Featuredజాతీయ వార్తలు

గోదావరిని కృష్ణాకు ఎలా తరలిస్తారు

  • ఉమ్మడిగా ఎపితో కలసి ప్రాజెక్టులు ఎలా కడతారు?
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సూటి ప్రశ్న
  • బిజెపిలో చేరిన వీరేందర్‌ గౌడ్‌

న్యూఢిల్లీ : ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్‌ ఎలా కడతారని బీజేపీ తెలంగాన అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. అంటే అప్పుడు చెప్పిన మాట అబద్ధమా?.. ఇప్పుడు చెబుతున్న మాటలు అబద్ధమా అని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇద్దరు సీఎంలు నీళ్ల పేరుతో దోపిడీకి ఎత్తుగడ వేశారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో కోట్లు వెదజల్లి టీఆర్‌ఎస్‌ గెలవాలనుకుంటోందని, టీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశమిస్తే భవిష్యత్‌ ఉండదన్నారు. నామినేషన్లు వేసేందుకు సిద్ధమైనవారిపై దొంగ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికే జగన్‌-కేసీఆర్‌ లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడతామంటున్నారని లక్ష్మణ్‌ ధ్యజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల అంశాన్ని కేసీఆర్‌ నిర్వీర్యం చేశారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన రాజ్యమేలుతోంది. బంగారు తెలంగాణ పేరుతో మాయమాటలు చెబుతున్నారు. ఉద్యమం సమయంలో తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకుందని దూషించి పబ్బం గడుపుకొన్నారు. ఇప్పుడు ఏపీతో కలిసి ప్రాజెక్టులు ఎలా కడతారు? కాంట్రాక్టర్ల జేబులు నింపడం, కవిూషన్ల కోసం ఏపీ సీఎంతో కలిసి కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ల నాటకం ఆడుతున్నారు. కాంట్రాక్టర్ల దగ్గర కవిూషన్లు దండుకుని కేసీఆర్‌ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. రూ.30 వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇప్పుడు రూ.80 వేల కోట్లకు చేరుకుందని లక్ష్మణ్‌ విమర్శించారు. మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు, తెలంగాణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు వీరెందర్‌ గౌడ్‌ బిజెపిలో చేరారు. లక్ష్మణ్‌,ఎంపి గరికపాటి,మురళీధర్‌ రావు, వివేక తదితరుల సమక్షంలో బిజెపి కార్యాలయంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ తీరును ఎండగట్టారు. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీలో చేరుతున్నానని మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ కుమారుడు, తెలంగాణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు వీరెందర్‌ గౌడ్‌ అన్నారు. సుదీర్ఘంగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ ను కలిశారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రసంశించారు. న్యూ ఇండియా చేయాలన్న మోదీ ఆలోచన తనకు బాగా నచ్చిందని, అందుకే బీజేపీలో చేరుతున్నానని వివరించారు. నయా భారత్‌ రావాలంటే మోదీతోనే సాద్యమన్నారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. మూడు రోజుల క్రితం వీరేందర్‌ గౌడ్‌ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close