గులాబి రాసుకుంటే అవినీతి కంపు మాయం : బాలరాజు గౌడ్

0

బోడుప్పల్ మున్సిపాలిటీలో నీ అవినీతిపరుల్లో నెంబర్ వన్ అంటూ రాపోలు రాములు పై తీవ్ర మైన ఆరోపణలు చేసిన తెరాస నాయకుడు మంద సంజీవరెడ్డి రాపోలునుపార్టీలో చేర్చుకుని బంగారు పూత పూయ డా న్ని మున్సిపల్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకుడు మాజీ ఉపసర్పంచ్ బాలరాజు గౌడ్ పేర్కొన్నారు.శనివారం ఆదాబ్ హైదరాబాద్ బోడుప్పల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ గతంలో అవినీతి పై బహిరంగ చర్చ అంటూ రాపోలు రాములు పై బహిరంగంగా విమర్శలు చేసిన మంద, తెరాస పార్టీలో కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యే ఎంపీ వరకు ఒక్కరైనా అవినీతిపరులు ఉంటే నిరూపించండి అని సవాల్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలలో తెరాస పార్టీ గ్రూపులతో సతమతమవుతుందని తెరాస పూర్తిగా అవినీతిపరులు తో నిండిపోయిందనడానికి రాపోలు చేరికనే ఉదాహరణ అని బాలరాజ్ గౌడ్ తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరిస్తూ తెలుగు దేశం నుండి కాంగ్రెస్ లోకి ఆపైన తెరాసలో చేరిన రాపోలు పై మంద చేసిన ఆరోపణలను వివరించారు.అమాయక ,పేద ప్రజలను మాయ మాటలతో మధ్య పెట్టి ప్రభుత్వ స్థలాలను వారికి అంటగట్టడం లో రాపోలు ది అందెవేసిన చేయిగా మంద అభివర్ణించారని ఆయన చెప్పారు. బోడుప్పల్ లో సర్వే నంబర్ 63 లోని ప్రభుత్వ స్థలాన్ని పేదలకు అమ్మి సొమ్ము చేసుకున్న రాపోలు రాములు అవినీతిని సాక్ష్యాధారాలతో బహిరంగ పరిచిన మంద సంజీవరెడ్డి ప్రస్తుతం ఆయనను తన వెనక సీట్లో కూర్చోబెట్టుకుని ఓట్ల కోసం ముందుకెళ్లడం సిగ్గుచేటైన విషయమని ఆయన విమర్శించారు రు. ప్రభుత్వ స్థలాలను నోటరీ చేసి అమ్మినట్లుగా తమ వద్ద అనేక సాక్షాధారాలు ఉన్నాయని, అదే విధంగా మరికొన్ని నోటరిలలో ఇతరులతో సంతకం చేయించి తను సాక్షిగా సంతకం పెట్టాడు అని బాలరాజ్ గౌడ్ వెల్లడించారు. అదేవిధంగా రాపోలు పై హత్యాయత్నం కేసు కూడా నమోదు అయిందని వసుంధర బ్యాంకును ప్రారంభించి వినియోగదారులను మోసం చేశాడని కూడా చీటింగ్ కేసు నమోదైందని బాలరాజ్ గౌడ్ మంద ఆరోపణలను ఉటంకించారు. 1993వ సంవత్సరం లోనే రాపోలు రాములు ఎస్సి ఎస్టి అట్రాసిటీ చట్టం కింద పలువురు పై కేసులు నమోదు చేయించాడని కక్షసాధింపు లో భాగంగా మంద పై కూడా కేసు నమోదు చేయించినట్లు వెల్లడించిన సంజీవరెడ్డి నేడు రాములు నీతిమంతుడుగా ప్రజల ముందుకు తీసుకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బోడుప్పల్ మున్సిపాలిటీలో అవినీతిపై బహిరంగ చర్చ అంటూ సవాల్ విసిరి రాపోలు తో చర్చకు దిగిన మంద సంజీవరెడ్డి , ఆయనను పార్టీలో చేర్చుకుని తెరాస పార్టీని అవినీతిపరుల మయంగా తీర్చిదిద్దారని బాలరాజు గౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గత లోక్సభ ఎన్నికలలో తెరాస ఓడిపోవడం ని గూర్చి వివరిస్తూ ప్రస్తుతం రావోలు పై చేసిన అవినీతి ఆరోపణలకు తగు రీతిలో వివరణ ఇవ్వని పక్షంలో మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు మాజీ ఉపసర్పంచ్ వై బాలరాజ్ గౌడ్ పేర్కొన్నారు.

రాపోలు అవినీతిపరుడే. : బండ ప్రభుత్వ స్థలాలను అమ్మడం లోనూ పేద ప్రజలను మోసం చేయడం లోనూ రాపోలు రాములు దిట్ట అని బి .ఎస్.పి సీనియర్ నాయకుడు బండ నరసింహ విమర్శించారు. రాపోలు పట్ల పేద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాను కరపత్రం వేసి e ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాలని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here