరింది. దీనికి సీజీ బోర్డు నిరాకరించింది. దీంతో ఎస్‌ బ్యాంక్‌ న్యాయ పోరాటానికి దిగింది. చెక్‌ పై సంతకం చేసిన కంపెనీ డైరెక్టర్లు, మాజీ సీఎఫ్‌ఓ వి.ఆర్‌. వెంకటేష్‌, బి.హరిహరన్‌ లకు (ఇద్దరూ పెద్ద ఆర్థిక ముదుర్లు) లీగల్‌ నోటీసులు జారీ చేసింది. బోర్డు అనుమతులు లేకుండా ఇటువంటివి ఐదు లావాదేవీలు జరిగినట్లు ఆపరేషన్స్‌ కమిటీ గుర్తించింది.

మళ్ళింపులోనే మెక్కుడు మతలబు: నిధులను మళ్లించడానికి సీజీ సంస్థకు విదేశాల్లోని అనుబంధ విభాగాలను సహజంగా బాగా వాడుకున్నాయి. గౌతమ్‌ థాపర్‌ ప్రమోటర్‌ గా ఉన్న అవంత ఇంటర్నేషన్‌ అనే సంస్థకు సీజీ నుంచి భారీ ఎత్తున వడ్డీ రహిత రుణం మంజూరైనట్లు తేలింది. దీనికి కూడా బోర్డు అనుమతులు లేవు. సీజీ మిడిల్‌ ఈస్ట్‌ అనే సంస్థ 40మిలియన్‌ డాలర్ల టర్మ్‌ లోన్‌ తీసుకొని ఆ మొత్తాన్ని సోలార్సీస్‌ అనే అవంత గ్రూప్‌ అనుబంధ సంస్థకు మళ్లించింది. ఇటువంటి మరిన్ని లావాదేవీలు జరిగాయి. తవ్వుతుంటే బయటపడుతున్నాయి.

‘ఎస్‌’ చేతులు కాలాక…’నో’: ఈ అక్రమాలు బయటకు రావడంతో ఛైర్మన్‌ గౌతమ్‌ థాపర్‌, సీఎఫ్‌ఓలను రాజీనామా చేయాలని బోర్డు కోరింది. ఇక కంపెనీ సీఈఓను దీర్ఘకాలం సెలవుపై పంపింది. ఈ పరిణామాలపై మాట్లాడేందుకు ఎస్‌ బ్యాంక్‌ నిరాకరించింది. (సిగ్గు అనిపిస్తుంది ఏమో..!). మిగిలిన నాలుగు లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇక సీజీ పవర్‌, దాని ప్రమోటర్‌ గౌతమ్‌ థాపర్లు ఈ వ్యవహారంపై నోరు మెదపలేదు. నోరు తెరిస్తే ఎక్కడ కక్కాల్సి వస్తుందోనని భయం కాబోలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close