Featuredస్టేట్ న్యూస్

గులాబీకి గుబులు..

 • అనుకూలంగా లేని ఉప ఎన్నిక ఫలితం
 • సొంతపార్టీ నేతలనే నమ్మని కేసీఆర్‌
 • స్వంత వ్యూహలతోనే రంగంలోకి
 • ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ఆధారంగా ప్రణాళిక

ఒక ఉప ఎన్నిక.. తెలంగాణలో జరుగుతున్న ఓకే ఒక ఉప ఎన్నిక అగ్రనేతలందరికి టెన్షన్‌ పుట్టిస్తుంది. స్వంత పార్టీలో మన వాళ్లెవరో, నమ్మించి వెన్నుపోటు పొడిచేవారెవరో అర్థం కాక తికమకపడుతున్నారు. ఏ పార్టీకి అక్కడ ఫలితం అనుకున్నంత ఆశాజనకంగా లేదు. పైకి మాత్రమే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ లోలోపల మాత్రం విజయం చేజారకుండా వ్యూహల మీద వ్యూహలు రూపొందిస్తున్నారు. గులాబీ పార్టీ అధినేత ఉప ఎన్నికల మీద రహస్యంగా స్వంత మనుషులతో సర్వేల మీద సర్వేలు చేపిస్తున్నారు. వారి అందించే రిపోర్టుల మీద నమ్మకం లేకనే మరెంటో తెలియదు కాని చివరకు ఇంటిలిజెన్స్‌ రిపోర్ట్‌ కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ గెలుపు వ్యూహలపై కసరత్తులు చేస్తున్నారు. ఎన్ని పాచికలు పారించినా టిఆర్‌ఎస్‌ అగ్రనేతకు మాత్రం హుజూర్‌ నగర్‌ లో జరుగుతున్న ఉప ఎన్నిక నిద్రలేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోలింగ్‌ ముగిసి ఫలితాలు వచ్చేవరకు అన్ని పార్టీల కంటే అధికార పార్టీకే టెన్షన్‌ ఎక్కువైనట్లు తెలిసిపోతుంది

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌:

హుజూర్నగర్‌ ఉప పోరులో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి. ఏలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కులాల వారీగా నేతలను రంగంలోకి దించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా బీజేపీ, టీడీపీ కూడా గెలుపు కోసం తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నాయి. హుజూర్నగర్‌ ఉపఎన్నిక టీఆర్‌ఎస్లో గుబులు రేగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నివేదికలు, సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమాత్రం ఆశాజనంగా లేదని తేలడంతో అధిష్టానం ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. హుజూర్నగర్లో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగితేనే గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ లీడర్లు అధినాయకత్వంతో వేడుకుంటున్నారని చెపుతున్నారు. హుజూర్నగర్లో ఎలాగైనా గులాబీ జెండా పాతాలన్న కృతనిశ్చయమంతో ముందుకెళ్తోన్న టీఆర్‌ఎస్కు స్థానిక సమీకరణాలు, పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే గ్రౌండ్‌ రిపోర్ట్ను తెప్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో మరింత ఫోకస్‌ పెట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారని చెపుతున్నారు.. దాదాపు పది రోజులుగా టీఆర్‌ఎస్‌ ఇన్ఛార్జులంతా హుజూర్నగర్లో మకాంవేసి, మండలాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ, పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు హైకమాండ్కు రిపోర్టులు పంపిస్తున్నారు. అయితే, పార్టీ నేతలు నివేదికలు పంపిస్తున్నా, కేసీఆర్‌ మాత్రం ప్రైవేట్‌ సర్వేలు చేయించుకుంటూ, రోజువారీ రిపోర్టుల ఆధారంగా టీఆర్‌ఎస్‌ బలాన్ని అంచనా చేస్తున్నారు. అయితే, సర్వే రిపోర్టులు గులాబీ బాస్ను కలవరం పెట్టిస్తున్నాయట. ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ కూడా టీఆర్‌ఎస్కు మైనస్గా ఉన్నట్లు తేలిందట. దాంతో కాంగ్రెస్‌ కంచుకోటలను బద్దలుకొట్టడానికి కేసీఆర్‌ కొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ అభ్య,ర్ధి సైదిరెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉండటం హైకమాండ్కి తలనొప్పిగా మారిందంటున్నారు. కేసీఆర్తో రెండు మూడు సభలు నిర్వహిస్తేనే పరిస్థితి ఏమైనా మారొచ్చని, లేదంటే గడ్డు పరిస్థితేనని హుజూర్నగర్‌ టీఆర్‌ఎస్‌ లీడర్లు అంటున్నారు.

చేసిన అభివృద్దిపై అందరూ పోటీనే

నియోజకవర్గ అభివృద్ధి కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశమవుతోంది. ముఖ్యంగా హుజూర్నగర్లో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్న దానిపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఉత్తమ్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో రోడ్లు, విద్యుత్‌, ఇళ్లు, ఎత్తిపోతల పథకాల విషయంలో మంచి అభివృద్ధి జరిగిందనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. దీంతో తానే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, టీఆర్‌ఎస్‌ హయాంలో ఏం జరగలేదని ఆయన చెప్పుకుంటున్నారు. రైతుబంధు లాంటి బృహత్తర సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అధికారంలో ఉన్నది తామే కనుక తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. దీనికి తోడు రెండు పార్టీల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా తీవ్రతరమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతల ఆగడాలపై ఆరోపణలు, పేకాట క్లబ్బులు, బలవంతంగా పార్టీల్లోకి మార్పు లాంటి అంశాలు కూడా ఈ ఎన్నికలను రక్తికట్టిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్లోకి వలసలు కూడా పెరగడంతో కాంగ్రెస్లో కొంత గుబులు మొదలైంది. అయితే, టీఆర్‌ఎస్లోకి వెళ్లిన వారు కొందరు మళ్లీ కాంగ్రెస్లోకి వస్తుండటంతో ఉత్తమ్‌ శిబిరం కొంత ఊపిరి పీల్చుకుంటోంది.

హుజూర్‌నగర్‌పై బులెటిన్‌ విడుదల చేసిన ఈసీ

హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్‌ ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు.

 • మొత్తం ప్రచార వాహనాల సంఖ్య – 104
 • ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500
 • సీజ్‌ చేసిన మద్యం : 7000లీటర్ల
 • కోడ్‌ ఉల్లంఘన కేసులు: 10
 • సి విజిల్‌ యాప్‌ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15

కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం.

అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు:

 • టిఆర్‌ఎస్‌ – శానంపూడి సైదిరెడ్డి – రూ.8,65,112
 • కాంగ్రెస్‌ – పద్మావతి రెడ్డి – రూ.5,27,621
 • బీజేపీ – కోట రామారావు – రూ.4,22,258
 • స్వతంత్ర అభ్యర్థి – తీన్మార్‌ మల్లన్న – రూ.3,73,945.
 • టిడిపి – చావా కిరన్మయి – రూ.3,46,968
 • స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్‌ – రూ. 10360
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close